మద్రాస్ ఫ్రై ఇడ్లీ
మిగిలిపోయిన ఆహారం వాటితో అసలు వాటికంటే రెసిపీ చాలానే చేస్తుంటారు, అలాగే ఇడ్లీలు ఎంతో ఇష్టంగా తినే తమిళవారు సృష్టించిన రెసిపీ ఫ్రై ఇడ్లీ. కారంగా ఘాటుగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రై ఇడ్లీ చేస్తుంటే ఇల్లంతా తాలింపు సువాసనలే! ఇడ్లీ ఫ్రై సాయంత్రాలు టీ తోపాటు లేదా డిన్నర్ కి సింపుల్ గా తినాలనుకున్నా పర్ఫెక్ట్. మీరు చెన్నై, లేదా తమిళనాడు లో సాయంత్రాలు ఏ వీధిలో వెళుతున్నా బండ్ల మీదే చేసే ఇడ్లీ ఫ్రై సువాసనలు పిలుస్తుంటాయ్. తమిళనాడులో స్ట్రీట్ ఫుడ్గా ఎంతో ఫేమస్ అయిన ఈ రెసిపీ ఇప్పుడు పెళ్ళిళ్ళలోనూ హోటల్స్లోనూ స్పెషల్గా సర్వ చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఫ్రై ఇడ్లీకున్న క్రేజ్. ఫ్రై ఇడ్లీ రెసిపీ చేయడం చాలా చాలా సులభం. జస్ట్ 3 నిమిషాల్లో తయారు. కానీ చిన్నవే అయినా కచ్చితమైన టిప్స్ చాలా అవసరం. అవన్నీ వివరంగా టిప్స్లో ఉంచాను చూడండి.

టిప్స్
- చల్లారిన రవ్వ ఇడ్లీ అయినా, చెన్నై స్టైల్ బియ్యం పోసి చేసే ఇడ్లీ అయినా పర్లేదు.
స్ట్రీట్ ఫుడ్ టెస్ట్ రావలంటే:
- ఈ రెసిపీ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ అసలైన స్ట్రీట్ ఫుడ్ రుచి రావలంటే మాత్రం కచ్చితంగా నూనెలో ఉల్లిపాయ వేసిన దగ్గరనుండి రెసిపీ పూర్తయ్యే దాకా హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలి అప్పుడే స్మోకీ ఫ్లేవర్తో అసలైన మద్రాస్ ఫ్రై ఇడ్లీ రుచి ఫ్లేవర్ వస్తుంది.
ఫ్రై ఇడ్లీ రుచిగా ఉండాలంటే:
-
పూర్తిగా చల్లారిన ఇడ్లీ అయితే బిరుసెక్కి టాస్ చేసేప్పుడు విరగవు. వేడి ఇడ్లీ అయితే చిదురుగా అయిపోతాయ్.
-
టొమాటోలు వేగిన తరువాత పోసిన నీళ్ళు ఇంకా మిగిలి ఉండగానే ఇడ్లీ ముక్కలు వేసి ఇడ్లీ చిదిరిపోకుండా హై-ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. తేమ ఆరిపోయాక ఇడ్లీ వేస్తే మసాలాలు ఇడ్లీలోకి ఇంకవు. పైపైనే అంటుకుని అంత రుచిగా ఉండదు.
-
నేను బటన్ ఇడ్లీ వాడుతున్నా మీరు మామూలు ఇడ్లీ వాడేట్లయితే 4 సగాలుగా చేసుకోండి.
-
నచ్చితే ఇడ్లీని ఎర్రగా నూనెలో వేపి టాస చేస్తే ఇంకా బాగుంటుంది. అలా కూడా చేయవచ్చు.
మద్రాస్ ఫ్రై ఇడ్లీ - రెసిపీ వీడియో
Madras street food style Fry Idli | Idly fry with Leftover idlis | How To Make Idli Fry
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 2
కావాల్సిన పదార్ధాలు
- 6 చల్లారిన ఇడ్లీ (4 ముక్కలుగా చేసినవి)
- 2 tbsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 2 రెబ్బలు కరివేపాకు
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 2 పచ్చిమిర్చి ముక్కలు
- ఉప్పు
- 1 tsp అల్లం వెల్లులి ముద్ద
- 1 tbsp ధనియాల పొడి
- 1 tsp కారం
- 1 cup టొమాటో ముక్కలు
- 1/3 cup నీళ్ళు
- 1 tsp నిమ్మరసం
- 1/4 tsp గరం మసాలా
- కొత్తిమీర – కొద్దిగా
విధానం
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేపుకోవాలి
-
ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు లేత గులాబీ రంగు వచ్చే దాకా వేపుకోవాలి
-
మెత్తబడిన ఉల్లిపాయాల్లో ధనియాల పొడి, కారం వేసి 30 సెకన్లు హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి
-
టమాటో ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీదే కలుపుతూ గుజ్జుగా అయి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
-
టొమాటో గుజ్జుగా అయ్యాక నిమ్మరసం, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద కాస్త నీరు మిగిలేదాక ఉడికించుకోవాలి
-
ఇడ్లీ వేసి గ్రేవీలోని నీరు పీలుచుని గ్రేవీ అంతా ఇడ్లీకి పట్టేలా నెమ్మదిగా తిప్పుకుంటూ హై ఫ్లేమ్ మీదే రెండు – మూడు నిమిషాలు వేపుకోవాలి
-
దింపే ముందు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.

Leave a comment ×