కార బాత్ నీరు చట్నీ

బొంబాయ్ రవ్వ కొన్ని కాయ కూరలు పసుపు ఇంకా వాంగి బాత్ పొడి వేసి చేసే కార బాత్ వేడి వేడిగా నీరు చట్నీ ఒక అద్భుతమైన కాంబినేషన్. బెంగళూర్ ఇంకా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉదయాన్నే టిఫిన్గా ఎంతో ఇష్టంగా తింటారు.

చూడ్డానికి పసుపు ఇంకొన్ని కాయకూరలు వేసిన ఉప్మాలా ఉంటుంది, అలా అని అది ఉప్మా కాదు, కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఈ కారా బాత్ నీరులా పలుచగా ఉండే నీరు చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా నీరు చట్నీతో ఇడ్లీ దోశా ఎంతో ఇష్టంగా తింటారు బెంగళూర్ వారు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు టమాటో బాత్

ఈ రెసిపీలో కారా బాత్ ఇంకా నీరు చట్నీ రెసిపీ ఎంతో వివరంగా ఉంది చుడండి.

టిప్స్

వాంగి బాత్:

రవ్వ:

  1. బొంబాయ్ రవ్వ నెయ్యిలో సన్నని సెగ మీద కలుపుతూ మాంచి సువాసన వచ్చే దాకా కలుపుతూ వేపుకుంటే బాత్ మృదువుగా ఎంతో రుచిగా ఉంటుంది. కాయకూరలు:

  2. ఉల్లిపాయ టమాటో కాకుండా వేసే మిగిలిన బీన్స్ కేరట్ కాప్సికం బటాణీ అన్నీ కలిపి రవ్వలో సగం ఉండాలి. ఉల్లిపాయ సుమారుగా సమానంగా ఉండాలి. అప్పుడే సరైన రుచి.

నీరు:

  1. కప్పు రవ్వకి మూడు కప్పుల వేడి నీరు కచ్చితమైన కొలత.

పచ్చికొబ్బరి:

  1. తప్పక కొద్దిగైనా పచ్చికొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము కాస్త పెద్దగా ఉంటె పంటికి తగులుతూ ఎంతో రుచిగా ఉంటుంది.

వాంగి బాత్ పొడి:

  1. కప్పు రవ్వకి కొద్దిగా అంటే ఒక్క చెంచా వాంగి బాత్ పొడి వేస్తే చాలు, అంత కంటే అవసరం లేదు. వేసిన ఆ కొద్దిగా పొడే మాంచి సువాసనని ఇస్తుంది.

నీరు చట్నీ:

పుట్నాల పప్పు:

  1. వేసే ఆ కొద్దీ పుట్నాల పప్పు చట్నీ మరీ నీరుగా ఉంచకుండా కాస్త నోటికి అందేలా ఉంచడానికి. పప్పు అంత కంటే ఎక్కువ వేయకూడదు.

నీరు:

  1. నీరు చట్నీ చిక్కని సాంబార్ మాదిరి ఉండాలి, అప్పుడే అది కార బాత్లో నాని తినేందుకు ఎంతో రుచిగా ఉంటుంది.

ఆఖరుగా:

  1. కొందరు ఫ్లేవర్స్ని బేలన్స్ చేయడానికి చట్నీలో కొంచెం బెల్లం వేస్తారు, నేను వేయలేదు నచ్చితే మీరు వేసుకోవచ్చు.

కార బాత్ నీరు చట్నీ - రెసిపీ వీడియో

Kara Bath with Neer Chutney

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • కారా బాత్:
  • 1 cup రవ్వ
  • 3-4 tbsp నెయ్యి
  • 2 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1/2 tbsp సెనగపప్పు
  • 1/2 tbsp జీలకర్ర
  • 2 Sprigs కరివేపాకు
  • 1 tbsp అల్లం తురుము
  • 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 2 tbsp కేరట్ తరుగు
  • 2 tbsp బీన్స్ తరుగు
  • 2 tbsp కాప్సికం తరుగు
  • 2 tbspp బటాణీ
  • 1/4 cup టమాటో
  • 1/2 tbsp పసుపు
  • 1 tbsp పంచదార
  • కొత్తిమీర (చిన్న కట్ట)
  • 1 tbsp వాంగి బాత్ పొడి
  • 1 tbsp నిమ్మరసం
  • 2 tbsp పచ్చి కొబ్బరి తురుము
  • నీరు చట్నీ:
  • అల్లం (అంగుళం ముక్క)
  • 10-12 వెల్లులి (చిన్నవి)
  • 4-5 పచ్చిమిర్చి
  • కొత్తిమీర (చిన్న కట్ట)
  • 15-20 Leaves పుదీనా
  • ఉప్పు
  • 2 tbsp పుట్నాల పప్పు
  • చింతపండు
  • 250-300 ml నీరు
  • 200 gms పచ్చి కొబ్బరి
  • నీరు చట్నీ తాలింపు కోసం:
  • 1-1 1/2 tbsp నూనె
  • 1/2 tbsp ఆవాలు
  • 1 tbsp సెనగపప్పు
  • 1/2 tbsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • 2 pinches ఇంగువ
  • 2 Sprigs కరివేపాకు

విధానం

  1. కారా బాత్ కోసం నూనె నెయ్యి వేడి చేసుకోండి. అందులో ఆయాలు సెనగపప్పు జీలకర్ర కరివేపాకు వేసి వేపుకోవాలి
  2. వేగిన తాలింపులో అల్లం తురుము పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి మెత్తబడే దాకా వేపితే చాలు. వేగిన ఉల్లిపాయలో కాప్సికం కేరట్ బీన్స్ బటాణీ వేసి 2-3 నిమిషాలు వేపుకోండి.
  3. వేగిన కాయ కూరల్లో రవ్వ వేసి రవ్వ తెల్లబడే దాకా సన్నని సెగ మీద వేపుకోవాలి.
  4. రవ్వ తెల్లబడ్డాక టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేపి మరిగే వేడి నీరు పసుపు పంచదార వేసి కలిపి దగ్గరపడనివ్వాలి.
  5. రవ్వ దగ్గర పడ్డాకా వాంగీబాత్ పొడి చల్లి కొత్తిమీర తరుగు కలిపి పైన tbsp నెయ్యి వేసి కలిపి మూత పెట్టి ఇంకో 2-3 నిముషాలు వదిలేయండి.
  6. రవ్వ దగ్గర పడ్డాకా 1 tbsp నెయ్యి వేసి కదపకుండా మూత పెట్టి 3-4 నిమిషాలు సన్నని సెగ మీద వదిలేస్తే రవ్వ మగ్గుతుంది.
  7. దింపే ముందు స్టవ్ ఆపేసి నిమ్మరసం కొత్తిమీర తరుగు పచ్చి కొబ్బరి తురుము చల్లి కలిపి దింపేసుకోండి.
  8. చట్నీ కిశోరం ఉంచిన పదార్ధాలన్నీ వేసి కొద్దిగా నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి. తరువాత కప్పు నీటితో పలుచన చేసుకోండి.
  9. నూనె వేడి చేసి తాలింపు సామాగ్రీ వేసి మీడియం ఫ్లేమ్ మీద తాలింపుని ఎర్రగా వేపి చట్నీలో కలిపేసుకోండి.
  10. కార బాత్ ప్లేట్ మధ్యలో పెట్టి చుట్టూ నీరు చట్నీ పోసుకుని ఆశ్వాదించుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.