ఉల్లిపాయ కుర్మా

ఘాటైన మసాలాల్లో ఉల్లిపాయ టమాటో చింతపండు పులుసు పోసి చేసే ఉల్లిపాయ కుర్మా ఆంధ్రా హోటల్స్ స్పెషల్ రెసిపీ. ఈ కుర్మా ఒకకిటి నాలుగు చపాతీలు తినేలా చేస్తుంది.

ఆంధ్రా హోటల్స్ లో సాయంత్రం నాలుగు గంటల నుండి చపాతీ అందుబాటులో ఉంటుంది. అందులోకి కొందరు ఆలూ కుర్మా ఇంకొందరు ఇలా ఉల్లిపాయ కుర్మా చేస్తుంటారు. ఘాటైన మసాలాల్ని తియ్యటి ఉల్లిపాయ బ్యాలెన్స్ చేస్తూ చాలా రుచిగా ఉంటుంది.

ఈ కుర్మా చిన్న చిన్న మార్పులతో హోటల్కి ఒక్కో తీరులో చేస్తుంటారు అవన్నీ నేను కింద వివరించాను చుడండి.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చ ఉల్లిపాయ చపాతీ

టిప్స్

కొన్ని విధానాలు:

  1. కొన్ని హోటల్స్లో కొబ్బరి వాడారు, ఇంకా జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా పొడికి బదులు దినుసులు ఉల్లిపాయతో పాటే వేపి మెత్తని పేస్ట్ చేస్తారు. ఇలా చేసే తీరులో మసాలా పరిమళం ఘాటు ఎక్కువగా ఉంటుంది.
  2. నేను కుర్మా చిక్కదనం కోసం జీడిపప్పు కొబ్బరి వాడాను. మీరు కర్బూజా గింజలు గసగసాలు కూడా వాడుకోవచ్చు.
  3. నేను కారాన్ని తీపి బాలన్స్ చేయడానికి కొద్దిగా చింతపండు పులుసు పోసాను, ఇది పూర్తిగా ఆప్షనల్. నిజానికి చాలా హొటెల్స్లో కుర్మాతో పాటు నిమ్మకాయ ఇస్తారు. అలా ప్రత్యేకంగా నిమ్మకాయ అవసరం పడకుండా నేను చింతపండు పులుసు వాడాను.
  4. ఇంకా నా తీరులా ఉల్లిపాయని వేపి పేస్ట్ చెయ్యరు. నేను చిక్కని గ్రేవీకి కమ్మని రుచి కోసం కొన్ని ఉల్లిపాయాలని వేపి పేస్ట్ చేసాను.

ఆఖరుగా:

  1. కుర్మాకి కాసింత నూనె మసాలాలు ఉంటేనే రుచి.

ఉల్లిపాయ కుర్మా - రెసిపీ వీడియో

Onion Kurma | How to Make Onion Kurma

Rotis Paratha | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • ఉల్లిపాయ పేస్ట్ కోసం:
  • 1 tbsp నూనె
  • 1 Cup ఉల్లిపాయలు
  • 3 tbsp ఎండు కొబ్బరి పొడి/ ముక్కలు
  • 7-8 జీడిపప్పు
  • 1 tbsp నువ్వులు
  • కుర్మా కోసం :
  • 3 tbsp నూనె
  • 3 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • ఉప్పు
  • 1.5 tbsp కారం
  • 1 tbsp వేపిన జీలకర్ర పొడి
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp గరం మసాలా
  • 2 Pinches పసుపు
  • 2 టొమాటోలు పేస్ట్ (పండిన)
  • 2 ఉల్లిపాయలు (ఉల్లిని పెద్ద పాయలుగా చేసినవి)
  • చింతపండు (ఉసిరికాయంత చింతపండు నుండి తీసిన పులుసు)
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేపుకోవాలి
  2. ఎర్రగా వేగిన ఉల్లిఆపాయలో యందు కొబ్బరి పొడి జీడీపప్పు నువ్వులు వేసి కొబ్బరి రంగు మారేదాకా వేపి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  3. కుర్మా కోసం నూనె వేడి చేసి అందులో అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి మసాలాలు మాడకుండా వేపుకోవాలి.
  4. వేగిన కారాల్లో టమాటో పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  5. వేగిన టొమాటోలో ఉల్లిపాయ ముక్కలు వేసి 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి.
  6. మగ్గిన ఉల్లిపాయలో చింతపండు నుండి తీసిన పులుసు పోసి నూనే పైకి తేలేదాక వేపుకోవాలి.
  7. కుర్మా పేస్ట్ వేసి కలిపి నీళ్లు పోసి మూత పెట్టి నూనే పైకి తేలేదాక వేపుకోవాలి.
  8. దింపే ముందు ఉప్పు కారాలు రుచి చూసి అవసరమైతే వేసుకుని కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి.
  9. ఇవి వేడి వేడిగా చపాతీలతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments