మిక్స్ వెజ్ బటర్ మసాలా | మిక్ వెజ్ మక్కన్వాలా

రొటీలు పుల్కా నాన్లోకి మాంచి జోడీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ కర్రీ మిక్స్ వెజ్ బటర్ మసాలా రెసిపీ. మిక్స్ వెజ్ మక్కన్వాలా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

రెస్టారెంట్ స్టైల్ మిక్స్ వెజ్ బటర్ మసాలా రెసిపీ వీకెండ్స్కి లేదా పర్ఫెక్ట్ పార్టీ రెసిపీ. ఈ కర్రీ తిన్న ప్రతీ సారి మీ పొట్టతో పాటు మనసు కూడా నిండిపోతుంది.

నిజానికి ఈ రెసిపీ బేస్ పనీర్ బటర్ మసాలా గ్రేవీనే, కానీ గ్రేవీలో వేసే కూరలు వండే తీరును బట్టి రుచి భిన్నంగా ఉంటుంది.

రెస్టారెంట్ స్టైల్ - హోమేడ్ స్టైల్ అంటే ఏంటి? అని నన్ను చాలా సార్లు అడుగుతుంటారు. రెస్టారెంట్ స్టైల్ అంటే రంగు రుచి చిక్కదనంకి ప్రాధాన్యం ఇస్తారు, అందుకే ఎక్కువ నూనెలు బటర్ వేసి చేస్తారు, ఇంకా కంటికి ఇంపుగా ఉండాలి అని రంగు, నోటికి కమ్మగా ఉండాలని చిక్కని గ్రేవీ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఎప్పుడైనా ఒక సారి తినదగినవి.

హోమేడ్ అంటే తక్కువ నూనెలతో ఉప్పు మసాలాల ఘాటు తక్కువగా ఉంటూ ఉంటుంది. హొమేడ్ ఎప్పుడూ ఆరోగ్యమే, నిజానికి చేసే ప్రతీ రెసిపీ హొమేడ్ స్టైల్లో ఉండాలంటే ఆశించిన ఫలితాలు రావు. ఏమి ఫర్లేదు మేము తింటాము, మాకు అలాగే నచ్చుతుంది అంటే తప్పకుండా నూనెలు కారాలు మీకు తగినట్లుగా వేసుకోవచ్చు.

పర్ఫెక్ట్ మిక్స్ వెజ్ మక్కన్వాలా రెసిపీ కావాలంటే చేసే ముందు కొన్ని టిప్స్ అర్ధం చేసుకుని చేయండి బెస్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి.

Mix Veg Butter Masala

టిప్స్

బటర్:ఈ కర్రీ మిక్స్ వెజ్ మక్కన్వాలా కదా మరి కొంచెం బటర్ పాళ్ళు ఉంటేనే నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది. కర్రీలో వేసిన కూరలన్నీ బటర్లో లైట్ గోల్డెన్ కలర్లోకి వేగితే కర్రీ చాలా రుచిగా ఉంటుంది.

కాశ్మీరీ చిల్లీ పౌడర్ : కాశ్మీరీ మిరపకాయలు దక్షిణ భారతదేశం వారు వాడారు, కానీ ఇప్పుడు అన్నీ సూపర్మార్కెట్స్లో దొరికేస్తున్నాయ్. ఈ మిరపకాయలు కూరకి మాంచి రంగు, రుచి, సువాసనిస్తుంది, కారం తక్కువగా ఉంటుంది. లేని వారు మామూలు మిరపకాయలు, ఇంకా కూర కారమే కాస్త తగ్గించి వేసుకోండి

కూరలు:నేను ఇందులో వేసిన కూరలకి బదులుగా మీరు అందుబాటులో ఉన్న ఇంకెవైన ఇంగ్లీష్ కూరలు వేసుకోవచ్చు. అంటే స్వీట్ కార్న్, కాప్సికం, బ్రొకోలీ ఇలా. కానీ కనీసం ఐదు రకాల కూరలు ఉండేలా చూసుకోండి.

బటానీ:నేను ఫ్రొజన్ బటానీ వాడాను కాబట్టి గ్రేవీలో వేశాను, తాజా బటానీ వాడేట్లయితే మిగిలిన కూరలతో వేసుకోవచ్చు.

గ్రేవీ: గ్రేవీ ఎక్కువగా కావాలంటే టొమాటోతో పాటు మిగిలిన సమగ్రీ అంతా పెంచుకోండి. ఇంకా కూర చల్లారుతున్నకొద్దీ గట్టి పడుతుంది, అలా గట్టి పడితే కాసిని మరిగే నీళ్ళు కలిపి పలుచన చేసుకోవచ్చు.

మిక్స్ వెజ్ బటర్ మసాలా | మిక్ వెజ్ మక్కన్వాలా - రెసిపీ వీడియో

Mix Veg Butter Masala | Mix Veg Makhanwala | How to make Punjabi Makhni Gravy

Restaurant Style Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • గ్రేవీ కోసం
  • 3 టొమాటో
  • 1 ఉల్లిపాయ
  • 15 - 20 జీడిపప్పు
  • 3 కాశ్మీరీ మిరపకాయలు
  • 1/2 tsp పంచదార
  • 1/2 inch దాల్చిన చెక్క
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • ఉప్పు
  • 300 ml నీళ్ళు
  • కర్రీ కోసం
  • 2 tbsp నూనె
  • 3 దంచిన యాలకలు
  • 1/3 cup బంగాళాదుంప ముక్కలు
  • 1/3 cup కేరట్ ముక్కలు
  • 3 బేబీ కార్న్ (ఇంచ్ ముక్కలు)
  • 6 ఫ్రెంచ్ బీన్స్ (1 ఇంచ్ ముక్కలు)
  • 15 pieces కాలీఫ్లవర్
  • 1/3 cup పనీర్ ముక్కలు
  • 1/3 cup బటానీ
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • ఉప్పు
  • పసుపు – చిటికెడు
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp కాశ్మీరీ కారం
  • 1 tsp కసూరి మేథీ
  • 1/2 tsp గరం మసాలా
  • 3 tbsp బటర్
  • 3 tbsp ఫ్రెష్ క్రీమ్
  • 1 tsp నెయ్యి

విధానం

  1. గిన్నెలో గ్రేవీ కోసం ఉంచిన పదార్ధాలన్నీటి పాటు ఉప్పు కూడా వేసి మూత పెట్టి టొమాటో జీడిపప్పు మెత్తబడే దాకా ఉడికించుకోవాలి తరువాత వెన్నలా గ్రైండ్ చేసుకోవాలి.
  2. పాన్లో నూనె వేడి చేసి దంచిన యాలకలు దుంప ముక్కలు, కేరట్ , బేబీ కార్న్, బీన్స్, కాలీఫ్లవర్ ఉప్పు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి
  3. తరువాత బటర్ వేసి కూరలు లేత బంగారు రంగు వచ్చేదాకా మూతపెట్టి వేపుకుంటే చాలు
  4. బంగారు రంగు వచ్చాక అల్లం వెల్లులి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కసూరి మేథీ నలిపి వేసుకోవాలి
  5. టొమాటో పేస్ట్ పోసి బాగా కలిపి మూత పెట్టి నెయ్యి పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 5 నిమిషాల తరువాత బటానీ వేసి కలిపి వదిలేస్తే మెడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలకి నెయ్యి పైకి తేలుతుంది
  6. ఆఖరుగా పనీర్ ముక్కలు, క్రీమ్, నెయ్యి వేసి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

14 comments

  • M
    Maheetha
    Recipe Rating:
    Super test nenu try chesannu
  • S
    srimayyia
    Thank you so much for the informative blog. Really informative.Sri Mayyia is one of the best Caterers in Bangalore offers Innovative catering, fusion food, premium and Luxury Catering Services for Wedding, Small Parties, Griha Pravesh and Corporate parties in Bangalore. We are considered as one of top Veg Caterers in Bangalore. For more info visit our official website https://www.srimayyiacaterers.co.in/ or contact us @ +91-9845038235
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Amazing taste as described. Thanks for sharing and your continuous research, experiments. Really all the foodies following you are owed to you.
  • S
    srimayyia
    That was truly a nice post. thank you so much for the recepie . keep sharing. Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 9722225
  • S
    srimayyia
    That was truly a nice post. thank you so much for the recepie . keep sharing. Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 9722225
  • S
    srimayyia
    That was truly a nice post. thank you so much for the recepie . keep sharing. Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 9722225
  • S
    Swetha
    Recipe Rating:
    Nice recipe 👌 sir
  • S
    Shabeena
    I love ur all recipes nd I will try daily sir.. Its osm thanks for sharing with us sir.....
  • K
    Kambhampati uma devi
    Recipe Rating:
    Ur procedure is so simple,I am not starting cook with out ur recipes,thank u bro
  • S
    Sudhakar mallavarapu
    Happy Birthday Teja Garu..Thanks for sharing great veggie receipe.. biryani or pallav rice thou tinnaccha sir
  • S
    Saripalli Siddhardh
    Happy birthday teja garu.We are very very happy about you.And the recipe which u will be uploding is next level
Mix Veg Butter Masala