బెంగాలీ స్పెషల్ స్వీట్ని లవంగ్ లతికా
దుర్గా పూజా దీపావళికి బెంగాలీలు స్పెషల్ గా చేసుకునే స్వీట్ లవంగ్ లతికా. పిండి ముద్దలో కోవా స్టఫ్ చేసి పంచదార పాకంలో ఊరబెట్టే రసాలూరే స్వీట్ లవంగ్ లతికా.
బెంగాలీ స్పెషల్ స్వీట్ని లవంగ్ లతికాని బెంగాలీలు లబొంగ్ లతికా అని పిలుస్తారు. లవంగ్ లతికా స్వీట్ నేను మాడిచిన తీరులోనే కాదు చాలా రీతుల్లో మాడుస్తుంటారు. నాకు మొదటి నుండి ఈ మడత సులభంగా అనిపిస్తుంది. లవంగ్ లతికా చేయడం తేలికే అయినా వేపే తీరు తీరు ఎంతో ముఖ్యం. చేసే ముందు కచ్చితంగా టిప్స్ ఒక్కసారి చూసి చేయండి.

టిప్స్
మైదా:
-
నచ్చితే మైదాకి బదులు గోధుమపిండి కూడా వాడుకోవచ్చు.
-
పిండిని నెయ్యితో బాగా తడిపితేనే గుల్లగా వస్తాయి లవంగ్ లతికలు.
-
మైదా పిండిణి ఎక్కువ సేపు పగుళ్లు లేకుండా పూరీ పిండి అంత గట్టిగా వత్తుకోవాలి అప్పుడు పిండి చక్కగా సాగుతుంది
స్టఫ్ఫింగ్:
-
చాలా మంది యాలకలపొడికి బదులు జాజికాయ పొడి వేస్తారు. నచ్చితే మీరు వేసుకోవచ్చు
-
నేను ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయలేదు, నచ్చితే డ్రై ఫ్రూట్స్ తవోటీ ఫరోవతి కూడా వేసుకోవచ్చు
వేపే విధానం:
-
లతికలు నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి నెమ్మదిగా వేపుకోవాలి. అప్పుడు గుల్లగా వేగుతాయ్. మంట ఎక్కువగా ఉంటే లతికలు క్రిస్పీగా వేగవు అప్పుడు అంత రుచిగా ఉండదు
-
నా మూకుడు సైజు పెద్దది కాబట్టి అన్నీ ఒకే సారి వేశాను, మీరు 4-5 వేసి వేపుకుని తీసుకోండి.
-
లతికలు ఎర్రగా వేగాక బయటకి తీసి వేడి మీదే చేత్తో నొక్కితే తెలుస్తుంది ఎంత బాగా వేగినది.
-
వపైన లతికలని వేడి పాకంలో 30 సెకన్లు మునిగేలా ఉంచి వెంటనే తీసేయాలి లేదంటే మెత్తగా అవుతాయ్
పాకం:
-
పాకం నూనెలా కాస్త జిగురుగా ఉంటే చాలు, ఎక్కువ చిక్కగా అయితే పాకం కోవా దాకా చేరదు
-
పాకంలో పటిక లేదా నిమ్మరసం వేయాలి అప్పుడు లతికలు చల్లరినా పాకం రవ్వగా అవ్వదు.
-
లతికలు వేసేప్పుడు పాకం వేడిగా ఉండాలి, అప్పుడే పాకం పీలుస్తాయ్. ఒకవేళా పాకం చల్లారితే ఎప్పుడైనా వేడి చేసుకోవచ్చు.
బెంగాలీ స్పెషల్ స్వీట్ని లవంగ్ లతికా - రెసిపీ వీడియో
Lavang Latika | Bengali Labang Latika | Lobongo Lotika | Loung Latika
Prep Time 10 mins
Cook Time 25 mins
Total Time 35 mins
Pieces 14
కావాల్సిన పదార్ధాలు
-
పిండి కోసం
- 250 gms మైదా
- 1/2 tsp వంట సోడా
- 4 tbsp నెయ్యి
- నీళ్ళు తగినన్ని
- 15 లవంగాలు
- నూనె – వేపుకోడానికి
-
స్టఫ్ఫింగ్ కోసం
- 100 gms పచ్చి కోవా (పంచదార వేయనిది)
- 1 tbsp బొంబాయ్ రవ్వ
- 1/2 tsp యాలకలపొడి
-
పాకం కోసం
- 400 gms పంచదార
- 1/2 cup నీళ్ళు
విధానం
-
మైదాలో సోడా నెయ్యి వేసి బాగా కలుపుకుని తగినన్ని నీళ్ళు చేర్చుకుంటూ పగుళ్లులేని మృదువైన పిండిగా వత్తుకోండి.
-
కోవాలో రవ్వ యాలకలపొడి వేసి కలిపి పక్కనుంచుకోండి.
-
పంచదారలో నీళ్ళు పోసి లేత జిగురు పాకం వచ్చేదాక మరిగించి దింపేసుకోండి.
-
వత్తుకున్న పిండిని మళ్ళీ బాగా వత్తి సాగదీసి నిమ్మకాయంత ఉండలుగా చేసుకోండి.
-
ఉండాలని పొడవుగా వత్తుకోండి, వత్తుకున్న పిండి మీద నీళ్ళతో తడి చేసుకోండి.
-
గోళీ సైజు కోవా ముద్ద మధ్యలో పెట్టి పై పిండి మధ్యకి మడవాలి, కింద పిండి పై పిండి మీదికి వేసి ఉంచాలి.
-
పిండి ముద్దని పూర్తిగా తిరగతిప్పి రెండు అంచులని ఒక దాని మీదికి మరొకటి వేసి మధ్యన లవంగం గుచ్చి పక్కనుంచుకోండి.
-
నూనె తాకగలిగెంత వేడిగా ఉన్నప్పుడు లతికలు అన్నీ వేసి లో-ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
లతికలు వేగడానికి కనీసం 12-15 నిమిషాల సమయం పడుతుంది. ఎర్రగా వేగిన లతికలని వేడి పాకంలో వేసి 30 సెకన్లు మునిగేలా ఉంచి తీసి పక్కనుంచుకోండి.
-
గాలి చొరని డబ్బాలో ఉంచితే వారం పైన నిలవ ఉంటాయ్.

Leave a comment ×