మంగుళూర్ దోసకాయ సాంబార్
మనసారా తృప్తిగా భోజనం ముగించడానికి “మంగుళూరు దోసకాయ సాంబార్” చక్కని ఎంపిక అవుతుంది. దక్షిణ భారత దేశంలో ఎన్నో రకాల సాంబారులున్నాయ్ అన్నీ వేటికవే ప్రేత్యేకం, అందులో ఒకటి మంగుళూర్ దోసకాయ సాంబార్ ఒకటి. మంగులూరు దోసకాయ సాంబార్ మసాలా పేస్ట్తో స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో ఉంది చూడండి.
మంగుళూరు సాంబార్ మాంచి రంగు రుచి చిక్కదనం ఘుమఘుమలాడిపోతూ కమ్మగా ఉంటుంది. మంగుళూరు సాంబార్ మిగిలిన వారి సాంబార్లా మసాలాల ఘాటు ఎక్కువగా ఉండదు, కమ్మగా తక్కువ కారం, పులుపుతో కమ్మగా ఉంటుంది.
చాలా సులభంగా సూపర్ హిట్ సాంబార్ చేయవచ్చు ఈ టిప్స్తో చేస్తే:

టిప్స్
-
సాంబార్ మసాలా కోసం వేసిన పదార్ధాలన్నీ సన్నని సెగమీద కలుపుతూ వేపుకుంటే పప్పు లోపలి దాకా వేగి సాంబార్ ఘుమఘుమలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది.
-
మంగుళూర్ సాంబార్లో కచ్చితంగా బాడిగీ లేదా కాశ్మీరీ మిరకాయలు వాడాలి. ఈ మిరపకాయలు సాంబార్కి మాంచి రంగు రుచినిస్తాయ్. గుంటూర్ మిరపకాయలు కారాన్ని ఇస్తాయ్. నేను వాడిన మిరపకాయలు బాగా కారంగా ఉండటానా రెండే వాడాను. మీరు మరో 3-4 పెంచుకోండి.
-
మంగుళూరు సాంబార్లో పచ్చికొబ్బరి కాస్త ఎక్కువగా ఉండాలి, చింతపండు తక్కువగా ఉండాలి. ఈ సాంబార్ ఎక్కువ కారంగా పుల్లగా ఉండదు. ఆఖరున వేసే బెల్లం కూడా కొద్దిగా ఎక్కువగానే వేయాలి. కావాలంటే బెల్లం తగ్గించుకోవచ్చు.
-
సాంబార్ ఎంత ఎక్కువసేపు మరిగితే అంత రుచిగా ఉంటుంది.
-
మంగుళూర్ దోసకాయ సాంబార్కి ఆకుపచ్చ పసుపుపచ్చ చారలున్న దోసకాయనే వాడతారు. దొరకనట్లైతే పసుపు రంగులో ఉండే గట్టి దోసకాయ కూడా పర్లేదు. కీర దోసకాయ అంత రుచిగా ఉండకపోవచ్చు.
-
దోసకాయ లోని గింజలు తీసేసి కాస్త పెద్ద ముక్కలుగా ఉండాలి. దోసకాయ కూడా మరీ మెత్తగా ఉడికితే సాంబార్ తయారయ్యే పాటికి గుజ్జుగా అయిపోతుంది. అందుకే దోసకాయ సగం పైన ఉడికాక చింతపండు పులుసులో ఉడికిస్తే ముక్క మరీ మెత్తగా ఉదకదు.
మంగుళూర్ దోసకాయ సాంబార్ - రెసిపీ వీడియో
Mangalore Cucumber Sambar | Dosakaya Sambar | Sambar Powder | How to make Sambar
Prep Time 5 mins
Cook Time 30 mins
Total Time 35 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
సాంబార్ మసాలా కోసం
- 1 tbsp పచ్చి శెనగపప్పు
- 1 tbsp మినపప్పు
- 1 tsp జీలకర్ర
- 1.5 tbsp ధనియాలు
- 1/2 tsp మిరియాలు
- 1/4 tsp మెంతులు
- 1 రెబ్బ కరివేపాకు
- 6 బాడిగీ మిర్చి
- 3 - 5 గుంటూర్ మిర్చి
- 1 tsp నూనె
- 1/4 cup కొబ్బరి
-
సాంబార్ కోసం
- 1/4 cup కంది పప్పు (గంట సేపు నానబెట్టినది)
- 1.5 cup నీళ్ళు (పప్పు ఉడికించుకోడానికి)
- చింతపండు – నిమ్మకాయంత
- 1/4 tsp పసుపు
- ఉప్పు
- 1 దోసకాయ (150 gms)
- 1 ఉల్లిపాయ (పెద్ద ముక్కలు)
- 1 tsp నూనె
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 2 tsp బెల్లం
- కొత్తిమీర – చిన్న కట్ట
- 1 కరివేపాకు
- 400 ml నీళ్ళు
-
తాలింపు కోసం
- 2 tsp నూనె
- 1 tsp ఆవాలు
- 3 ఎండుమిర్చి
- 1/4 tsp ఇంగువ
- 2 రెబ్బలు కరివేపాకు
విధానం
-
నానబెట్టిన కండిపప్పుని కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించి ఎనిపి పక్కనుంచుకోండి.
-
పాన్లో సాంబార్ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేగి మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి.
-
పప్పులు వేగిన తరువాత స్టవ్ ఆపేసి పచ్చికొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేపి మిక్సీ వేసి నీళ్ళతో మెత్తని వెన్నలాంటి పేస్ట్ చేసుకోండి
-
సాంబార్ కాచే గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ గింజలు తీసేసిన దోసకాయ ముక్కలు వేసి వక నిమిషం వేపుకోవాలి.
-
నిమిషం తరువాత 250 ml నీళ్ళు పసుపు ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి
-
10 నిమిషాల తరువాత ఉడికించి ఎనుపుకున్న కందిపప్పు, సాంబార్ మసాలా పేస్ట్, మిగిలిన 125ml నీళ్ళు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు వేసి కలిపి మూతపెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద సాంబార్ మరగనివ్వాలి.
-
తాలింపుకోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటచిట అనిపించి ఆ తరువాత ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేపి సాంబార్ లో కలిపేసుకోవాలి. అంతే కమ్మని చిక్కని సాంబార్ వేడిగా అన్నంతో అప్పడం నంజుకుంటూ తింటే చాలా రుచిగా ఉంటుంది.
-
15 నిమిషాలకి సాంబార్ చిక్కబడి మసాలాలు బాగా ఉడికి ఘుమఘుమలాడిపోతుంది, అప్పుడు బెల్లం కొత్తిమీర తరుగు వేసి కలిపి ఐదు నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి

Leave a comment ×
8 comments