మిర్చీ కా సాలన్ | హైదరాబాదీ స్పెషల్ మిర్చీ కా సాలన్

Curries
5.0 AVERAGE
1 Comments

హైదరాబాదీ స్పెషల్ మిర్చీ కా సాలన్ ఉంటే చాలు బిర్యానీ కాస్త అటు ఇటూగా ఉన్నా బిర్యానీ చాలా రుచిగా అనిపిస్తుంది నాకు. నాకే కాదు ఈ మాట హైదరాబాద్లో చాలా మంది అంటుంటారు. మిర్చి కా సలాన్ పుల్లగా కారంగా ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది.

నిజానికి మిర్చి కా సాలన్ నిజాముల రెసిపీ అనుకుంటారు కానీ ఈ రెసిపీ తెలుగు వారి రుచులతో నిజాముల తాళింపుతో తయారైన రెసిపీ. ఈ రెసిపీ పూర్తిగా తెలుగు వారి పులుసులాగానే అనిపిస్తుంది. గట్టిగా చెప్పాలంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ మిర్చి కా సాలన్కి వాడే పదార్ధాలతో చిన్న మార్పులతో గుడ్ల పులుసు చేస్తారు. ఆ రెసిపీ కూడా ఉంది చూడండి.

మిర్చి కా సాలన్ కూడా దేశం ప్రాంతాన్ని బట్టి చేసే తీరులో వేసే పదార్ధాలలో మార్పులున్నాయ్. నేను పూర్తిగా హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నా. ఉత్తర భారత దేశం వైపు ఇందులో కొంచెం కోలోనజీ వేస్తారు, బెల్లం, కరివేపాకు వేయరు.

Mirchi Ka Salan | Hyderabadi Mirchi Ka Salan | Biryani Salan

టిప్స్

  1. మిర్చీ కా సాలాన్ నెమ్మదిగా అంటే ప్రతీ పప్పు సన్నని సెగమీద వేపుకుంటే పప్పు లోపలి దాకా వేగి సాలాన్ రుచిగా ఉంటుంది.

  2. ఇంకా వేసిన ప్రతీ పదార్ధం నూనె పైకి తేలేదాక వేపుకుంటే సాలాన్ ఎంతో రుచిగా ఉంటుంది, ఇంకా ఫ్రిజ్లో పెడితే కనీసం 2 వారాలు నిలవ ఉంటుంది.

  3. నేను ఇందులో కలోనజీ గింజలు వేయలేదు నచ్చితే ఆవలతో పాటు వేసుకోండి సాలన్ చాలా బాగుంటుంది. ఇంకా బెల్లం ఆఖరున దింపే ముందు వేస్తే పులుపు ఉప్పు కారంను బాలెన్స్ చేస్తుంది

  4. కొన్ని దేశాలలో గసాగసాలు దొరకవు, అలాంటప్పుడు కొంచెం సెనక్కాయలు, నువ్వులు పెంచుకోండి

  5. ఇదే సాలన్ బేస్గా వాడి వేపిన వంకాయలు వేస్తే హైదరాబాద్ ఫేమస్ బాగార బైంగన్ అవుతుంది, ఇదే బేస్లో వేపిన బెండకాయలు వేస్తే భీండి కా సాలన్, ఉల్లిపాయ వేస్తే ప్యాస్ కా సలాన్ తయారవుతుంది. ఈ వంటకాలన్నీ దాదాపుగా హైదరాబాద్ ప్రతీ ముస్లిం ఇళ్ళలో ఫంక్షన్లలో చేసేవే!!

మిర్చీ కా సాలన్ | హైదరాబాదీ స్పెషల్ మిర్చీ కా సాలన్ - రెసిపీ వీడియో

Mirchi Ka Salan | Hyderabadi Mirchi Ka Salan | Biryani Salan

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పేస్ట్ కోసం
  • 1/4 cup వేరు శెనగపప్పు
  • 1 tbsp ధనియాలు
  • 2 tbsp గసగసాలు
  • 2 tbsp నువ్వులు
  • 2 tbsp ఎండు కొబ్బరి పొడి
  • సాలన్ కోసం
  • 1/4 cup నూనె
  • 1 tsp ఆవాలు
  • 4 ఎండు మిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 1/4 tsp మెంతులు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tbsp కారం
  • 1/2 tsp గరం మసాలా
  • సాల్ట్
  • 1/4 tsp పసుపు
  • 7 - 8 బజ్జి మిర్చి చీరినవి
  • 1/4 cup చింతపండు పులుసు (50 gm చింతపండు నుంది తీసినది)
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1/2 tsp బెల్లం (ఆప్షనల్)

విధానం

  1. ముకుడులో మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలాన్నీ ఒక్కోటిగా సన్నని సెగమీద వేపుకుంటూ ఆఖరున కొబ్బరి పొడి వేసి వేపుకోవాలి.
  2. ఎర్రగా వేపిన పప్పులని మిక్సీలో వేసి మెత్తని వెన్నలాంటి పేస్ట్ చేసుకోవాలి.
  3. ముకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు వేసి వేపి, అల్లం వెల్లులి కూడా వేసి వేపుకోవాలి.
  4. వేగిన తాళింపులో కారం ఉప్పు గరం మసాలా పసుపు వేసి వేపి అందులో బజ్జి మిరపకాయ చీలికలు వేసి 3 నిమిషాలు వేపి తరువాత చింతపండు పులుసు పోసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాక మూత పెట్టి మగ్గించాలి.
  5. నూనె పైకి తేలాక మసాలా పేస్ట్ నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి, మరుగుతున్న ఎసరు పైన తేట ఏర్పడుతుంది దాన్ని తీసేయండి. తరువాత మంట తగ్గించి నూనె పైకి తేలేదాక మరిగించాలి.
  6. నూనె పైకి తేలాక కరివేపాకు తరుగు బెల్లం వేసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • R
    Rohith
    Recipe Rating:
    Super bro hatsof bro neeku nenu mimmalni eppudaina nenu chachipoelopapla mimmalni kalavalani anukuntunna 🤝
Mirchi Ka Salan | Hyderabadi Mirchi Ka Salan | Biryani Salan