పాలకూర కార్న్ కాప్సికం అన్నం
నూనెలో తాలింపు వేసి కార్న్ కాప్సికం పాలకూర వేసి వేపి పొడిపొడిగా వండుకున్న అన్నం వేసి టాస్ చేసి దింపే అద్భుతమైన లంచ్ బాక్స్ రెసిపీ. ఇది హ్యాపీ టమ్మీ రెసిపీ. తిన్నాక పొట్టకి ఎంతో హాయిగా తేలికగా ఉంటుంది.
నిజానికి లంచ్ బాక్సు రైస్ రెసిపీస్ పేరుపెట్టి రోజూ గరం మసాలాలు అల్లం వెల్లులి పేస్ట్లు వేసి చేసే రెసిపీ చేయడం రోజూ అవి తినడం రెండూ నాకిష్టం ఉండదు. అంత ఆరోగ్యం కూడా కాదు.
అందుకే సింపుల్గా పొట్టకి హాయినిచ్చే కమ్మని రైస్ రెసిపీస్ తీసుకొస్తున్నా, హ్యాపీ టమ్మీ రెసిపీస్ సీరీస్తో. ఈ రెసిపీస్ చేయడం ఎంతో తేలిక, బ్యాచిలర్స్కి, ఆఫీస్ వెళ్లేవారికి ఎంతో చేసుకోవడం ఎంతో తేలిక.
అన్నీ నూనెలో వేపి అన్నం వేసి టాస్ చేసి దింపేసుకోవడమే!

టిప్స్
వైట్ రైస్:
తినగిలిగితే ఇష్టముంటే మీరు వైట్ రైస్కి బదులు మిల్లెట్స్ పొడి పొడిగా వండుకుని కూడా చేసుకోవచ్చు
అల్లం:
కార్న్ కాప్సికం రైస్లో నేను అల్లం ఘాటు మోతాదు కొంచెం ఎక్కువగా ఉంచాను, మిరప కారం తగ్గించి. కట్టే పొంగలి మాదిరి. కానీ అల్లం చాలా సన్నని తురుము లేదా తరుగు వేసుకోండి.
పచ్చిమిర్చి:
చిన్న పిల్లలకి అయితే పచ్చిమిర్చి చీలికలు వేసేస్తే ఏరి తీసేయడానికి వీలవుతుంది. లేదా కారం తక్కువగా తినేవారు పచ్చిమిర్చిని ఎర్రగా వేపుకోండి.
కాప్సికం:
కాప్సికం సన్నని తరుగు ఉంటె బాగుంటుంది. ఇంకా మరీ మెత్తగా వేపండి 2-3 నిమిషాలు వేపుకుతుంటే చాలు.
స్వీట్ కార్న్ :
కమ్మదనం కోసం నేను స్వీట్ కారం వాడాను మీరు కావాలనుకుంటే ఫ్రోజెన్ బటాణీ కూడా వాడుకోవచ్చు. నేను తాజా స్వీట్ కార్న్ వాడాను కాబట్టి ఉల్లిపాయ తరుగుతో పాటే వేసి వేపాను. మీరు ఫ్రోజెన్ కార్న్ వాడితే కాప్సికం వేగిన తరువాత వేసుకోండి.
సాంబార్ పొడి:
రెసిపీలో వేసిన సాంబార్ పొడి ఎంతో ప్రేత్యేకమైన పరిమళాన్ని ఇస్తుంది. తప్పక వేయండి. సాంబార్ పొడి వేసాక ముప్పై సెకన్లు వేపితే చాలు, పొడిలోని పరిమళం విడుదల అవ్వడానికి.
ఆఖరుగా:
ఈ రైస్ మీడియం స్పైసిగా చేసాను. మీరు మీకు తగినట్లుగా కారాలు అడ్జస్ట్ చేసుకోండి.
పాలకూర కార్న్ కాప్సికం అన్నం - రెసిపీ వీడియో
Palak Corn Capsicum Rice
Prep Time 5 mins
Cook Time 7 mins
Total Time 12 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 4 tbsp నూనె
- 1 tsp జీలకర్ర
- 1 tbsp అల్లం తురుము
- 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
- 1 ఉల్లిపాయ (సన్నని తరుగు)
- 1/4 cup స్వీట్ కార్న్
- 1.5 cup పాలకూర సన్నని తరుగు
- 1 tsp సాంబార్ పొడి
- 1 cup పొడి పొడిగా వండుకున్న అన్నం (185 బియ్యం)
- 1/2 tsp మిరియాల పొడి
- 1 tbsp నిమ్మరసం
విధానం
-
నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
-
చిట్లిన జీలకర్రలో అల్లం పచ్చిమిర్చి తరుగు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి.
-
వేగిన మిర్చిలో ఉల్లిపాయ సన్నని తరుగు స్వీట్ కార్న్ ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడి దాకా వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయలో పాల కూర సన్నని తరుగు వేసి ఆకు మెత్తబడి పసరు వాసన పోయేదాకా వేపుకోవాలి.
-
తరువాత సాంబార్ పొడి వేసి 30 సెకన్లు వేపుకోవాలి. తరువాత పొడి పొడిగా వండుకున్న అన్నం మిరియాల పొడి వేసి మెతుకు వేడెక్కేదాకా హై ఫ్లేమ్ మీద వేపి స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండి దింపేసుకోవాలి.

Leave a comment ×
8 comments