మామిడి పండు మజ్జిగ చారు | మాంబలం పులిస్సేరీ

మామిడిపండుతో ఎంతో తృప్తినిచ్చే కేరళ స్టైల్ మామిడిపండు మజ్జిగ చారు రెసిపీ. ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

పులిస్సేరీ అంటే మజ్జిగ పులుసు/పులుసు, ఉత్తరాది వారు ఖడీ. కేరళ వారికి ఎన్నో కమ్మనైనా పులిస్సేరీలున్నాయ్, కానీ వేసవిలో తప్పక ఇష్టంగా తినే పులిస్సేరీ ఈ మాంబలం పులిస్సేరీ!

తెలుగు వారు ఎలాగూ మజ్జిగన్నంలో మామిడిపండు నంజుకుతింటారు, ఇది కూడా అలాంటిదే, కానీ షడ్రసాలతో ఉంటుంది. భోజనం ఆఖరున ఈ మాంబలం పులిస్సేరీతో ముగిస్తే ఆ తృప్తే వేరు.

Mango Kadhli | Mambazha Pulisserry Recipe | Mambalam Pulisseri | Mango Buttermilk Stew

టిప్స్

  1. మామిడిపండు నలిపి గుజ్జుగా తీసుకోండి. టెంకకి ఉన్న గుజ్జు అలాగే వదిలేయండి.

  2. మామిడిపండు తీపిని బట్టి ఉప్పు కారం వేసుకోండి. నిజానికి ఈ పులిస్సేరీ కమ్మగా ఉంటుంది.

  3. నేను తీసుకున్న మామిడి బాగా తియ్యగా ఉన్నా కారణంగా నేను ½ చెక్క నిమ్మరసం పిండాను. ఇది పూర్తిగా ఆప్షనల్. పులుపు నచ్చకున్నా, పెరుగు పుల్లగా ఉన్నా నిమ్మరసం అవసరం లేదు

  4. పెరుగు వేసేప్పుడు మంట పూర్తిగా తగ్గించి పెరుగు పులుసులో కలిసేదాకా కలుపుతూ ఉండాలి అప్పుడే తరకలు ఉండవు పెరుగులో.

మామిడి పండు మజ్జిగ చారు | మాంబలం పులిస్సేరీ - రెసిపీ వీడియో

Mango Kadhli | Mambazha Pulisserry Recipe | Mambalam Pulisseri | Mango Buttermilk Stew

Curries | vegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 2 పండు మామిడిపండ్లు
  • 1/2 cup పచ్చికొబ్బరి
  • 1/2 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • ఉప్పు
  • 300 ml నీళ్ళు
  • 1/2 tsp కారం
  • 1.5 tbsp పచ్చిమిర్చి పేస్ట్
  • పసుపు – చిటికెడు
  • తాలింపు
  • 2 tsp కొబ్బరి నూనె / శెనగ నూనె
  • 2 చిటికెళ్ళు మెంతులు
  • 1 tsp ఆవాలు
  • 2 ఎండు మిర్చి
  • 1 రెబ్బ కరివేపాకు
  • ఇంగువ – చిటికెడు

విధానం

  1. మిక్సీ లో కొబ్బరి మిరియాలు జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
  2. మామామిడిపండుని మెత్తగా నలిపి గుజ్జు తీసుకోండి
  3. పులుసు కాచే గిన్నెలో కొబ్బరి పేస్ట్, మామిడిపండు గుజ్జు ఇంకా మిగిలిన పదార్ధాలన్నీ వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానివ్వాలి
  4. పొంగువచ్చాక చిలికిన పెరుగు వేసి మంట తగ్గించి పులిస్సేరీలో కలిసేదాకా కలుపుతూనే ఉండాలి. పెరుగు కలిశాక ఒక్క పొంగురానివ్వాలి
  5. తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి వేపి పులిస్సేరీలో కలుపుకోవడమే
  6. ఇది అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Mango Kadhli | Mambazha Pulisserry Recipe | Mambalam Pulisseri | Mango Buttermilk Stew