మెక్సికన్ రైస్ | సింపుల్ వన్ పాట్ మెక్సికన్ రైస్ రెసిపీ

రైస్తో ఏదైనా స్పెషల్ అనగానే ఎప్పుడూ తినే ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్, లేదా బిర్యానీలే కాదు, ఎంతో రుచిగా ఉండే మెక్సికన్ రైస్ కూడా ట్రై చేయవచ్చు. సింపుల్ వన్ పాట్ మెక్సికన్ రైస్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

నేను చాలా రైస్ రెసిపీస్ చేశాను, ఎప్పుడూ ఇది చాలా బాగుంటుంది, మీకు తప్పక నచ్చుతుంది అంటుంటాను, ఏమి చేయను రైస్ రెసిపీస్ అంటే నాకు చాలా ఇష్టం. నాలా రైస్ రెసిపీస్ ఇష్టపడే వారికి తప్పక నచ్చే ఈసీ రెసిపీ ఈ మెక్సికన్ రైస్. ఇందులోనే మెక్సికన్ చికెన్ రైస్ రెసిపీ కూడా ఉంది అది ఇంకా బాగుంటుంది, త్వరలో పోస్ట్ చేస్తా ఆ రెసిపీ.

మెక్సికన్ రైస్ రుచి భారతీయులు ఇష్టపడే తీరులో కారంగా ఘాటుగా ఉంటుంది. ఇంకా దాదాపుగా ప్రతీ కిచెన్లో ఉండే పదార్ధాలే ఉంటాయ్ ఒక్కో ఆలేపినోస్ తప్ప. ఈ సింపుల్ రెసిపీకి కొన్ని చిట్టి చిట్కాలు

Mexican Rice recipe | Simple One pot Recipe | How to make Mexican Rice at home

టిప్స్

మెక్సికన్ బీన్స్:

  1. మెక్సికన్ బీన్స్ అంటే మన రాజ్మా లాంటివే, కానీ మెక్సికన్ బీన్స్ నల్లగా ఉంటాయ్. నాకు అవి హైదరాబాద్లో దొరకలేదు, అందుకే నేను దాదాపుగా అలాగే ఉండే కశ్మీరీ రెడ్ రాజ్మా వాడాను. మీరు మరేదైనా రాజ్మా వాడుకోవచ్చు.

  2. రాజ్మాని కనీసం 5 గంటలు నానబెట్టి కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విసిల్స్ రానిస్తే 80% కుక్ అవుతుంది మిగిలినది అన్నంతో పాటు కుక్ అవుతుంది. కాప్సికం:

  3. మెక్సికన్ రెసిపీస్లో కలర్ కాప్సికం వాడతారు, అందుకే నేను ఎల్లో, రెడ్ గ్రీన్ కాప్సికం వాడాను. కావాలంటే మీరు అందుబాటులో ఉండే గ్రీన్ కాప్సికం వాడుకోవచ్చు.

ఫ్రొజెన్ కార్న్, బటానీ:

  1. నేను ఫ్రొజెన్వి వాడాను కాబట్టి అన్నంతో పాటు వేసి వేశాను. పచ్చివి వాడితే ఉల్లిపాయ వేగాక వేసి వేపిన తరువాత టొమాటో వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.

స్పైస్:

  1. నేను మీడియం స్పైస్తో చేశాను, మీరు మీకు తగినట్లు ఉప్పు కారాలు వేసుకోవచ్చు.

మెక్సికన్ రైస్ | సింపుల్ వన్ పాట్ మెక్సికన్ రైస్ రెసిపీ - రెసిపీ వీడియో

Mexican Rice recipe | Simple One pot Recipe | How to make Mexican Rice at home

Bachelors Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 4 tbsp నూనె
  • 2 tbsp వెల్లులి తరుగు
  • 1 ఉల్లిపాయ (మీడియం సైజు తరుగు)
  • 3/4 cup టొమాటో పేస్ట్ (2 పెద్ద టొమాటోల నుండి తీసినది)
  • 1.5 cup బాస్మతి బియ్యం (250 gm గంట సేపు నానబెట్టినది)
  • ఉప్పు
  • 1 tsp కారం
  • 3/4 tsp ఒరేగానో
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp మిరియాల పొడి
  • 2.5 tbsp టొమాటో కేట్చాప్
  • 1/4 cup పసుపు కాప్సికం తరుగు
  • 1/4 cup ఎర్ర కాప్సికం తరుగు
  • 1/4 cup గ్రీన్ కాప్సికం తరుగు
  • 1/4 ఫ్రొజెన్ స్వీట్ కార్న్
  • 1/4 cup ఫోజెన్ బటానీ
  • 1/4 cup ఆలేపినోస్
  • 1/2 చెక్క నిమ్మరసం
  • 1/4 cup ఉడికించిన రాజ్మా
  • 2.5 cup నీళ్ళు
  • 2 tbsp స్ప్రింగ్ ఆనీయన్ తరుగు
  • 2 tbsp కొత్తిమీర తరుగు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో వెల్లులీ తరుగు వేసి 30 సెకన్లు వేపి ఉల్లిపాయ తరుగు వేసి ఒక నిమిషం వేపుకోవాలి.
  2. వేగిన ఉల్లిపాయాలో టొమాటో పేస్ట్ మిగిలిన మసాలాలు ఉప్పు అన్నీ వేసి టొమాటోల లోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  3. నూనె పైకి తేలాక ఎల్లో రెడ్ గ్రీన్ కాప్సికం వేసి 2 నిమిషాలు వేపుకోవాలి.
  4. తరువాత నానబెట్టిన బియ్యం, వేసి 3 నిమిషాలు వేపుకోవాలి, తరువాత ఫ్రొజెన్ కార్న్, బటానీ, రాజ్మా, టొమాటో కేట్చాప్, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టి 50% ఉడకనివ్వాలి.
  5. 50% ఉడికిన అన్నంలో ఆలేపినోస్, స్ప్రింగ్ ఆనీయన్, కొత్తిమీర, నిమ్మరసం పిండి నెమ్మదిగా కలిపి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికికించి 15 నిమిషాలు వదిలేయాలి. 15 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

  • M
    Maheswrarao
    చాలా బాగుంది. మీ వీడియో చూసి చేసిజే ఏదియనా sucess. Thanks
  • S
    Simar P
    Recipe Rating:
    Good recipe easy for students also Tried and result was wonderful
  • V
    Vuddadi Saritha
    Recipe Rating:
    Meeru chesay items chala baguntayyi frozen batani and frozen corn ela prepare chesukovalo chepandi please
  • P
    Praveen Singh
    Recipe Rating:
    Naku chala baganachindi sir. I'll try for sure
  • K
    Krishna
    Recipe Rating:
    Wow tried an International recipe for the first thanks Teja sir.
Mexican Rice recipe | Simple One pot Recipe | How to make Mexican Rice at home