కంద కోడిగుడ్డు పులుసు | కంద కోడిగుడ్డు గ్రేవీ | కోడిగుడ్డు పులుసు | కంద పులుసు

కంద కోడిగుడ్డు పులుసు ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు మసాలాలు వేసి పులుసు కాచి అంధులు ఉడికించిన కంద ముక్కలు కోడిగుడ్లు వేసి మరిగించి చిక్కని కమ్మని తెలుగు వారి పులుసు వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.

సాధారణంగా తెలుగు వారు చింతపండు పులుసు పోసి కోడిగుడ్డు పులుసు చేస్తుంటారు, ఇంకా ఇలా ఏదో కాయ కూర వేసి కూడా చేస్తుంటారు. కానీ ఇది మసాలా పులుసు. కాస్త ఘాటుగా పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్

కంద:

కంద తరిగేప్పుడు చేతులకి నూనె రాసి తరుక్కుంటే దురద రాదు. కందని ఉడికించడానికి ముక్కలు మునిగేదాకా నీరు పోసి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికిస్తే ముక్క చిదురుగా అయిపోదు.

పులుసు:

సాదారణంగా పులుసు నిదానంగా ఎక్కువ సేపు మరగాలి అప్పుడే అసలైన రుచి.

బెల్లం:

పులుసులోని పిలుపుని బేలన్స్ చేయటానికి కొంచెం బెల్లం వేస్తే రుచిగా ఉంటుంది. నచ్చని వారు స్కిప్ చేసుకోండి.

ఇంకా:

ఇదే పులుసు మీరు కందకి బదులుగా బంగాళా దుంప, ఉడికించిన అరటికాయ ముక్కలు, చేమగడ్డ వేసి చేసుకోవచ్చు.

కంద కోడిగుడ్డు పులుసు | కంద కోడిగుడ్డు గ్రేవీ | కోడిగుడ్డు పులుసు | కంద పులుసు - రెసిపీ వీడియో

Kanda Kodiguddu Pulusu | Yam and Egg Gravy | Egg Pulusu

Bachelors Recipes | nonvegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 30 mins
  • Total Time 45 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms కంద
  • 5 ఉడికించిన కోడిగుడ్లు
  • మసాలా పేస్ట్ కోసం:
  • 3 tbsp నూనె
  • 1.5 inch దాల్చిన చెక్క
  • 3 లవంగాలు
  • 2 యాలకలు
  • ¼ cup ఎండు కొబ్బరి
  • అల్లం - చిన్న ముక్క
  • 7 - 8 వెల్లులి
  • 1 tbsp ధనియాలు
  • 1 tbsp నువ్వులు
  • ½ tbsp గసగసాలు
  • పులుసు కోసం:
  • 3 tbsp నూనె
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 10 - 12 సాంబార్ ఉల్లిపాయలు
  • పచ్చిమిర్చి - 2 చీలికలు
  • 2 sprigs కరివేపాకు రెబ్బలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ¼ tsp పసుపు
  • ½ tbsp కారం
  • 3 tbsp చింతపండు పులుసు
  • 1 tbsp బెల్లం
  • కొత్తిమీర - కొద్దిగా
  • ¼ tsp గరం మసాలా
  • 2 cups నీరు

విధానం

  1. చేతులకి నూనె రాసుకుని కందని కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని పసుపు ఉప్పు వేసిన నీళ్లలో వేసి కడిగి పక్కనుంచుకోండి.
  2. కుక్కర్లో కంద ముక్కలు, పసుపు, ముక్కలు మునిగేదాకా నీరు పోసి మూడు కూతలు హై ఫ్లేమ్ మీద రానివ్వండి.
  3. నూనె వేడి చేసి ఉడికించుకున్న గుడ్లకి గాట్లు పెట్టి కొద్దిగా పసుపు వేసి వేపి పక్కనుంచుకోండి.
  4. మిగిలిన నూనెలో మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద వేపి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  5. నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేపుకోవాలి.
  6. ఉల్లిపాయ మెత్తబడిన తరువాత కంద ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి ముక్కలు చిదిరిపోకుండా 2 నిమిషాలు వేపుకోండి.
  7. తరువాత మసాలా పేస్ట్ నీరు, చింతపండు పులుసు పులుసు పోసి రెండు పొంగులు రానివ్వండి.
  8. పులుసు ఉడుకు పట్టిన తరువాత, ఉడికించుకున్న గుడ్లు, బెల్లం వేసి, నూనె పైకి తేలనివ్వండి.
  9. దింపబోయే ముందు గరం మసాలా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.