బచ్చలి కూర పప్పు
కమ్మని పప్పు, కాచిన నెయ్యి ఉంటే తెలుగు వారు తృప్తి పడిపోతారు. రోజూ భోజనంతో పప్పు ఉండాల్సిందే! అందుకే తెలుగు వారు దాదాపుగా అన్నీ కాయ ఆకు కూరలతో కమ్మని పప్పు చేస్తారు. ఆలాంటి కమ్మని పప్పుల్లో ఒకటి ఈ బచ్చలి కూర పప్పు.
తెలుగు వారి భోజనంలో మొదటగా పచ్చడి తరువాత పప్పు ఆ తరువాత కూర వేపుడు ఇలా వరస ఉంటుంది తెలుగు వారి భోజనం అంటే!!! పప్పు అంటే ప్రతీ ఇంట్లో రోజూ ఉండాల్సిందే! పప్పు అందరికీ తెల్సినదే కానీ నా తీరు మరింత రుచిగా కమ్మగా ఉంటుంది. బచ్చలి కూర పప్పు అందరూ కందిపప్పు లేదా పెసరపప్పుని నానబెట్టి చేస్తారు. నేను కొంచెం భిన్నంగా చేస్తాను, ఆ తీరునే మీకు చెప్తున్నా!
ఈ పప్పు వేడి అన్నం నెయ్యి పచ్చడి లేదా ఆమ్లెట్తో నంజుకుంటూ తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

టిప్స్
-
పప్పు ఉడికించడానికి ముందు ఎప్పుడూ బాగా నానాలి అప్పుడు పప్పు మెత్తగా ఉడుకుతుంది
-
నానిన కందిపప్పుతో పాటు కొంచెం నానిన పెసరపప్పు పచ్చి శెనగపప్పు వేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది.
-
పప్పులో చింతపండు వేసి ఉడికిస్తే పప్పు మెత్తగా ఉడకదు అందుకే పప్పు ఉడికిన తరువాత చింతపండు పూలుసు పోసి ఉడికించుకోండి.
-
పప్పులో కొందరు బచ్చలి ఆకుతో పాటు ఉల్లిపాయ వేసి ఉడికించి వెల్లులి తాలింపు పెడతారు. మీరు అలాగే చేసుకోవచ్చు. నేను ఉల్లి వెల్లులి వాడలేదు.
-
పప్పుకి కమ్మని నెయ్యి తాలింపు ఎంతో రుచి. కావాలంటే వేరుశెనగ నూనె అయినా వాడుకోవచ్చు.
-
బచ్చలి ఆకు లేతగా ఉంటే కాడలు వేసుకోండి. ఆకు ముదిరితే కాడలు వేయకండి. ఆ కాడలతో మజ్జిగ పులుసు పెడితే చాలా రుచిగా ఉంటుంది.
బచ్చలి కూర పప్పు - రెసిపీ వీడియో
Malabar Spinach Dal | Bachala Aaku Pappu | Healthy Recipe
Prep Time 5 mins
Total Time 5 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup నానబెట్టిన కంది పప్పు
- 2 tsp నానబెట్టిన పెసరపప్పు
- 2 tbsp నానబెట్టిన పచ్చిసెనగపప్పు
- 1/4 tsp పసుపు
- 4 పచ్చిమిర్చి
- 3 కట్టలు బచ్చలి ఆకు తరుగు (250gms)
- 2 tbsp చింతపండు పులుసు (ఉసిరికాయ అంత చింతపండు నుండి తీసినది)
- 2 cups నీళ్ళు
- ఉప్పు
-
తాలింపు కోసం
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp పచ్చిశెనగపప్పు
- 1 tsp మినపప్పు
- 1/2 tsp జీలకర్ర
- 2 ఎండుమిర్చి
- ఇంగువ – 2 చిటికెళ్లు
- 1 కరివేపాకు
- 1/4 cup టొమాటో ముక్కలు
విధానం
-
కుక్కర్లో నానిన కందిపప్పు పెసరపప్పు పచ్చిసెనగపపు పసుపు పచ్చిమిర్చి బచ్చయి ఆకు తరుగు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విసిల్స్ రానివ్వాలి.
-
పప్పు స్టీమ్ పోయాక మెత్తగా ఎనుపుకోండి. పప్పులో ఉప్పు చింతపండు పులుసు పోసి ఒక ఉడుకు రానిచ్చి దింపేసుకోవాలి.
-
నూనె వేడి చేసి అందులో తాలింపు సామనంతా వేసి తాలింపు ఎర్రగా వేపుకోవాలి.
-
ఆకారున టొమాటో ముక్కలు వేసి టొమాటో మెత్తబడే దాకా వేపి పప్పులో కలుపుకోవాలి.

Leave a comment ×
5 comments