ఓట్స్ మసాలా వడ | ఓట్స్ ని ఇవి కలిపి మసాలా వడ చేస్తే మామూలు మసాలా వడలకంటే సూపర్ అంటారు
సాయంత్రాలు టీ తో ఒక మాంచి స్నాక్స్ ఈ ఒట్స్ మసాలా వడలు. ఈ సింపుల్ క్రిస్పీ మసాలా వడలు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో వివరంగా ఉంది చూడండి.
ఓట్స్ మసాలా వడలు, బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. దక్షిణ భారత దేశంలో అందులో తెలుగు తమిళవారు ఎక్కువగా చేసే మసాలా వడకి చిన్న ట్విస్ట్ ఈ ఒట్స్ మసాలా వడ రెసిపీ. ఇంకా ఈ వడలు చాలా తక్కువ నూనె పీలుస్తాయ్ ! సాయంత్రాలు స్నాక్స్ గా, లేదా స్టార్టర్గా మాంచి ఆప్షన్ ఇది!

టిప్స్
• శెనగపప్పు ఎక్కువగా నానబెట్టకండి. 2 గంటలు నానితే పప్పు 80% నానుతుంది మిగిలినది పలుకుగా ఉంటుంది. ఆ పలుకే వడని కరకరలాడేట్టు చేస్తుంది.
• నీళ్ళు అవసరం మేరకు చెంచాలతో పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి.
• నూనె లో వేసే ముందు వడలు చేసి చూడండి, వడ రాక పొడిపొడిగా అయిపోతుంటే కొంచెం నీళ్ళు పోసుకుని ముద్దగా చేసుకోండి.
ఓట్స్ మసాలా వడ | ఓట్స్ ని ఇవి కలిపి మసాలా వడ చేస్తే మామూలు మసాలా వడలకంటే సూపర్ అంటారు - రెసిపీ వీడియో
Oats Masala Wada | Healthy Masala Oats Wada | How to make Oats Masala Vada
Prep Time 5 mins
Soaking Time 2 hrs
Cook Time 15 mins
Total Time 2 hrs 20 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup పచ్చి సెనగపప్పు (2 గంటలు నానబెట్టినవి)
- 3/4 cup ఓట్స్
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 3 tbsp కొత్తిమీర తరుగు
- 1 tsp ధనియాలు
- సాల్ట్
- 1 పచ్చిమిర్చి తరుగు
- 1 tsp కారం
- నీళ్ళు తగినన్ని
- నూనె వేయించడానికి
విధానం
-
సెనగపప్పుని కడిగి 2 గంటలు నానబెట్టాలి. 2 గనట్ల తరువాత నీళ్ళు ఓంపేసి, నీళ్ళు వేయకుండా గట్టిగా, బరకగా రుబ్బుకోవాలి
-
బరకగా పప్పులుగా రుబ్బుకున్న పిండి ముద్ద లో మిగిలిన సామానంతా వేసి గట్టిగా పిండుతూ కలుపుకోవాలి.
-
ఆ తరువాత అవసరాన్ని బట్టి చెంచాలతో నీళ్ళు పోసుకుంటూ పిండి, ముద్దగా అయ్యేదాకా కలుపుకోవాలి.
-
ఇప్పుడు వేడి వేడి నూనెలో వడలు వేసి మంట మీడియం ఫ్లేం మీద పెట్టి ఎర్రగా కరకరలాడేదాక వేపుకోండి
-
ఇవి వేడి వేడిగా అల్లం పచ్చడి తో చాలా రుచిగా ఉంటాయి

Leave a comment ×
6 comments