పచ్చి ఉల్లిపాయలో కొన్ని సింపుల్ మసాలాలు కలిపి, మెత్తగా వత్తుకున్న గోధుమపిండిలో స్టఫ్ చేసి ఎర్రగా కాల్చే ఉల్లిపాయ పరాటా లంచ్ బాక్సులకి ఒక సూపర్ హిట్ రెసిపీ.

అన్ని పరాటాల మాదిరి ఈ ఉల్లిపాయ పరాటాకి స్టఫ్ చేసే వేటినీ ఉడికించడాలు లేవు. జస్ట్ ఉల్లిపాయల్లో కొద్దిగా మసాలాలు కలిపి పిండిలో కూరి పరాటాల మాదిరి వత్తి కాల్చడమే! ఈ ఉల్లిపాయ పరాటా సగం మగ్గిన ఉల్లిపాయ తీపితో, పుల్లని నిమ్మరసం, పచ్చిమిర్చి కారంతో కలిసి అందరికి నచ్చేలా ఉంటుంది.

బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఉల్లిపాయ పరాటా గంటల తరువాత కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఇవి కమ్మని పెరుగు లేదా ఆవకాయ పచ్చడి నంజుడు ఒక గొప్ప కాంబినేషన్. ఉంటె నచ్చితే పుదీనా పచ్చడితో తిన్నా బాగుంటాయి.

టిప్స్

ఉల్లిపాయ:

ఉల్లిపాయ మరీ సన్నని తరుగు కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా తరుక్కోండి. సన్నని తరుగు ఎక్కువగా నీరు వదులుతుంది.

అల్లం- పచ్చిమిర్చి:

అల్లం పచ్చిమిర్చి రెండూ సన్నని తురుముగా ఉండాలి, కూరకి తరిగినట్లుగా ముక్కలుగా చేసి వేయకండి. ముక్కలు వేస్తే పరాటా వత్తేప్పుడు పరాటా పగిలి మసాలా బయటకి వచ్చేస్తుంది.

పిండి కలిపే తీరు:

గోధుమ పిండిలో నీరు ఒకే సారి పోసేయ్యడం కాకుండా నిదానంగా కొద్దీ కొద్దిగా పోసుకుంటూ పిండిని ఎక్కువ సేపు మృదువుగా అయ్యేదాకా చేతి మణికట్టుతో బలంగా వత్తుకోవాలి.

పిండి ఎంత మృదువుగా ఉంటె అంత బాగా సాగుతుంది, అప్పుడు పరాటాలు మెత్తగా ఉండడమే కాదు పరాటాలు వత్తుతున్నప్పుడు పగలదు.

అటుకులు:

ఉల్లిపాయల నీటిని పీల్చడానికి కచ్చితంగా పలచటి అటుకులు వేసుకోవాలి. లేదంటే నీరుగా ఉండే ఉల్లిపాయ మసాలా అంతా పగిలి బయటికి వచ్చేస్తుంది.

ఒక వేళా అటుకులు లేకపోతే వేపిన సెనగపొడి అయినా వేసుకోవచ్చు.

నెయ్యి -నూనె:

నిజాన్ని నిజంగా అనుకుంటే పరాటాలు కాల్చడానికి కాస్త నూనె లేదా నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇష్టం లేకుంటే తగ్గించుకోండి.

ఆనియన్ పరాటా - రెసిపీ వీడియో

Onion Parata | Onion Parota | How to Make Onion Parota

Breakfast Recipes | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 15 mins
  • Resting Time 30 mins
  • Total Time 55 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • పరాటా పిండి కలుపుకోడానికి:
  • 1.5 cups గోధుమ పిండి
  • 2 చిటికెళ్ళు - వాము
  • ఉప్పు - కొద్దిగా
  • 1 tsp నూనె
  • నీళ్లు తగినన్ని
  • ఉల్లి మసాలా కోసం:
  • 1 cup ఉల్లి తరుగు
  • 1/2 tsp పచ్చిమిర్చి తురుము
  • 1/2 tsp అల్లం తురుము
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 1/2 tsp చాట్ మసాలా
  • 1/2 tsp నిమ్మరసం
  • 1/4 cup పల్చటి అటుకులు
  • పరాటాలు కాల్చుకోడానికి:
  • నూనె /నెయ్యి

విధానం

  1. గోధుమ పిండి వాము ఉప్పు నూనె వేసి ముందు కలుపుకోండి. పిండి కలిపిన తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పగుళ్లు లేని మెత్తని ముద్దగా వత్తుకోవాలి.
  2. వత్తుకున్న పిండిని సమానంగా ఉండలుగా చేసి తడిగుడ్డ కప్పి 30 నిమిషాలైనా నానబెట్టుకోవాలి.
  3. ఉల్లిపాయ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ కలిపి పక్కనుంచుకోండి.
  4. నానిన పిండి ముద్దని ముందు చేత్తో పలుచగా స్ప్రెడ్ చేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని లోపల పెట్టి అంచులని ఒకదగ్గరకి చేర్చి గట్టిగా నొక్కండి.
  5. తరువాత పొడి పిండి చల్లి ముందు లోపలి మసాలాలని చేత్తో నెమ్మదిగా సమానంగా అన్ని వైపులకీ చేరేలా నొక్కండి.
  6. మసాలా అన్ని వైపులకీ చేరిన తరువాత పరాటా పగలకుండా నెమ్మదిగా గుండ్రంగా వత్తుకోండి.
  7. వత్తుకున్న పరాటాని కచ్చితంగా బాగా వేడి పెనం మీద వేసి పరాటాని ముందు కాస్త కాలనివ్వాలి. అంటే పరాటా అడుగు కాలి తెల్లబడాలి, అప్పుడు తిరగతిప్పి మరో వైపు కూడా హై ఫ్లేమ్ మీదే కాల్చాలి.
  8. రెండు వైపుల కాలిన తరువాత నూనె/నెయ్యి వేసి పరాటా పైన అక్కడక్కడ నల్ల మచ్చలు ఏర్పడే దాక కాల్చుకుని తీసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • S
    Sravani
    I Love this recipe.. very easy to Cook and serve
  • M
    Malla siva
    Recipe Rating:
    super recipe,i tryed at home it was super and delicious.now it's one of my favourite food.
  • S
    Sai sharanya
    Anna we will cook onion parota in ur style atleast twice ah week for the dinner 😊and I will try all the veg recipes of urs .Thank you so much for the detailed explanation about cooking