ఉల్లిపాయ పకోడీ | మెత్తటి ఉల్లిపాయ పకోడీ | ఆంధ్ర స్పెషల్ పకోడీ రెసిపి
మెత్తటి ఉల్లిపాయ పకోడీ- ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు మిర్చి సెనగపిండి బియ్యం పిండి నెయ్యి వంట సోడా నీరు వేసి గట్టిగా ఉల్లిపాయల్ని పిండుతూ కలిపి నూనెలో పకోడీలు మాదిరి వేసి ఎర్రగా వేపి తీసుకునే ఈ మెత్తటి పకోడీ ఆంధ్ర స్పెషల్ రెసిపి.
ఆంధ్రా రాయలసీమ ప్రాంతాల్లో సాయంత్రాలు ఏ వీధి చివర్న బండి దగ్గరికి వెళ్లినా ఈ మెత్తటి ఉల్లిపాయ పకోడీ దొరుకుతుంది. ఉల్లిపాయ పకోడీ అనేక తీరులు వేసేవి అందరూ ఒకే పదార్ధాలు, కానీ పిండి తడుపుకునే తీరు అవి వేపే తీరు కేవలం ఈ రెండింటివల్లే పకోడీల రుచి మారుతుంది.
అలా చిన్న మార్పులతో చేసే ఈ పకోడీ బయట కరకరలాడుతూ లోపల మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఎంత రుచిగా ఉంటాయో. నిజం చెప్పాలంటే ఒకటి తినడం మొదలెడితే చేతికి నోటికి అదే పని పకోడీ ఖాళీ అయ్యేంత వరకు అంత రుచిగా ఉంటాయి.

టిప్స్
ఉల్లిపాయ తరుక్కునే తీరు:
ఈ పకోడీకి ఉల్లిపాయలు కాస్త మందంగా పెద్దగా బిళ్లలుగా ఉండాలి. చీలికలు సన్నని తరుగు పనికి రాదు. మందంగా ఉండే ఉల్లిపాయ నూనెలో సగం మెత్తబడి తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది.
పకోడీలో అతి ముఖ్యమైన పదార్ధం:
పకోడీలో కచ్చితంగా నెయ్యి లేదా డాల్డా ఏదో ఒకటి తప్పకుండా వేయాలి. బండ్ల మీద వారు కచ్చితంగా డాల్డా వేస్తారు. వేసే ఆ కొద్దీ నెయ్యి పకోడీనీ చాలా గుల్లగా చేస్తుంది.
పకోడీ పర్ఫెక్టుగా రావాలంటే:
పిఓడిలో నీరు పోసుకున్నాకా పిండిని బాగా వేగంగా పిండి తేలికపడేదాకా బీట్ చేసుకోవాలి లేదంటే పకోడీలు పైన వేగి లోపల ఉండ కట్టేస్తుంది, అంత రుచిగా ఉండవు. అవి ఆంధ్రా స్టైల్ మెత్తని పకోడీ కానీ కాదు.
పకోడీ వేపే తీరు: • పిండి నూనెలో వేస్తే పూర్తిగా మునగాలి లేదంటే పకోడీ చతికలపడినట్లుగా పలచుగా వస్తాయ్. కాబట్టి పకోడీ పిండి నూనెలో పూర్తిగా మునగాలి. పకోడీ నూనెలో వేశాక వెంటనే గరిట పెట్టి కదపకుండా 2 నిమిషాలు వేగనివ్వాలి అప్పుడు పిండి కాస్త వేగి ఉల్లిని పట్టి ఉంటుంది. లేదంటే ఉల్లి నుండి పిండి విడిపడిపోతుంది.
• పకోడీని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి, అప్పుడే పకోడీ బయట కారకరలాడుతూ లోపల తేలికగా మృదువుగా ఉంటాయి.
ఉల్లిపాయ పకోడీ | మెత్తటి ఉల్లిపాయ పకోడీ | ఆంధ్ర స్పెషల్ పకోడీ రెసిపి - రెసిపీ వీడియో
Onion Soft Pakodi | Methati Pakodi Recipe | Andhra Style Onion Pakodi
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 3 మీడియం ఉల్లిపాయలు
- 3 పచ్చిమిర్చి
- 2 sprigs కరివేపాకు
- 1½ tbsp అల్లం తరుగు
- ¼ tsp వంట సోడా
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర - కొద్దిగా
- ½ tsp జీలకర్ర
- 290 gms సెనగపిండి ((2 కప్పులు))
- 2 ½ tbsp నెయ్యి
- నీరు - ఇడ్లీ పిండంత జారుగా కలుపుకునేంత నీరు ఉండాలి
విధానం
-
ఉల్లిపాయ ముక్కలుగా తరుక్కోండి. పచ్చిమిర్చి అల్లం సన్నని ముక్కలుగా తరుక్కోండి.
-
తరిగిన ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి అల్లం సన్నని తరుగుతో పాటు మిగిపోయిన పదార్ధాలన్నీ కలపండి.
-
ఉల్లిపాయల్ని బాగా పిండుతూ బాగా కలుపుకున్నాకా, నీరు వేసి బాగా వేగంగా 3-4 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి.
-
పిండిని బాగా బీట్ చేసుకున్నాక మరిగే వేడి వేడి నూనెలో గోలీ సైజు అంత ఉండలుగా వేసుకోండి.
-
పకోడీ వేశాక 2 నిమిషాలు వేగనివ్వండి. వేగిన పకోడీని తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా వేపుకుని తీసుకోండి.
-
ఈ మెత్తని వేడి వేడిగా చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment ×
4 comments