మునక్కాడ సాంబార్ | మునక్కాయ సాంబార్ | డ్రమ్ స్టిక్ సాంబార్ | ములక్కాడ సాంబార్ రెసిపి

మునక్కాడ సాంబార్మునక్కాడ ముక్కలు ఉల్లిపాయని చింతపులుసులో ఉడికించి సాంబార్ ముద్ద మెత్తగా ఉడికించిన కందిపప్పు వేసి దగ్గరగా బాగా మరగ కాచే మునక్కాడ సాంబార్ రుచి ఒక అద్భుతం!!!

ఈ సింపుల్ సూపర్ హిట్ తమిళనాడు సాంబార్ ఘుభాళింపు రుచి తిన్నాక అలా గుర్తుండిపోతుంది అంతే!!!

దక్షిణాది వారిలో తమిళనాడు వారుకున్నన్ని సాంబార్లు ఎవ్వరికీ ఉండవు. తమిళ వారు దాదాపుగా ప్రతీ కాయ కూరతో సాంబార్ చేస్తారు. అందులో ఒకటి ఈ మునక్కాడ సాంబార్!!!

టిప్స్

సాంబార్ గురుంచి కొన్ని విషయాలు :

*సాంబార్ని సాంబార్ రెడీమేడ్ సాంబార్ పొడి వేసి చేసుకోవచ్చు, లేదా ఈ రెసిపీలోలా అప్పటికప్పుడు సాంబార్ ముద్ద చేసి మరిగించొచ్చు. రెడీమేడ్ సాంబార్ పొడి వేసి చేసే సాంబార్ పసుపు రంగులో ఉంటుంది కాస్త గుబాళింపు తక్కవే! ఇలా అప్పటికప్పుడు చేసుకునే సాంబార్ ముద్దతో చేసే సాంబార్ రుచి ఒక అద్భుతమే అంటాను నేను.

*సాంబార్లు బాగా మరగాలి అప్పుడే రుచి. ఏదో రెండు పొంగులు రాగానే దింపేస్తే గొప్ప సాంబార్ రుచిని మీరు ఆస్వాదించలేరు.

కంది పప్పు:

*పప్పు ని ఉడికించడానికి ముందు పప్పుని కనీసం అర గంటైనా నానబెడితే మెత్తగా ఉడుకుతుంది.

ఇంకా ఈ పప్పుతో కూడా చేసుకోవచ్చు:

*నచ్చితే పెసరపప్పుతో ఇంకా ముడి పెసలు రాత్రంతా నానబెట్టి ఇదే తీరులో సాంబార్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది.

మునక్కాడ ఇంకా ఉల్లిపాయ:

*సాంబార్ కి సాంబార్ ఉల్లిపాయాలు అని ఉంటాయి అవి తమిళనాడు కేరళలో బాగా ఎక్కువగా దొరుకుతాయి. నాకు హైదరాబాద్లో సాంబార్ ఉల్లి దొరకలేదు అందుకే సాంబార్ ఉల్లి పేరుతో అమ్మే చిన్న ఉల్లిపాయలు వాడాను. దొరికితే సాంబార్ ఉల్లినే వాడుకోండి. లేని వారు మీడియం సైజు ఉల్లిని 4 సంఘాలుగా కోసి వాడుకోవచ్చు.

*మునక్కాడని మొత్తంగా పీచు తీయకుండా కణుపుల దగ్గర మాత్రమే పీచు తీసి సాంబార్ కాచుకుంటే మునక్కాడ సాంబారులో చిదురైపోదు.

బెల్లం:

*పులుపు కారం ఉప్పు అన్నింటిని వేసే ఆ కొంచెం బెల్లం చక్కగా బేలన్స్ చేస్తుంది.

మునక్కాడ సాంబార్ | మునక్కాయ సాంబార్ | డ్రమ్ స్టిక్ సాంబార్ | ములక్కాడ సాంబార్ రెసిపి - రెసిపీ వీడియో

Munakkada Sambar | Munkkaya sambar | Drumstick Sambar | Munakkada Sambar | Vismai Food

Sambar - Rasam Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 30 mins
  • Cook Time 30 mins
  • Total Time 1 hr 5 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • సాంబార్ ముద్ద కోసం:
  • ¼ tsp మెంతులు
  • 1 tbsp ధనియాలు
  • ½ tbsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • ¼ tsp మిరియాలు
  • 2 ఎండుమిర్చి
  • ¼ cup పచ్చికొబ్బరి
  • 1 tsp గసగసాలు
  • ½ tsp జీలకర్ర
  • 2 tbsp నూనె
  • పులుసు కోసం:
  • నిమ్మకాయంత చింతపండు నుండి తీసిన పులుసు
  • పప్పు ఉడికించుకోడానికి:
  • ½ cup కందిపప్పు
  • 7 - 8 cloves వెల్లుల్లి
  • ¼ tsp పసుపు
  • 2 cups నీరు
  • సాంబార్ కోసం:
  • 1 tbsp నూనె
  • 20 సాంబార్ ఉల్లిపాయలు
  • 2 రెండు మునక్కాడ ముక్కలు
  • 2 cups నీరు
  • 2 sprigs కరివేపాకు
  • 2 slit పచ్చిమిర్చి
  • ¼ cup టమాటో
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • ¼ tsp పసుపు
  • 1 tbsp బెల్లం
  • కొత్తిమీర - కొద్దిగా
  • 1 litre నీరు
  • తాలింపు కోసం:
  • 1 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 10 cloves వెల్లుల్లి
  • 2 ఎండుమిర్చి
  • 1/8 tsp ఇంగువ
  • ¼ tsp జీలకర్ర
  • 1 sprig కరివేపాకు
  • 2 tbsp కొత్తిమీర

విధానం

  1. పప్పుని బాగా కడిగి కనీసం ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి.
  2. పప్పు ఉడికించుకోడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా ఉడికించి ఎనుపుకోండి.
  3. సాంబార్ ముద్ద కోసం నూనే వేడి చేసి అందులో మిగిలిన దినుసులు ఒక్కటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి.
  4. ఆఖరుగా గసాలు కొబ్బరి వేసి వేపి నీళ్లతో మెత్తని ముద్ద చేసుకోండి.
  5. నూనె వేడి చేసి అందులో ఉల్లి మునక్కాడ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి 10-12 నిమిషాలు వేపి తరువాత నీరు పోసి 80% ఉడికించుకోండి.
  6. 80% ఉడికిన మునక్కాడలో టమాటో ముక్కలు వేసి మగ్గనిచ్చి చింతపండు పులుసు ఉప్పు పోసి మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.
  7. తరువాత సాంబార్ ముద్ద, ఎనుపుకున్న పప్పు, కారం, పసుపు, కొత్తిమీర, బెల్లం, నీరు పోసి కలిపి 10-12 నిమిషాలు మరగనివ్వాలి. మరుగుతున్న సాంబార్ ని మధ్యమధ్యలో కలుపుతుండాలి.
  8. ఆఖరుగా తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామగ్రీ అంతా వేసి తాలింపుని ఎర్రగా వేపి సాంబారులో పోసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మరో ఐదు నిమిషాలు మరగనిచ్చి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments