మిగిలిపోయిన అన్నంతో అట్లు | మిగిలిపోయిన అన్నంతో దోశ | ఇన్స్టంట్ దోశ

మిగిలిపోయిన అన్నంతో ఇన్స్టంట్ దోశ  మిగిలిపోయిన అన్నం గోధుమపిండి రవ్వ పెరుగు వేసి మెత్తగా రుబ్బి వేసే అట్లు పొద్దుపొద్దున్నే ఏ టిఫిన్స్ చెయ్యాలి అని హాడావిడిపడిపోకుండా ఆదుకునే రుచికరమైన టిఫిన్. వేడి వేడిగా కొబ్బరి పచ్చడి లేదా మీకు నచ్చిన ఇంకేదైనా చట్నీ ఉంటె చాలు ఈ సింపుల్ ఇన్స్టెంట్ దోశకి. 

సాధారణముగా అందరిళ్ళలో అన్నం మిగిలిపోతుంటుంది కాబట్టి దాన్ని చాలా మంది ఏ తాలింపు పెట్టి పులిహోర లేదా మరింకేదైనా మసాలా అన్నమో చేస్తుంటారు, కానీ ఈ సారి ఇలా చేసుకోండి మీకు తప్పక నచ్చేస్తుంది. 

టిప్స్

పిండిని రుబ్బే తీరు :

ఈ పిండి మెదగడానికి సమయం పడుతుంది. కాబట్టి నిదానంగా రుబ్బుకోండి. ఇంకా అన్నం మిక్సీలో సులభంగా నలగదు, ఆగిపోతుంటుంది. కాబట్టి కొద్దిగా కొద్దిగా నీరు వేసి ఆపి కలిపి మెత్తగా అట్టు పిండి మాదిరి రుబ్బుకోవాలి.

వంట సోడా:

పిండి పిలిస్తే అట్టు గుల్లగా తేలికగా ఉంటుంది, అందుకే ఈ పిలవని ఇన్స్టెంట్ పిండి కొద్దిగైనా వంట సోడా వేసి బాగా కలిపి కనీసం 10 నిమిషాలలైనా ఊరానివ్వాలి.

అట్టు కాల్చే తీరు:

ఈ అట్టు మామూలు మినపట్టు మాదిరి త్వరగా కాలదు, అందుకే నిదానంగా కాల్చుకోండి. ఒక వైపు కాలిన తరువాత తిరగ తిప్పి మరో వైపు కూడా ఒక నిమిషం కాలనివ్వాలి.

అట్టుని కూడా మరీ పల్చగా కాక కాస్త మందంగా వేసుకుంటే పెనాన్ని అంటకుండా సులభంగా వచ్చేస్తుంది.

పిండి:

నేను గోధుమ పిండి వేశాను మీకు అభ్యంతరం లేనట్లైనతే చక్కగా మైదా పిండి వేసుకోండి గోధుమ పిండికి బదులుగా, చాలా రుచిగా ఉంటాయి

పెరుగు:

పుల్లని పెరుగు వాడుకోగలిగితే చాలా బాగుంటాయి ఇంకా చాలా బాగా వస్తాయి అట్లు. ఇంకా ఫ్రిజ్లోంచి తీసిన చల్లని పెరుగు వాడకండి. చల్లని పెరుగు పిండిని త్వరగా ఊరనివ్వదు.

మిగిలిపోయిన అన్నంతో అట్లు | మిగిలిపోయిన అన్నంతో దోశ | ఇన్స్టంట్ దోశ - రెసిపీ వీడియో

Leftover Rice Instant Dosa | Instant Dosa with Leftover Rice | Leftover Rice Recipe

Breakfast Recipes | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 2 cups ఉడికించుకున్న అన్నం
  • 1 cup గోధుమ పిండి
  • 1 cup రవ్వ
  • 1 cup పుల్లని పెరుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 tsp వంట సోడా
  • నీరు - పిండి రుబ్బుకోవడానికి తగినంత

విధానం

  1. అట్టు కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి నీళ్లతో మెత్తగా రుబ్బుకోండి.
  2. మెత్తగా రుబ్బుకున్న పిండిలో ఉప్పు, వంట సోడా వేసి బాగా కలిపి ఇంకో 15 నిమిషాలు పులియనివ్వండి.
  3. 15 నిమిషాల తరువాత నాలుగు నూనె బొట్లు వేసి పెనాన్ని ఉల్లిపాయతో బాగా రుద్దితే, అట్టు అంటకుండా వస్తుంది
  4. వేడెక్కిన పెనం మీద పెద్ద గరిటెడు పిండి పోసి కాస్త మందంగా అట్టు పోసుకోండి. కాలుతున్న అట్టు అంచుల వెంట నూనె వేసి ఎర్రగా కాల్చండి. తరువాత మరో వైపు ఇంకో నిమిషం కాల్చి తీసుకోండి.
  5. ఈ ఆటుని వేడి వేడిగా నచ్చిన చట్నీతో ఆశ్వాదించండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    srimayyia
    "Your veg recipes prove that plant-based meals can be both nutritious and indulgent. Thanks for making vegetarian cooking so enticing!" Sri Mayyia is one of the best Caterers in Bangalore offers Innovative catering, fusion food, premium and Luxury Catering Services for Wedding, Small Parties, Griha Pravesh and Corporate parties in Bangalore. We are considered as one of top Veg Caterers in Bangalore. For more info visit our official website https://www.srimayyiacaterers.co.in/