రెస్టారెంట్ స్టైల్ పాలక పనీర్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో తో వివరంగా ఉంది చూడండి .

పాలక్ పనీర్...ఇది ఫేమస్ పంజాబీ రెసిపీ!!! ఇది పేరుకి పంజాబీ రెసిపీ కాని యావత్ ప్రపంచంలో దీనికి అభిమానులున్నారు. పాలక్ పనీర్ చపాతీ, రోటీలు, పుల్కా, ఇంకా జీరా రైస్ లో చాలా రుచిగా ఉంటుంది.

పాలక పనీర్ రెసిపీ చాలా సింపుల్ కొన్ని చిన్న టిప్స్ కొలతలు సరిగా పాటిస్తే ఎప్పుడు చేసినా వకీ తీరుగా వస్తుంది. ప్రస్తుతం రెస్టారెంట్లలో ఒరిజినల్ పాలక్ పనీర్కి చిన్న చిన్న మార్పులు చేసి అందిస్తున్నారు, ఆ పద్ధతి కూడా బాగున్నా నేను సింపుల్ పాత పద్ధతిలో పాలక్ పనీర్ రెసిపీ చెప్తున్నా.

Palak paneer | How to Make Palak Paneer | Punjabi Style Palak Paneer | Restaurant Style Palak Paneer

టిప్స్

పాలక్ పనీర్ రెస్టారెంట్లో లాగా ఆకుపచ్చగా ఉండాలంటే?

పాల కూర ఆకులు మరిగే నీళ్ళలో వేసి 3 నిమిషాలు ఉడికించి వెంటనే చన్నీళ్ళ లో వేస్తే ఇంక ఉడకదు. అప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. లేదంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. 

పనీర్:

ఇంట్లో చేసుకున్న పనీర్ ఎప్పుడూ బెస్ట్, రెడీమేడ్ తెస్తే పనీర్ ముక్కలుగా చేసి వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచితే పనీర్ మెత్తబడుతుంది. అప్పుడు ఫ్లేవర్స్ బాగా పడతాయ్ పనీర్కి. 

రుచిని పెంచే ఇంకొన్ని టిప్స్:

• ఉల్లిపాయ ఎర్రగా వేగితేనే రుచి.

• కసూరి మేథి తప్పక వేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది.

• రెస్టారెంట్ టేస్ట్ కావాలంటే తప్పక ఫ్రెష్ క్రీమ్ వాడాలి, లేని వారు ఇంట్లో ఉండే పాల మీగడ కూరలో వేసి కలిపి కాసేపు ఉడికించి దింపేయండి. ఫ్రెష్ క్రీమ్ వాడినట్లైతే జస్ట్ కలిపి దింపేయడమే.

Palak paneer | How to Make Palak Paneer | Punjabi Style Palak Paneer | Restaurant Style Palak Paneer

పాలక్ పనీర్ - రెసిపీ వీడియో

Palak paneer | How to Make Palak Paneer | Punjabi Style Palak Paneer | Restaurant Style Palak Paneer

Veg Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 5-6 కట్టలవి పాలకూర ఆకులు
  • 3 పచ్చిమిర్చి
  • 200 gms పనీర్
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 1 tsp అల్లం వెల్లూలి ముద్ద
  • 1/4 cup నూనె
  • 3 tbsps వెన్న
  • 1 tsp నెయ్యి
  • 3 tbsps ఫ్రెష్ క్రీం
  • 1 tsp జీలకర్ర
  • 3 ఎండు మిర్చి
  • 1 tsp కారం
  • 1 tsp సాల్ట్
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp కసూరి మేథీ
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 150 ml నీళ్ళు

విధానం

  1. పాలకూర ఆకుల వరకు తుంచి నీళ్ళలో 3-4 నిమిషాలు ఉడికించి వెంటనే తీసి చన్నీళ్ళు పోయండి, దీని వల్ల పాలకూర రంగు మారదు.
  2. చల్లారిన పాలకూర, పచ్చిమిర్చి. 1/4 కప్ నీళ్ళు వేసి మెత్తని పేస్టు చేయండి.
  3. మూకుడు లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపుకోండి.
  4. ఆ తరువాత ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా వేపుని అల్లం వెల్లూలి పేస్టు వేసి వేపుకోవాలి.
  5. పాలకూర పేస్టు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, నలిపిన కసూరి మేథీ వేసి బాగా కలిపి పాలకూర ఆకు మగ్గి నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేం మీద మూత పెట్టి ఉడికించండి.
  6. ఆ తరువాత బటర్ వేసి కలపండి. బటర్ కరిగి పాలకూరలో కలిసిపోయి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి.
  7. నూనె పైకి తేలకా 150 ml వేడి నీళ్ళు పోసి మూతపెట్టి చిక్కబడనివ్వండి.
  8. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టిన పనీర్ ముక్కలు వేసి ముక్కలు చిదరకుండా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి.
  9. దింపే ముందు సువాసన కోసం 1 tsp నెయ్యి, నచ్చితే ఫ్రెష్ క్రీం వేసి కలిపి దిమ్పెసుకోండి రెస్టారంట్ టేస్ట్ వస్తుంది

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

8 comments

  • R
    Rakhshinda
    How many grams is 5-6 bunches of palak equivalent to?
  • P
    Prakeerthi
    Recipe Rating:
    Super it is really taste like restaurant food 😋
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    There is difference between video and step by step method. Which will be better to follow. Please reply. The taste was next level.
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    My daughter liked it very much
  • S
    Seetamahalakshmi
    Recipe Rating:
    I tried this recipe it gave better taste I rate this recipe 5 stars
  • S
    Sandhya Ch
    Recipe Rating:
    I tried and get the best taste.
  • H
    Hannah
    Recipe Rating:
    Ee recipe naa boyfriend kosam vanta chesaanu. Thanu idi India lo la gaa anipinchindi ani cheppaadu. Nenu American ni - anduke ade best compliment 👍🏻
  • G
    Geethanjali
    Recipe Rating:
    Super 💝
Palak paneer | How to Make Palak Paneer | Punjabi Style Palak Paneer | Restaurant Style Palak Paneer