రాగి అంబలి | అంబలి
రాగి అంబలి జిగురు లేకుండా ఉడికించిన రాగి ముద్దలో మునిగేదాకా నీరు రాత్రంతా పులియబెట్టి పెరుగు ఉల్లి అల్లం కరివేపాకు పచ్చిమిర్చి వేసి తయారు చేసే ఈ అద్భుతమైన అంబలి వేసవిలో పొట్టకి ఎంతో మేలు చేస్తుంది ఇంకా శరీరానికి కావలసిన పోషకాలని సమృద్ధిగా అందిస్తుంది.
దక్షిణ భారతదేశంలో సాధారణంగా పులియబెట్టిన ఆహరం ఎక్కువగా తీసుకుంటుంటారు. అందులో ఈ అంబలి ఒకటి. ఈ అంబలి పరగడుపున ఒక పెద్ద గ్లాసు తాగితే చాలు ఇంకా మరో టిఫిన్స్ తినాల్సిన అవసరం లేకుండా సరిపోతుంది. ఈ అంబలి వేసవిలోనే కాదండి శరీరానికి వేడి చేసినప్పుడు లేదా పొట్ట సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా మీ రోజుని మరింత ఉత్సాహంగా మొదలెట్టాలనుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్.

టిప్స్
రాగి పిండి:
-
రాగి పిండిలో ముందుగా గడ్డలు లేకుండా కలుపుకుంటే ఉడికించేప్పుడు గడ్డలు ఏర్పడకుండా ఉంటాయి.
-
రాగి పిండి గరిట నుండి జిగురులేకుండా జారే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
నీళ్లలో ఊరబెట్టడం:
- రాగి ముద్దలని మునిగేంత నీరు పోసి రాత్రంతా వదిలేస్తే అప్పుడు పొట్టకి మేలు చేసే మంచి బాక్టీరియా పెరుగుతుంది.
ఇంకొన్ని టిప్స్:
-
ఉల్లి పచ్చిమిర్చి అల్లం సాధ్యమైనంత సన్నని తరుగు ఉంటె బాగుంటుంది. మీకు నచ్చితే వేపిన ఉల్లి వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది.
-
రాత్రంతా ఊరిన రాగి ముద్దని ముందు చేత్తో మెత్తగా మెదిపి తరువాత జల్లెడలో వేసి వడకట్టుకుంటే గడ్డలు లేని మృదువైన అంబలి తయారవుతుంది
రాగి అంబలి | అంబలి - రెసిపీ వీడియో
Nutritious Ragi Ambali | Finger Millet Recipe | Ragi Ambali
Prep Time 5 mins
Cook Time 25 mins
Resting Time 12 hrs
Total Time 12 hrs 30 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
-
రాగి పిండి ఉడికించుకోడానికి:
- ½ cup రాగి పిండి
- 1 cup నీరు
-
రాగి ముద్దలని నానబెట్టడానికి:
- 1.5 litres నీరు
-
అంబలి కోసం:
- 1.5 cups చిలికిన పెరుగు
- 1 cup చల్లని నీరు
- ⅓ cup ఉల్లి తరుగు
- 1 పచ్చిమిర్చి
- 1 tbsp అల్లం
- 2 tbsp కొత్తిమీర
- 1 sprig కరివేపాకు
- ఉప్పు
- 1 tsp వేపిన జీలకర్ర పొడి
విధానం
-
రాగి పిండిలో నీరు పోసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.
-
కలుపుకున్న రాగి పిండిని గడ్డలు లేకుండా జిగురులేని ముద్దగా అయ్యేదాకా ఓపికగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
-
చల్లారిన రాగిని ముద్దలుగా చుట్టుకుని నీళ్లలో రాత్రంతా వదిలేయాలి.
-
మరుసటి రోజు రాగి ముద్దని చేత్తో మెత్తగా ఉండలు లేకుండా మెదుపుకోవాలి, ఆ తరువాత జల్లెడలో వేసి వడకట్టుకుంటే మిగిలిన సన్నని గడ్డలు కూడా కరిగిపోతాయి.
-
వడకట్టుకున్న రాగిలో చిలికిన పెరుగు నీరు సన్నని ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కొత్తిమీర తరుగు ఉప్పు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి.
-
సంజీవనిలాంటి అంబలిని ఆస్వాదించండి.

Leave a comment ×