కేసర్ బాదం కత్లీ
రాఖీకి దీపావళికి ఎక్కువగా కొనే స్వీట్స్లో ఒకటి కాజు కత్లీ, దానికే కాస్త భిన్నంగా ఇంకా రుచి, సువాసనతో తయారు చేసిన రెసిపీ “కేసర్ బాదాం కత్లీ”. 100% స్వీట్ షాప్స్ రుచి వస్తుంది. జాగ్రత్తగా టిప్స్ స్టెప్ ఫాలో అయితే.
ఈ కేసర్ బాదం కత్లీ కేవలం నాలుగు పదార్ధాలతో తయారవుతుంది. ఇంకా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది కూడా. ఈ కేసర్ బాదాం కత్లీ కూడా దాదాపుగా కాజు కత్లీ తీరులో చేసేదే కానీ రుచి సువాసన భిన్నంగా ఉంటుంది.
గిఫ్టింగ్కి శుభకార్యాలకి తప్పక అందరూ స్వీట్స్ కొంటుంటారు, నిజానికి స్వీట్ షాప్స్ లో దొరికే చాలా స్వీట్స్ కాస్త సమయం వెచ్చిస్తే మనమే ఇంట్లో బెస్ట్గా చేసుకోవచ్చు, ఇంకా ఎవరికైనా గిఫ్ట్ చేసి విస్మయ పరచొచ్చు.

టిప్స్
బాదాం:
- బాదాంని వేళ్ళ మధ్యన నలిపితే తోలు ఉది వచ్చేదాకా ఉడికిస్తే చాలు.
కుక్కింగ్ టిప్స్:
-
కత్లీ చేయడానికి అడుగు మందంగా ఉండే ముకుడు అవసరం లేదంటే అడుగుపట్టేస్తుంది
-
బాదాం పేస్ట్ పంచదార వేశాక మీడియం – హై ఫ్లేమ్ మీద చిక్కబడేదాకా కలుపుతూ ఉండాలి లేదంటే కచ్చితంగా అడుగుపట్టేస్తుంది
-
కత్లీ రుచి అంతా ఉడికించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. తక్కువగా ఉడికిస్తే సాగుతుంది ఎక్కువగా ఉడికిస్తే గట్టిగా అవుతుంది. అందుకే కత్లీ దగ్గర పడ్డాక చిన్న ఉండ వేళ్ళ మధ్య పెట్టి నలిపితే మెత్తని ఉండ ఏర్పడాలి అది సరైన ఉడుకు.
-
కత్లీ ఉండకట్టాక స్టవ్ ఆపేసి అదే మూకుడి అంచుల వెంట పాలచ్చగా పూసి జల్లెడ మూత పెట్టి కనీసం 5 గంటలు వదిలేస్తే బిగుసుకుంటుంది. ఇదే కత్లీ రెండింతలు కొలత చేసుకుంటే రాత్రంతా చల్లార్చినా పర్లేదు.
-
కత్లీ ¼ ఇంచు మందాన పల్చగా వత్తుకుని చదరంగా ఉండే కప్తో నున్నగా చేసుకుంటే కత్లీ షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది
కేసర్ బాదం కత్లీ - రెసిపీ వీడియో
Kesar Badam Katli | Perfect Sweet Shop Style Kesar Badam Katli
Prep Time 1 min
Cook Time 40 mins
Total Time 41 mins
Pieces 25
కావాల్సిన పదార్ధాలు
- 1.5 cup బాదాం (225 gm)
- నీళ్ళు
- 1/3 cup పాలు
- 200 gm పంచదార
- 1 tbsp కుంకుమ పువ్వు నీళ్ళు (చిటికెడు కుంకుమపువ్వు tbsp నీళ్ళలో నానబెట్టినది)
విధానం
-
బాదం పప్పులో నీళ్ళు పోసి సులభంగా తోలు ఊడే దాకా మూతపెట్టి ఉడికించుకోవాలి.
-
మెత్తగా ఉడికిన బాదంని వేళ్ళ మధ్యన పిండితే తోలు సులభంగా ఊడిపోతుంది. తోలు తీసుకున్న బాదంని నీళ్ళలో వేసుకోండి.
-
బాదంని వడకట్ట మిక్సీలో వేసి ముందు రవ్వగా చేసుకోండి తరువాత పాలు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
అడుగుమందంగా ఉన్న మూకుడులో బాదం పేస్ట్ పంచదార వేసి దగ్గర పడేదాకా అడుగుపట్టకుండా కలుపుతూనే ఉండాలి.
-
బాదం పేస్ట్ ముకుడుని వదిలి ముద్దగా అవుతున్నప్పుడు కుంకుమపువ్వు నీళ్ళు పోసి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలిపి చిన్న ఉండ వేళ్ళమధ్య పెట్టి నలిపితే ఉండ కట్టాలి.
-
ఉండ కడితే స్టవ్ ఆపేసి మూకుడు అంచులకి పల్చగా కత్లీని పూసి గాలికి 5 గంటలు వదిలేయాలి.
-
5 గంటల తరువాత అట్ల కాడతో గీరితే వచ్చేస్తుంది, ఆ తరువాత చపాతీ పిండిలా పగుళ్లు లేకుండా వత్తుకోవాలి.
-
బదమ పిండి ముద్దని అప్పడాల కర్రతో ¼ ఇంచ్ మందాన, అంచులని సర్దుకుంటూ సమానంగా వత్తుకోవాలి.
-
తరువాత చదరంగా ఉండే కప్తో రుద్దితే నున్నగా అవుతుంది అప్పుడు పైన సిల్వర్ ఫాయిల్ వేసి డైమేండ్స్గా కట్ చేసుకోండి.

Leave a comment ×
2 comments