కర్ణాటకా స్టైల్ బోండా సూప్

కర్ణాటకా స్టైల్ బోండా సూప్ బ్రేకఫాస్ట్గా, స్టార్టర్గా లేదా స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. పల్చని పెసరపప్పు చారులో దూదిలాంటి మినపప్పు బొండాలు వేసి సర్వ్ చేస్తారు.

ఈ బోండా సూప్ పల్చగా, కాస్త కారంగా ఉంటుంది. సూప్ చేయడం కూడా చాలా తేలిక. సాంబార్కి ఉండే అన్నీ పదార్ధాలు కూడా ఉండవు. ఈ బోండా సూప్ నేను మొదటగా బెంగళూర్ వెళ్ళినప్పుడు మల్లేశ్వరంలో వల టిఫిన్ సెంటర్లో టెస్ట్ చేశా. ఏదో తెలియని కొత్త రెసిపీ కాకపోయినా ఈ సింపుల్ కాంబినేషన్ చాలా నచ్చేసింది. అందుకే ఈ రెసిపీ మీకు పరిచయం చేద్దామని పోస్ట్ చేస్తున్నా. బోండా సూప్ కచ్చితంగా ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్కి కాస్త భిన్నంగా అనిపిస్తుంది. రెసిపీ చాలా సింపుల్ అయినా గాని కొన్ని టిప్స్ రుచికరమైన బొండా సూప్నిస్తుంది.

టిప్స్

బొండాలకి పిండి ఎలా రుబ్బాలి:

  1. మినపప్పుని కడిగి కనీసం నాలుగు గంటలు నానబెట్టి తరువాత నీళ్ళన్నీ వడకట్టి ఫ్రీజలోని చల్లని నీళ్ళు చెంచాలతో పోసుకుంటూ మెత్తగా ఎక్కువసేపు రుబ్బుకోవాలి.

  2. మిక్సీ కంటే స్టోన్ గ్రైండర్ బెస్ట్. మిక్సీలో అయితే పప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కువసేపు రుబ్బుకోవాలి.

  3. రుబ్బిన పిండిని కనీసం 5 నిమిషాల పైన బాగా వేళ్ళతో బీట్ చేయాలి అప్పుడు పిండి లోపలికి గాలికి చేరి బొండాలు దూదిలా మెత్తగా బూరెల్లా పొంగుతాయ్. పప్పు మెత్తగా రుబ్బకపోయినా బాగా బీట్ చేయకపోయినా బొండాలు గట్టిగా వస్తాయ్ సూప్ని సరిగా పీల్చవ్!!!

బొండాలు నూనె వేస్తే ఎందుకు పేలుతున్నాయ్:

  1. పిండి మెత్తగా రుబ్బకపోయినా, రుబ్బిన పిండిని బాగా పొంగేదాక బీట్ చేయకపోయినా. బొండాలు నూనె వేశాక పేలతాయ్.

సూప్:

  1. పెసరపప్పు వేసి చేసే ఈ సూప్ పల్చగా ఉండాలి. ఇంకా పెసరపప్పు మెత్తగా ఉడకాలి కానీ పేస్ట్ అవ్వకూడదు. పప్పు పప్పుగానే ఉండాలి. అప్పుడు సూప్ రుచిగా ఉంటుంది.

  2. నేను ఈ సూప్లో వెల్లులి వేశాను నచ్చని వారు వేయకండి.

  3. సూప్ పల్చగా ఉండాలి. అప్పుడే బొండాలు సూప్ని లోపలిదాకా పీల్చుకుంటాయ్

సర్వ్ చేసే విధానం:

  1. బొండాలు సర్వ చేయడానికి 5 నిమిషాల ముందు వేడిగా ఉండే సూప్లో వేస్తే బొండాలు మరీ మెత్తగా అవ్వవు. లేదు మెత్తగా జ్యూసీగా బొండాలు తినడానికి ఇష్టపడే వారు నూనెలోంచి తీసిన వేడి వేడి బొండాలు సూప్లో వేసి నానబెట్టుకోండి.

  2. కర్ణాటకలో కొన్ని చోట్ల పైన ఉల్లిపాయ తరుగు వేసి సర్వ చేస్తున్నారు ఈ మధ్య. నచ్చితే వేసుకోండి. నాకు నచ్చలేదు ఆ రుచి.

కర్ణాటకా స్టైల్ బోండా సూప్ - రెసిపీ వీడియో

Karnataka special Bonda Soup | Urad dal Fritters in Spicy Dal Soup

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 4 hrs
  • Cook Time 20 mins
  • Total Time 4 hrs 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • బొండా కోసం
  • 1.5 cup మినపప్పు
  • ఫ్రిజ్లోని నీరు – పిండి రుబ్బుకోడానికి
  • ఉప్పు – తగినంత
  • సూప్ కోసం
  • 1/2 cup పెసరపప్పు (గంట సేపు నానబెట్టినది)
  • 2 tsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 అల్లం తరుగు
  • 1 వెల్లులి తరుగు
  • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు
  • 1/2 tsp పసుపు
  • 1 tsp కారం
  • 1 cup టొమాటో ముక్కలు
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 750 ml నీళ్ళు
  • 1 tbsp నిమ్మరసం
  • 1/4 cup పచ్చికొబ్బరి తురుము
  • 1/2 tsp మిరియాల పొడి

విధానం

  1. మినపప్పుని కడిగి కనీసం నాలుగు గంటలు నానబెట్టి ఆ తరువాత వాడకట్టిన పప్పులో ఉప్పు చల్లని నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. నానబెట్టిన పెసరపప్పులో 1.1/4 కప్పుల నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
  3. సూప్ కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పకచిమరిచి తరుగు, అల్లం, వెల్లులి ఇంగువ వేసి వేపుకోవాలి.
  4. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా మూతపెట్టి మగ్గించుకోవాలి. ఆ తరువాత టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు ,కారం వేసి టొమాటో ముక్కలు గుజ్జుగా అయ్యేదాక ఉడికించుకోవాలి.
  5. గుజ్జుగా అయిన టొమాటోలో పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేసి నీళ్ళు పోసి 10 నిమిషలు మూతపెట్టి మరిగించుకోవాలి.
  6. బాగా మరిగిన సూప్లో పచ్చికొబ్బరి తురుము, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.
  7. మెత్తగా రుబ్బుకున్న పిండిని ఐదు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత చేతులు తడి చేసుకుని వేడి నూనెలో పెద్ద బొండాల మాదిరి వేసి ఎర్రగా వేపుకోవాలి.
  8. బొండాలు ఎర్రగా బంగారు రంగులోకి వేగాక సూప్లో వేసి 5 నిమిషాలు ఉంచి సూప్తో పాటు సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.