కలాకంద్ | ఇంతవరకు ఎవ్వరు చెప్పని నిజమైన టిప్స్ తో | ఇది అసలైన పద్ధతి
చిక్కని పాలు పంచదార ఉంటే చాలు స్వీట్ షాప్ స్టైల్ కలాకంద్ రెసిపీ చేయవచ్చు. కలాకంద్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
స్వీట్ షాప్లో ఇష్టంగా తినే “కలాకంద్” రెసిపీ నా సింపుల్ స్టెప్తో చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. బెస్ట్ కలాకంద్ కోసం కొన్ని టిప్స్ ఉన్నాయ్, అవి జాగ్రత్తగా ఫాలో అయితే స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వస్తుంది.
పాలు :
-
ఈ రెసిపీకి చిక్కని గేదే పాలు మాత్రమే ఉండాలి అప్పుడు కలాకంద్ రుచిగా ఉంటుంది. పాకెట్ పాలు వాడే వారు కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలు వాడుకోండి.
-
కలాకంద్ తయారయ్యే దాకా హై-ఫ్లేమ్ మీద కలుపుతూ మరిగించాలి. సన్నని సెగ మీద మరిగిస్తే మరుగుతూ చిక్కబడుతున్న పాలు అడుగుపట్టేస్తాయ్ కలాకంద్ రంగు మారిపోతుంది.
-
కలాకంద్ తయారయ్యే దాకా కలుపుతూనే ఉండాలి లేదంటే మీగడ కట్టేస్తుంది, కలాకంద్లో మీగడ ఏర్పడితే కలాకంద్ తినేందుకు బాగుండదు.
-
పాలు ముకుడులో పోసే ముందు కొద్దిగా నీళ్ళు పోసి తరువాత పాలు పోస్తే పాలు అడుగు పట్టడం కొంత వరకు నివారించవచ్చు.
ముకుడు:
-
కలాకంద్ చేసే పాత్ర లోతుగా “U” ఆకారంలో ఉండేది అయితే కలాకంద్ అడుగుపట్టకుండా కలపడానికి వీలవుతుంది.
-
ముకుడు, తీసుకున్న పాలకి రెండింతల సైజులో ఉండాలి.
-
కలాకంద్ కలపడానికి కూరలకి వాడిన చెక్క గరిటలు వాడకండి. స్టీల్ అట్ల కాడ పర్ఫెక్ట్.
నిమ్మ ఉప్పు – నిమ్మ రసం:
-
పాలు విరగకొట్టడానికి నిమ్మరసం లేదా నిమ్మ ఉప్పు వేసుకోవచ్చు నేను నిమ్మ ఉప్పు నీళ్ళలో కరిగించి వాడాను.
-
నిమ్మ ఉప్పు నీళ్ళు లేదా నిమ్మరసం కొలత పాల చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కొద్దిగా ఎక్కువగా ఉంచుకోవడం మేలు.
నెయ్యి:
-
కలాకంద్ లో ఎలాంటి నెయ్యి అవసరం లేదు. పాలు దగ్గర పడితే పాలలోంచి వచ్చే కొవ్వె సరిపోతుంది. యాలకల పొడి:
-
కలాకంద్ ఉడికాక కమ్మని పాల వాసనతో చాలా బాగుంటుంది యాలకల పొడి లాంటివి అవసరం లేదు కావాలంటే కొద్దిగా వేసుకోండి.

టిప్స్
ఆఖరుగా కొన్ని టిప్స్:
కలాకంద్ ఆరడానికి టైమ్ పడుతుంది, కుదిరితే రాత్రంతా లేదా కనీసం 4-5 గంటలు ఆరనివ్వాలి అప్పుడే కలాకంద్ పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇలా చేస్తే కలాకంద్ పొడి పొడిగా అవుతుంది:
కలాకంద్ని ఎక్కువ సేపు అంటే పాలు చిక్కబడి నెయ్యి పైకి వచ్చే దాకా ఉడికిస్తే మృదువుగా పూస కట్టిన కోవా తేమ ఆరిపోయి గట్టి పడి కలాకంద్ చల్లారాక పొడి పొడిగా అవుతుంది.

కలాకంద్ | ఇంతవరకు ఎవ్వరు చెప్పని నిజమైన టిప్స్ తో | ఇది అసలైన పద్ధతి - రెసిపీ వీడియో
Kalakand | Sweet Shop Style Perfect Kalakand | Real Kalakand Recipe with Tips & Tricks | Easy Sweet Recipes | How to make Kalakand Sweet
Prep Time 1 min
Cook Time 45 mins
Resting Time 5 hrs
Total Time 5 hrs 46 mins
Servings 12
కావాల్సిన పదార్ధాలు
- 2 liters చిక్కటి పాలు
- 1/2 cup పంచదార
- 2 Pinches నిమ్మ ఉప్పు
- 1/2 cup నీళ్ళు
విధానం
-
కచ్చితంగా అడుగు మందంగా లోతుగా ఉన్న మూకుడులో మాత్రమే 1/2 కప్ నీళ్ళు పోసి అందులో చిక్కటి పాలు పోసి కలుపుతూ పాలని ఇగరబెట్టాలి.
-
పాలు పొంగువచ్చాక మరో 15-20 నిమిషాలు మరిగించండి అప్పుడు కాస్త చిక్కబడతాయ్. అప్పుడు పాలల్లో పంచదార వేసి కలుపుతూ హై-ఫ్లేం సగం పైన ఇగరబెట్టాలి.
-
పాలు సగం పైన చిక్కబడ్డాక ¼ కప్ నీళ్ళలో నిమ్మ ఉప్పు వేసి కలిపి కరిగించి పక్కనుంచుకోండి.
-
ఇప్పుడు సగం పైన ఇగిరిన పాలల్లో కొద్ది కొద్దిగా నిమ్మ ఉప్పు నీరు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
- పాలు విరిగేదాకా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. (నిమ్మ ఉప్పు నీరు/ నిమ్మరసం అనేది పాల చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది).
-
మొత్తంగా నాకు కలాకంద్ని హై-ఫ్లేం మీద 50 నిమిషాలు కలిపాక పూసలు పూసలుగా ఖోవా దగ్గరపడింది.
-
పూసలు కట్టి దగ్గర పడ్డ కలాకంద్ ఇంకా కాస్త పాలు ఉండగానే ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆపేసి దింపి మూకుడు అంచులకి పలుచగా స్ప్రెడ్ చేసి 30 నిమిషాలు పూర్తిగా ఆరనివ్వాలి.
-
ఆ తరువాత నెయ్యి రాసిన ట్రే లో కలాకంద్ వేసి స్ప్రెడ్ చేసి 4-5 గంటలు ఆరనివ్వాలి, అప్పుడే ముక్కలు కోసందుకు వస్తుంది.
-
4-5 గంటలు లేదా రాత్రంతా చల్లారబెట్టాక ముక్కలుగా కోసుకోండి.

Leave a comment ×
4 comments