లెమన్ చికెన్ ఫ్రై
చికెన్ ఫ్రై అంటే మీతో పాటు నాకు చాలా ఇష్టం! అదే చికెన్ ఫ్రై తక్కువ నూనె తో మరింత రుచిగా ఉంటే ఇంకా చెప్పేదేముంది? లెమన్ చికెన్ ఫ్రై రెస్టారంట్ స్టైల్, ఇండో చైనీస్ స్టైల్ ఇలా చాలా తీరులు ఉన్నాయి. ఈ లెమన్ చికెన్ ఫ్రై పూర్తిగా దేశీ స్టైల్.
ఇది కారంగా పుల్లగా ఘాటుగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ లెమన్ చికెన్ నేను తెలుగు వారి కోడి వేపుడుకి కాస్త ఉత్తరభారత దేశం టచ్ చేశాను. చికెన్ వేపుడు అందరూ చేసేదే కానీ ఎంత వేగినా తేమగా ఉండాలి బయట క్రిస్పీగా లోపల మృదువుగా ఉండాలి అది సరైన చికెన్ ఫ్రై. ఆలాంటి మృదువైన చికెన్ ఫ్రై రెసిపీకి టిప్స్ ఈ రెసిపీ టిప్స్లో ఉన్నాయి చూడండి.
ఈ చికెన్ వేపుడు చారు, పప్పు చారుతో నంజుడుగా ఎంతో రుచిగా ఉంటుంది.

టిప్స్
-
చికెన్ వేపుడుకి మీడియం కట్ చికెన్ ఉంటే బాగుంటుంది. కర్రీ కట్ అయితే ముక్కలు వేగాక మరీ చిన్నవిగా అయిపోతాయ్
-
లెమన్ చికెన్ల్లో కాస్త కారం ఉంటే రుచిగా ఉంటుంది. ఆ కారం పచ్చిమిర్చి నుండైతే ఇంకా బాగుంటుంది. అందుకే నేను 4-5 కారంగా ఉండే పచ్చిమిర్చి వాడాను. పచ్చిమిర్చి ముక్కలు నూనె వేగి పులుపు ఉప్పు పట్టి చాలా బాగుంటాయ్. కావాలంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాడుకోవచ్చు
-
చికెన్కి మసాలాలు బాగా రుద్ది పట్టించి ఫ్రిజ్ లో రాత్రంతా ఉంచితే చాలా బాగుంటుంది మసాలాలు బాగా ముక్కలి పడతాయ్. కుదరనప్పుడు కనీసం రెండు గంటలు ఉంచుకోండి.
-
నేను బ్రాయిలర్ కోడి వాడాను. మీరు నాటుకోడి కూడా వాడుకోవచ్చు. అయితే చికెన్ ముక్కలు కచ్చితంగా మసాలాల్లో బాగా నానని. నిదానంగా వేగాలి.
-
ఈ లెమన్ చికెన్ వేపుడు డీప్ ఫ్రై కాదు. కొంచెం నూనెలో నెమ్మదిగా పొడిపొడిగా వేపుకుంటాము. ఒక రకంగా చికెన్ రోస్ట్. ఈ చికెన్ రోస్ట్కి నాన్ స్టిక్ పాన్ కంటే ఇనుప ముకుడులు పర్ఫెక్ట్. కొంచెం అడుగుపట్టి ఎక్స్ట్రా రోస్ట్ అయి చాలా బాగుంటుంది చికెన్.
లెమన్ చికెన్ ఫ్రై - రెసిపీ వీడియో
Lemon Chicken Fry | Spicy Juicy Lemon Chicken Fry at Home
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1/2 kg చికెన్
- 1/2 cup పెరుగు
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- 2 tbsp కొత్తిమీర తరుగు
- 4 - 5 పచ్చిమిర్చి ముక్కలు
- ఉప్పు
- 3/4 tsp మిరియాల పొడి
- 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
- 1 tsp ధనియాల పొడి
- 1/2 tsp గరం మసాలా
- 2 tsp నూనె
- 2 tbsp నిమ్మకాయ రసం
- 3 - 4 tbsp చికెన్ వేపడానికి నూనె
విధానం
-
చికెన్ లో పదార్ధాలన్నీ వేసి చికెన్ ముక్కలని బాగా మసాజ్ చేయండి.
-
మసాజ్ చేసిన చికెన్ని ఫ్రిజ్లో రాత్రంతా లేదా 2 గంటలు ఉంచండి.
-
ముకుడు వేడి చేసుకోండి. అందులో నానబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద చికెన్లోని నీరు ఇగిరిపోయేదాక ఫ్రై చేయండి.
- చికెన్లోని నీరు ఆవిరై నూనె పైకి తేలాక మంట మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకోండి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి.
-
పదిహేను పద్దెనిమిది నిమిషాలకి చికెన్ పూర్తిగా లోపలిదాకా వేగి నూనె వదులుతుంది. అప్పుడు మూత తీసి మరో 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేపుకుంటే క్రిస్పీగా అవుతుంది దింపేయండి.
-
ఈ సింపుల్ లెమన్ చికెన్ ఫ్రై పప్పు పప్పుచారుతో చాలా రుచిగా ఉంటుంది .

Leave a comment ×
1 comments