పుదీనా చారు | పుదీనా రసం
అన్నంలోకి ఈసీగా కొత్తగా రుచిగా ఉండే చారు కోసం చూస్తుంటే “పుదీనా చారు” పర్ఫెక్ట్. పుదీనా చారు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
దక్షిణ భారత దేశంలో చారులు చాలానే ఉన్నాయి, అన్నీ వేటికవే ప్రేత్యేకం! అలాగే ఈ పుదీనా చారు కూడా. ఈ పుదీనా చారు చిక్కగా ఘాటుగా ఘుమఘుమలాడిపోతూ చాలా రుచిగా ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో పుదీనా చారు చాలా ఇళ్ళలో చేస్తూనే ఉండవచ్చు. కానీ, నేను మాత్రం తమిళనాడులో తిన్నాను అక్కడ హోటల్స్ కూడా వడ్డించడం చూశాను. అందుకే నేను తమిళనాడు స్పెషల్ రెసిపీ అంటాను.
ఈ చారు నీళ్ళ చారులా పలుచగా ఉండదు. కాస్త చిక్కగా అన్నంలోకి కలుపుకు తినేలా. ఇంకా ఈ పుదీనా చారు ఇడ్లీతో కూడా చాలా రుచిగా ఉంటుంది. టేస్టీ పుదీనా చారు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి

టిప్స్
-
చారు మరిగాక రుచి చూసి ఉప్పు సరిచేసుకోండి
-
ఈ చారులో కరివేపాకు వేయరు, అచ్చంగా పుదీనా పరిమళంతో ఉండాలి.
-
తాలింపుకి నచ్చితే నూనె-నెయ్యి ఏదైనా వాడుకోవచ్చు, నేను నెయ్యి వాడాను.
పుదీనా చారు | పుదీనా రసం - రెసిపీ వీడియో
Mint Rasam | Pudina Rasam | Pudina Rasam in Tamilnadu Style
Prep Time 5 mins
Soaking Time 10 mins
Cook Time 15 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
చారు పొడి కోసం
- 1 tbsp ధనియాలు
- 1 tsp మిరియాలు
- 3 ఎండు మిర్చి
- 1 tsp కందిపప్పు
- 1 tsp జీలకర్ర
- 1/2 tsp నూనె
-
చారు కోసం
- 100 ml చింతపండు పులుసు (పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
- 400 ml నీళ్ళు
- 1/4 tsp పసుపు
- ఉప్పు
- 1/2 cup కందిపప్పు (మెత్తగా ఉడికించి ఎనుపుకున్నది)
- మీడియం కట్ట పుదీనా ఆకుల తరుగు
-
తాలింపు కోసం
- 2 tsp నెయ్యి
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 1/4 tsp ఇంగువ
- 2 ఎండుమిర్చి
విధానం
-
పాన్లో రసం పొడి సామానంతా వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాక వేపుకుని మెత్తని పొడి చేసుకోండి.
-
గిన్నెలో చింతపండు పులుసు, పసుపు ఉప్పు నీళ్ళు చారు పొడి పోసి చారు ఒక పొంగు వచ్చేదాక మూత పెట్టి మరిగించుకోవాలి.
-
మరుగుతున్న చారులో మెత్తగా ఎనుపుకున్న పప్పు వేసి ఒక పొంగు రానివ్వాలి. పొంగుతున్న చారులో పుదీనా ఆకులు వేసి 2-3 నిమిషాలు మరగనివ్వాలి ఆ తరువాత దింపేయాలి.
-
తాలింపు కోసం నెయ్యి వేడి చేసి అవాలు వేసి చిటచిట లాడించి మిగిలిన సమగ్రీ అంతా వేసి మాంచి సువాసన వచ్చేదాక వేపి చారులో కలుపుకోండి. అంతే ఘుమఘుమలాడే పుదీనా చారు తయారు.
-
ఈ చారు అన్నం ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
1 comments