ఖుస్కా బెస్ట్ పులావ్
ఖుస్కా...ఇది రాయలసీమ ఇంకా తమిళనాడులో చాలా ఫేమస్. ఏ ఫంక్షన్లోనైనా ఇది ఉండాల్సిందే! ఇంకా చిన్న చిన్న బండ్ల మీద కూడా దీన్ని అమ్ముతుంటారు! ఇది నాన్ వెజ్ కర్రీస్ తోను, ఇంకా రైతా తోనూ చాలా రుచిగా ఉంటుంది. ఇదే ఖుస్కా లో నాన్-వెజ్ వేసి కూడా చేస్తారు!
వీకెండ్ ఏదైనా స్పెషల్ చేయాలని అవీ ఇవీ అని వెతకడం మానేసి ఖుస్కా రైస్ ఇంకా చల్లని రైతా చేయండి. తృప్తిగా ముగిస్తారు వీకెండ్ని.
ఈ ఖుస్కా రైస్ ఒక రకంగా టొమాటో రైస్ లాంటిదే కానీ, రుచి సువాసన భిన్నంగా ఉంటుంది.

టిప్స్
బాస్మతి బియ్యం:
• నేను బాస్మతి బియ్యం వాడాను, మీరు కావాలంటే సోనా మసూరి బియ్యం కూడా వాడుకోవచ్చు.
• ఏ బియ్యం వాడినా గంట నానబెట్టాలి.
• బాసమతి బియ్యం అయితే కప్ బియ్యానికి కప్ నీరు సరిపోతుంది. హై- ఫ్లేమ్ మీద ఒక వీసీల్ వస్తే చాలు. అప్పుడు పొడి పొడిగా వస్తుంది.
• అదే సోనా మసూరి బియ్యం అయితే కప్ బియ్యనికి 1.3/4 నీళ్ళు పోసి 2 కూతలు రానివ్వాలి. ఒకటి హై- ఫ్లేమ్ మీద మరొకటి మీడియం ఫ్లేమ్ మీద.
• నేను చెప్పినట్లు బియ్యాన్ని నానబెట్టి, ఎసరు పోసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఖుస్కా. లేదా ముద్దగా ఉంటుంది.
• ఏ బియ్యం వాడినా మెతుకు విరగకుండా నిదానంగా బియ్యాన్ని పొడి పొడిగా అయ్యేదాక వేపుకోవాలి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది.
టొమాటో:
• దేశవాళీవి అదే నాటు టొమాటోలు వాడితే చాలా రుచిగా ఉంటుంది ఖుస్కా. అదే హైబ్రీడ్ వాడితే ½ చెక్క నిమ్మరసం పిండుకోవాలి .
జాజికాయ, అనాసపువ్వు:
• ఖుస్కాలో జాజికాయ, అనాసపువ్వు కచ్చితంగా వాడితే ఎంతో రుచిగా ఉంటుంది.

ఖుస్కా బెస్ట్ పులావ్ - రెసిపీ వీడియో
Khuska Pulao Recipe | Khuska Biryani | Vegetable Khuska | How to make Khuska
Prep Time 5 mins
Cook Time 20 mins
Resting Time 10 mins
Total Time 35 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బాస్మతి బియ్యం (గంటపాటు నానబెట్టినవి)
- 1/2 cup నెయ్యి
- ఉల్లిపాయ- మీడియం సైజు తరుగు
- 3 పచ్చిమిర్చి చీలికలు
- 2 పండిన టమాటో
- 1/2 bunch పుదినా
- 1/2 bunch కొత్తిమీర
- 1/2 cup పెరుగు
- 4 యాలకలు
- 4 లవంగాలు
- 1 ఇంచ్ దాల్చిన చెక్క
- 1 అనాసపువ్వు
- జాజికాయ- చిన్న పలుకు
- 1 బిరియాని ఆకు
- 1 tsp జీలకర్ర
- 1 tsp సోంపు
- సాల్ట్
- 1 tsp అల్లం వెల్లూలి ముద్ద
- 1/4 spoon పసుపు
- 1 tsp కారం
- 1/2 tsp గరం మసాలా
- 1 cup నీళ్ళు
విధానం
-
ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి కరిగించి, అందులో యాలకలు, లవంగాలు, చెక్కా, అనాసపువ్వు, జాజి కాయ, బిరియాని ఆకు వేసి వేయించుకోండి.
- జీలకర్ర, సోంపు వేసి వేయించి ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వాలి .
-
అల్లం వెల్లూలి ముద్ద వేసి వేయించి అందులో పండిన టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు కారం, గరం మసాల వేసి టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా నిదానంగా కుక్ చేసుకోండి.
-
½ కప్ కమ్మటి చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ నిదానంగా పెరుగులోంచి నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ కుక్ చేసుకోండి.
-
నెయ్యి పైకి తేలాక కొత్తిమీర, పుదినా తరుగు వేసి బాగా కలుపుకుని గంట పాటు నానా బెట్టిన బాస్మతి బియ్యం వడకట్టి వేసి, నిదానంగా గింజ విరగకుండా ఓ నిమిషం పాటు వేపుకోండి హై-ఫ్లేం మీద.
-
కప్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి కేవలం హై-ఫ్లేం మీద మాత్రమే ఓ విసిల్ రానిచ్చి, 20 నిమిషాలు వదిలేయండి.
-
20 నిమిషాల తరువాత కుక్కర్ మూత తీసి అడుగునుండి అట్లకాడతో కలుపుకొండి. అంతే ఘుమఘుమలాడే ఖుస్కా తయార్.
-
రైతా తో, ఏదైనా మసాలా కర్రీ తో, నాన్ వెజ్ కర్రీస్ తో ఎలా తిన్నా చాలా బాగుంటుంది.

Leave a comment ×
9 comments