మస్క్ మెలన్ షర్బత్ | ఖర్బుజా షర్బత్ రెసిపి | ఖర్బుజ జ్యూస్

ఖర్బుజా షర్బత్ - సగ్గుబియ్యం నానబెట్టి పాలల్లో ఉడికించి అందులో జెల్లీ ముక్కలు కర్భూజా రసం ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేసే ఈ చల్లని షర్బత్ వేసవిలో మరింత రుచిగా అనిపిస్తుంది.

షర్బత్ లు అనేకం, ఇది కర్భూజా షర్బత్ అక్కడక్కడా సగ్గుబియ్యం రాస్బెర్రీ జెల్లీ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. పార్టీలకి, పిల్లల బర్తడేల ఈ డ్రింక్ చేయండి సూపర్ హిట్ అయిపోతుంది.

టిప్స్

జెల్లీ :

• నేను ఈ షర్బత్కి రాస్బెర్రీ జెల్లీ ముక్కలు వాడాను, మీరు మరింకేదైనా ఫ్రూట్ ఫ్లేవర్ జెల్లీ వాడుకోవచ్చు. రాస్బెరి జెల్లీ ముక్కలు చూడ్డానికి ఆక్షరణగా ఉండడమే కాదు మాంచి ఫ్రూట్ ఫ్లేవర్తో ఉంటుంది అందుకే నేను రాస్బెర్రీ జెల్లీ వాడాను.

• జెల్లీ ఏదైనా మీరు కొనే ప్యాక్ మీద తయారీ విధానం ఉంటుంది దాన్ని పాటిస్తూ తయారు చేసుకోండి. జెల్లీ సెట్ చేసుకున్నాక చిన్న ముక్కలుగా కోసుకోండి.

సగ్గుబియ్యం:

సగ్గుబియ్యం ముందు నానబెట్టి తరువాత కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగుపెట్టకుండా త్వరగా ఉడికిపోతుంది.

కర్భూజా:

పండిన తియ్యని ఖర్భూజ అయితే తీపి కాస్త తక్కువ పడుతుంది. మీరు పండు తీపిని బట్టి తీపి పెంచుకోవచ్చు.

కండెన్సడ్ మిల్క్:

కండెన్డ్ మిల్క్ ఈ షర్బత్ కు చాలా రుచినిస్తుంది. పంచదార వాడితే షర్బత్ పలుచగా అయిపోతుంది. కాబట్టి పంచదార వాడుకోదలిస్తే పాలని కాస్త చక్కబడేదాకా మరగనివ్వండి.

ఎసెన్స్:

నేను షర్బత్ మరింత ఫ్రూట్ ఫ్లేవర్ ఉండాలని మాంగో ఎసెన్స్ వేశాను. మాంగో ఎసెన్స్ చాలా బాగుంటుంది. దొరకని వారు నచ్చని వారు వెనీలా లేదా ఇంకేదైనా ఫ్రూట్ ఎసెన్స్ వేసుకోవచ్చు.

మస్క్ మెలన్ షర్బత్ | ఖర్బుజా షర్బత్ రెసిపి | ఖర్బుజ జ్యూస్ - రెసిపీ వీడియో

Muskmelon Sharbath | Kharbooja Juice | Kharbuja Sharbath | Cantaloupe Sharbath | Summer Recipes

Desserts & Drinks | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Resting Time 2 mins
  • Total Time 37 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • ¾ cup సగ్గుబియ్యం
  • ¾ litre పాలు
  • ¾ - 1 cup కండేన్స్డ్ మిల్క్
  • 750 gms కర్భూజా
  • 1 packet జెల్లీ
  • నీరు - సగ్గుబియ్యంని ఉడికించుకోడానికి

విధానం

  1. సగ్గుబియ్యంని కడిగి నానబెట్టుకోండి.
  2. నీరు మరిగించి దింపి అందులో రాస్బెర్రీ జెల్లీ మిక్స్ సగం పేకెట్ వేసి కలిపి కరిగించండి. కరిగిన జెల్లీ మిశ్రమం లోతు తక్కుగ ఉన్న ప్లేట్లో పోసి గంట సేపు సెట్ అవ్వనివ్వండి.
  3. నానిన సగ్గుబియ్యంని రెండింతల నీరు పోసి కలుపుకుంటూ ఉడికించి దింపి పక్కనుంచుకోండి.
  4. పాలని మరిగించి అందులో ఉడికిన సగ్గుబియ్యం వేసి కలిపి మెత్తగా ఉడికించండి. సగ్గుబియ్యం ఉడికిన తరువాత కండేన్స్డ్ మిల్క్ ఎసెన్స్ వేసి కలిపి 3-4 నిమిషాలు ఉడికించి పూర్తిగా చల్లారనివ్వండి.
  5. సగ్గుబియ్యం మిశ్రమం చల్లారేలోగా తియ్యని కర్భూజాలో ముప్పావు భాగం జ్యూస్ గాను పావు భాగం ముక్కలుగా తరిగి పక్కనుంచుకోండి.
  6. సెట్ అయిన జెల్లీని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.
  7. చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమంలో జెల్లీ ముక్కలు కర్భూజా జ్యూస్ ముక్కలు వేసి కలిపి ఫ్రిడ్జ్ లో 2-3 గంటలు వదిలేసి చల్లగా సర్వ్ చేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.