ఈ స్టైల్లో రొయ్యల పులావ్ చాలా సులభంగా చేసేవచ్చు. స్పెషల్ రోజులని ఇంకాస్త స్పెషల్ గా మార్చేస్తుంది.

పులావ్లు చాలా తీరుల్లో చేస్తారు. ప్రాంతాన్ని బట్టి వొక్కవరు ఒక్కో తీరుగా చేస్తారు.

ఈ రొయ్యల పులావ్ జస్ట్ రొయ్యలు వేపి టాస్ చేసి తీసుకోవాడమే! ఇలా చేసే రొయ్యల పులావ్ ఇంటికి బందువులు వచ్చినప్పుడు సులభంగా చేసేసుకోవచ్చు. జస్ట్ పొడి పొడిగా అన్నం వండి ఉంచుకుంటే చాలు.

Easy Prawns Pulao Recipe | How to make Prawns Pulao Recipe

టిప్స్

రొయ్యలు:

• ఏ రొయ్యలు అయినా రుచిగానే ఉంటాయి. నాకు నది రొయ్యలు నచ్చుతాయ్ సముద్రపు, చెరువు రొయ్యల కంటే.

• రొయ్యల లోని నీరు ఆవిరై కాస్త వేగి నూనె పైకి తేలితే చాలు. ఎక్కువగా వేపితే రొయ్యలు రబ్బరులా అవుతాయ్ .

• ఉప్పు కారాలు సరిపోను వేశాను మీకు తగినట్లుగా మార్చుకోవచ్చు.

బియ్యం:

• నేను బాస్మతి బియ్యం వాడాను. నచ్చితే సోనా మసూరి బియ్యం, లేదా పొడి పొడిగా వండుకున్న మిల్లెట్స్ కూడా వాడుకోవచ్చు

• బియ్యం ఉడికించెప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తే అన్నానికి ఉప్పు బాగా పడుతుంది.

ఈసీ రొయ్యల పులావ్ - రెసిపీ వీడియో

Easy Prawns Pulao Recipe | How to make Prawns Pulav Recipe

Pulao and Biryanis | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms రొయ్యలు
  • 220 gms బాసుమతి రైస్ (ఉప్పేసి ఉడికించి చల్లార బెట్టినది)
  • 1/4 cup నూనె
  • 1 tbsp నెయ్యి
  • 1 ఉల్లిపాయ
  • 4 పచ్చిమిర్చి
  • 2 tbsps కొత్తిమీర
  • 2 tbsps పుదినా తరుగు
  • 1 tbsp అల్లం వెల్లూలి పేస్టు
  • 1.5 tbsp కారం
  • 1/2 tsp పసుపు
  • 1 tsp గరం మసాలా

విధానం

  1. నూనె వేడి చేసి అందులో పసుపు వేసి, ఆ తరువాత పచ్చి రొయ్యలు వేసి మీడియం ఫ్లేం మీద రొయ్యల్లోని నీరు ఇగిరి నూనె పైకి తేలేదాకా వేపుకుని ఓ బౌల్ లోకి తీసుకోండి.
  2. ఇప్పుడు అదే మూకుడులో మరో 2 tsp నూనె వేసి ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోండి.
  3. ఉల్లిపాయలు సగం పైన వేగాక అప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా వేపుకోండి.
  4. ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుండగా అప్పుడు అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా వేపుకోండి.
  5. ఇప్పుడు రొయ్యలు వేసి బాగా మరో 3 నిమిషాలు వేపుకుని పొడి పొడిగా ఉడికిన్చుకున్న అన్నం వేసి బాగా కలిపి, పైన కొత్తిమీరా, పుదినా తరుగు నెయ్యి వేసి బాగా కలిపి దింపి రైతా తో సర్వ్ చేసుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

8 comments

  • K
    Kommu Sai kiran Sai kiran
    Recipe Rating:
    Good morning anna i am also chef but your recipe is to.......good.........super anna
  • T
    Thadikamalla Nagendhra
    Simply 👌
  • S
    Sasipatnala
    Recipe Rating:
    U are amazing
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Someone helping made two mistakes. Improper cooking of rice and 2 minutes extra roast of prawns. Next time I don’t take anyone help. Rest everything is ok
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    I made a mistake. Rice quantity and its boiling was improper. Rest of all is good.
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Amazing the taste and balancing the ingredients. Superb Mr.Teja. My daughter and son-in-law also ate it with stomach full. God bless you.
  • P
    prathima
    Recipe Rating:
    very delicious
  • J
    Joshika mahesh
    Recipe Rating:
    Superb looking so good
Easy Prawns Pulao Recipe | How to make Prawns Pulao Recipe