పాల తాలికలు | పాల తాళికలు రెసిపీ చాలా పాతకాలపు వంటకం
తింటున్న ప్రతీసారి మైమరచిపోయేంత రుచిగా ఉండే సంప్రదాయ వంటకం పాల తాళికలు. ప్రతీ తెలుగు వారికి ఎన్నో అనుభూతులు జ్ఞాపకాయాలుంటాయ్ ఈ పాల తాళికలతో.
పాల తాలికలు ఇవి తెలుగువారి ప్రేత్యేకమైన పిండి వంట! ఇది వినాయక చవితికి ఇంకా కొత్త పెళ్ళికూతురికి సారే తో పాటు ఇచ్చి పంపే ఆచారం కూడా ఉంది తెలుగు వారి ఇళ్ళలో !
పాల తాళికలు రెసిపీ చాలా పాతకాలపు వంటకం.ఎందరో తెలుగు కవులు పాల తాళికల రుచి గురుంచి గొప్పగా వర్ణించారు కూడా!
ఈ సంప్రదాయపు రెసిపీ చేసే ముందు కచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని టిప్స్:

టిప్స్
తడి బియ్యం పిండి:
• తడి బియ్యం పిండి వాడితేనే తాలికలు మృదువుగా ఉంటాయ్! పాలని బాగా పీలుస్తాయ్! పొడి బియ్యం పిండి లేదా పాకెట్ బియ్యం పిండి వాడితే పాలు తాళికల లోపలిదాకా వెళ్ళవు.
• తడి బియ్యం పిండి కోసం బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు వడకట్టి 30 నిమిషాలు జల్లెడలో ఆరబెట్టుకోవాలి. తరువాత తడిపొడిగా ఉండే బియ్యాన్ని పలుకులేకుండా మెత్తగా మారాడించి జల్లించుకోండి. జల్లించుకోగా మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీ వేసి జల్లించుకోండి.
• మిక్సీలో కంటే పిండి మరలో పిండి బాగుంటుంది. లేని వారు మిక్సీలోనే చేసుకోండి.
• జల్లించుకున్న పిండి రవ్వ లేకుండా మృదువుగా ఉండాలి. పిండి పిడికిలితో పట్టుకుంటే ముద్ద కట్టాలి. దాన్నే తడి పిండి అంటారు. తడిపిండిని మీరు ఎయిర్-టైట్ డబ్బా పెట్టి డీప్-ఫ్రీజర్ లో నెల వరకు నిలవ చేసుకోవచ్చు!
తాళికలు:
• తాలికలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోండి
• బెల్లం పాకం వేడి మీద పోస్తే పాలు విరుగుతాయ్. అందుకే స్టవ్ ఆపేసి చల్లారిన పాకం పోస్తేనే పాలు విరగవ్
• పిండి లో కాసిని నీళ్ళు పోసి కలిపి పాలల్లో పోస్తేనే తాలికలు చిక్కబడతాయ్, పిండి పోసాక మరీ ఎక్కువ సేపు ఉడికిన్చకండి, అలా చేస్తే చల్లారేపాటికి గట్టిగా ముద్దలా అయిపోతుంది పాల తాలికలు!
• ఒక వేళ మరీ చిక్కగా అయిపోతే కాచిన పాలు పోసి పలుచన చేసుకోవచ్చు.
పాల తాలికలు | పాల తాళికలు రెసిపీ చాలా పాతకాలపు వంటకం - రెసిపీ వీడియో
Pala Talikalu | Ganesh Chaturdi Special Sweet | How to make Pala Thalikalu Recipe
Soaking Time 12 hrs
Cook Time 45 mins
Total Time 12 hrs 45 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 1 cup తడి బియ్యం పిండి
- 1 cup బెల్లం
- 1 cup సగ్గుబియ్యం
- 1/2 liter పాలు
- 250 ml నీళ్ళు
- 1 tsp యలకలపొడి
- 3 tsp నెయ్యి
- 3 tsp జీడిపప్పు
- 2 tsp ఎండుకొబ్బరి పలుకులు
- 2 tsp కిస్మిస్స్
విధానం
-
2 tbsps బెల్లం లో కొంచెం నీళ్ళు పోసి బెల్లం కరగనివ్వండి, బెల్లం కరిగాక అప్పుడు తడి బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి బాగా కలుపుకోండి. (తడి బియ్యం పిండి ఎలా చేయాలో టిప్స్ లో ఉంది గమనించగలరు)
-
పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకుని మృదువుగా కలుపుకోండి.
-
మిగిలిన బెల్లంలో కాసిని నీళ్ళుపోసి ఓ పొంగు రాగానే దించి చల్లార్చుకోండి
-
ఇప్పుడు తడి బియ్యం పిండి ముద్దని గోలి సైజు ఉండలు చేసి దాన్ని పొడవుగా కాస్త మందంగా మురుకుల సైజు లో చేసుకోండి. పిండిలో కొద్దిగా పక్కనుంచుకోవాలి.
-
ఇప్పుడు పాలు నీళ్ళు కలిపి మరిగించండి ఓ పొంగు రాగే 30 నిమిషాలు నానా బెట్టిన సగ్గుబియ్యం వేసి సగం పైన ఉడకనివ్వండి.
-
సగ్గుబియ్యం సగం పైన ఉడికాక తయారుగా ఉంచుకున్న తాలికలు పాలల్లో వేసి 5 నిమిషాలు గరిటతో కదపకుండా వదిలేయండి
-
5 నిమిషాల తరువాత నిదానంగా కలుపుకుని మూత పెట్టి సన్నని సెగ మీద 12-15 నిమిషాల పాటు ఉడకనివ్వండి
-
12 నిమిషాల తరువాత తాలికని స్పూన్ తో కట్ చేసి చూస్తే ఉడికి పాలని పీల్చుకున్నది లేనిది తెలుస్తుంది. లోపలిదాకా ఉడికాక పక్కనున్చుకున్న పిండి లో కాసిని నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకుని తాలికల్లో కలిపి మరో 5-6 నిమిషాలు లో-ఫ్లేం మీద మూత పెట్టి ఉడకనివ్వండి.
-
5-6 నిమిషాలకి చిక్కబడుతుంది, అప్పుడు స్టవ్ ఆపేసి యాలకలపొడి , చల్లారిన బెల్లం పాకం పోసి నిదానంగా కలుపుకోండి
-
నెయ్యి వేడి చేసి అందులో ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, కిస్మిస్స్ వేసి ఎర్ర వేపి తాలికల్లో కలిపేసుకోండి.
-
తాలికలు వేడి మీద కాస్త పచ్చిగా అనిపించొచ్చు, కానీ చల్లారాక పాలని బాగా పీలుస్తాయ్!

Leave a comment ×
8 comments