మసాలా వడలు
నానబెట్టిన పచ్చిశెనగపప్పుని రుబ్బి కొన్ని మసాలాలు వేసి బాగా కలిపి వడలుగా తట్టి తీస్తే తెలుగు వారు సాయంత్రాలు ఎంతో ఇష్టంగా తినే మసాలా వడ రెడీ. వేడి వేడి మసాలా వడలు టీతో సారైనా జోడీ!
నానబెట్టిన పచ్చిశెనగపప్పులో ఉల్లి, అల్లం వెల్లులి వేసి చేసే ఈ వడలని మసాలా వడలు అంటారు. ఈ మసాలా వడలు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రాలు ఏ వీధిలో బండ్ల మీద అయినా సులభంగా దొరికేస్తాయ్. నానబెట్టిన పచ్చిశెనగప్పుతోనే కాదు అలసందలతో కూడా ఇదే విధంగా మసాలా వడ వేస్తారు.
ఈ వడలు వేడి మీద చాలా రుచిగా ఉంటాయి. ఈ సింపుల్ మసాలా వడ రెసిపీ చేయడం చాలా తేలికే, కానీ పప్పు రుబ్బేప్పుడు వడలు వేసేప్పుడు, నూనెలో వేసిన వదలని కాల్చేప్పుడు కొన్ని టిప్స్ అవసరం. ఆ టిప్స్తో కరకరలాడే మసాలా వడ వచ్చి తీరుతుంది.
కాబట్టి వడలు చేసే ముందు టిప్స్ ఫాలో అవ్వండి బెస్ట్ మసాలా వడని ఆనందించండి.

టిప్స్
పచ్చిశెనగపప్పు:
పచ్చి సెనగపప్పు కడిగి 3-4 గంటలు నానబెడితే చాలు. పప్పుని కాస్త బరకగా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి పలుచన అయితే వడ రాదు.
సొయా కూర:
నేను మసాలా వడ ఫ్లేవర్ పెంచడానికి కొంచెం సొయా కూర వేసాను. సొయా కూర వేసిన మసాలా వడ రుచి చాలా బాగుంటుంది. సొయ కూరకి బదులు కొయ్య తోటకూర ఆకు తరుగు కూడ వేసుకోవచ్చు
వడలు కాల్చే తీరు:
-
వడ వేసేప్పుడు చేతులు తడి చేసి మరిగే నూనెలో వేసి కదపకుండా రెండు నిమిషాలు వదిలేయాలి.
-
2-3 నిమిషాల తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి
వడ విరిగిపోతుంటే?
-
పిండి పలుచన అయిపోయి వడ రాకపోతే కాస్త బియ్యం పిండి , లేదా సెనగపిండి కొద్దిదిగా వేసి వడ కట్టి నూనె వేసి వేపి తీసుకోండి
-
పిండి నీరు బాగా తక్కువుగా ఉన్న వడ రాదుపొడిలో పొడిగా అయిపోతుంది. పప్పు కూడా చెమ్చాలతో నీరు పోసుకుంటూ బరకగా గట్టిగా రుబ్బుకోవాలి.
మసాలా వడలు - రెసిపీ వీడియో
Masala vada | Perfect Crispy Masala Vada
Prep Time 5 mins
Soaking Time 4 hrs
Cook Time 20 mins
Total Time 4 hrs 25 mins
Pieces 14
కావాల్సిన పదార్ధాలు
- 1 cup పచ్చి సెనగపప్పు
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 2 పచ్చిమిర్చి తరుగు
- 1 tsp జీలకర్ర
- 1 tsp అల్లం తరుగు
- 1 tsp వెల్లులి తరుగు
- ఉప్పు
- 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
- 3 tbps సొయా కూర (ఆప్షనల్)
విధానం
-
కడిగి నాలుగు గంటలు నానబెట్టిన పచ్చిశెనగపప్పులోంచి పిడికెడు పప్పు తీసి పక్కనుంచుకొంది. మిగిలిన పప్పులోని నీటిని వడకట్టి మిక్సీలో వేసుకొండి.
-
మిక్సీలో వేసిన పప్పుని చెమ్చాలతో కొద్దీ కొద్దిగా నీరు పోసుకుంటూ బరకగా గట్టిగా రుబ్బుకోవాలి.
-
రుబ్బుకున్న పిండిలో పక్కనుంచుకున్న సెనగపప్పు మిగిలిన సామాగ్రీ అంతా వేసి గట్టిగా పిండుతూ వడ పిండి కలుపుకోవాలి. (తడి చేతుల పైన వడ తట్టి చుడండి రానట్లయితే కాసింత బియ్యం పిండి వేసి కల్పి వడ చేసుకోండి).
-
చేతులు తడి చేసి నిమ్మకాయ సైజు పిండి ముద్దని తట్టి వేడి నూనెలో వేసి రెండు నిమిషాలు వదిలేయండి.
-
రెండు నిమిషాల తరువాత మీడియం ఫ్లేమ్ మీద కారకరలాడేట్టు వేపి తీసుకోండి.

Leave a comment ×
2 comments