చలికాలంలో వేడి వేడి అన్నంతో ఘుఘుమలాడే ఘాటైన తమిళనాడు స్పెషల్ మిరియాల పులుసు ఒక గొప్ప కాంబినేషన్!!! ఇంట్లో కాయ కూరలు లేనప్పుడు ఈ మిరియాల పులుసు చేసి మజ్జిగన్నం తిన్నా చాలు ఆ పూట భోజనం తృప్తినిస్తుంది.

మిరియాలు ఇంకా కొన్ని పదార్ధాలు వేపి మెత్తని పేస్ట్ చేసి ఉల్లిపాయ ముక్కల్లో ఉడికించి చింతపండు పులుసులో నిదానంగా చిక్కగా మరిగించి దింపేసుకోవడమే!!!

దక్షిణాది వారికి పులుసు ఉండనిదే భోజనానికి పరిపూర్ణత రాదు. అందుకే ఎన్ని రకాల పులుసులో. తెలుగు వారి కంటే తమిళులు చాలా ఎక్కువగా పులుసులు తింటారు.

ఈ ఘాటైన మిరియాల పులుసు తమిళవారు విడిగా చేస్తుంటారు, కానీ జ్వరం వచ్చి నోరు చేదుగా అనిపిస్తున్నప్పుడు తప్పక చేసుకుంటారు. ఈ పులుసుకి వేపిన వడియాలు జోడీ అయితే ఇంకా రుచిగా ఉంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు వాము చారు

టిప్స్

మిరియాలు:

  1. ఈ పులుసులో మిరియాల ఘాటు ఎక్కువగా, యందు మిర్చి కారం తక్కువగా ఉండేలా చూసుకోండి.

పులుసు ఇలా చేస్తే చేదెక్కుతుంది:

  1. మిరియాలు ఎండుమిర్చి నిదానంగా మాంచి సువాసనా రంగు వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి. ఏ మాత్రం దినుసులు మిరపకాయలు మాడినా పులుసు చేదెక్కుతోంది.

సాంబార్ ఉల్లిపాయలు:

  1. సాంబార్ ఉల్లిపాయల రుచి చాలా బాగుంటుంది. లేని వారు మామూలు ఉల్లిపాయలనే పెద్ద పాయలుగా చీరి వేసుకోండి. ఉల్లిపాయలు మెత్తబడితే చాలు. ఎర్రగా వేపనవసరం లేదు. ఉల్లిపాయాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటెనే పులుసులో ఘాటుని పులుపుని ఉల్లిలోని తీపి బాలన్స్ చేస్తుంది.

బెల్లం వేసుకోవచ్చా:

  1. నచ్చితే తప్పక వేసుకోవచ్చు. పులుపుని కారం ఘాటుని చక్కగా బాలన్స్ చేస్తుంది.

ఇంకొన్ని టిప్స్:

  1. పులుసు నిదానంగా సన్నని సెగ మీద మరగాలి, అప్పుడే పులుసుకి రుచి లేదంటే మసాలాల్లోని సారం పులుసులోకి దిగదు
  2. పులుసు చిక్కగా అనిపిస్తే వేడి నీళళ్తోన్ పలుచన చేసుకోవచ్చు.

మిరియాల పులుసు - రెసిపీ వీడియో

Miriyaala Pulusu | Miriyaala Pulusu Recipe with Tips

Sambar - Rasam Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 30 mins
  • Total Time 31 mins

కావాల్సిన పదార్ధాలు

  • మిరియాల పేస్ట్ కోసం:
  • 2 tbsp మిరియాలు
  • 1 tbsp జీలకర్ర
  • 1.5 tbsp ధనియాలు
  • 1 tbsp పెసరపప్పు/సెనగపప్పు
  • 1/4 tbsp మెంతులు
  • 1 tbsp బియ్యం
  • 8-10 ఎండు మిర్చి
  • 1/4 Cup పచ్చి కొబ్బరి ముక్కలు
  • 1 Sprig కరివేపాకు
  • పులుసు కోసం:
  • 3 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 2 Sprigs కరివేపాకు
  • 2 Pinches ఇంగువా
  • 1 Cup సాంబార్ ఉల్లిపాయలు
  • 10 వెల్లులి
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1/4 tbsp పసుపు
  • 2 టమాటో (ముక్కలు)
  • 300 ml చింతపండు పులుసు (50gm చింతపండు నుండి తీసినది)
  • 400-500 ml నీరు

విధానం

  1. మిరియాల పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలు అన్నీ వేసి సన్నని సెగ మీద కలుపుతూ ఎర్రగా మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి (అస్సలు మాడకూడదు)
  2. వేగిన పప్పుని నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  3. నూనె వేడి చేసి అందులో ఆవాలు కరివేపాకు ఇంగువ వేసి వేపుకోండి.
  4. తరువాత ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా వేపుకోవాలి. తరువాత చింతపండు పులుసు పోసి రెండు పొంగులు రానివ్వాలి
  6. పొంగుతున్న పులుసులో మిరియాల పేస్ట్ నీళ్లు వేసి కలిపి మూత పెట్టి 15-18 నిమిషాలు సన్నని సెగ మీద మధ్య మధ్యన కలుపుతూ మరిగించాలి.
  7. బాగా మరిగిన పులుసు ఒక్కసారి రుచి చూసి ఉప్పు కారం పులుపు అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నచ్చితే బెల్లం కూడా వేసుకోవచ్చు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.