పానకం | దక్షిణభారత దేశం లో ఎంతో ప్రాచుర్యం పొందిన పానకం
ప్రసాదంగానే కాదు ఆరోగ్యకరమైన రెసిపీ కోసం చూస్తున్నారా అయితే దక్షిణభారత దేశం లో ఎంతో ప్రాచుర్యం పొందిన పానకం చేయండి. ఈ సింపుల్ ప్రసాదం రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.
“పానకం” దక్షిణభారత దేశంలో ఎంతో ప్రసిద్ది. ఆలయాల్లో భగవంతునికి రోజూ తప్పక పానకాన్ని నివేదిస్తారు. అలా కాకపోయినా పండుగలకి అంటే వినాయక చవితి, శ్రావణమాసం లో అమ్మవారికి రామ నవమికి రామునికి ప్రసాదంగా ప్రతీ ఇంటా పానకం చేస్తారు.
ఈ పానకం రెసిపీ చేయడం చాలా సులభం, కానీ పదార్ధాలు వేసే పాళ్ళులో వ్యత్యాసం ఉంటుంది. నేను శాస్త్రీయమైన పానకం చేస్తున్నాను. ఈ పానకం ప్రసాదంగానే కాదు వేసవిలో రోజూ తాగితే వేసవి తాపాన్ని, వడదెబ్బ నుండి రక్షిస్తుంది.

టిప్స్
-
పానకం లో ఉప్పు, పచ్చ కర్పూరం తెలిసితెలియనట్లు ఉండాలి అప్పుడే రుచి బాగుంటుంది.
-
లేత తులసి ఆకులు అయితేనే పానకం రుచి, దొరకనట్లైతే తులసి ఆకులు తరిగి వేసుకోండి.
పానకం | దక్షిణభారత దేశం లో ఎంతో ప్రాచుర్యం పొందిన పానకం - రెసిపీ వీడియో
Panakam | Bellam Panakam | Panakam Health Benefits | Sri Ramanavami Panakam | How to make Panakam
Prep Time 2 mins
Cook Time 5 mins
Total Time 7 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 75 gm బెల్లం
- 300 gm నీళ్ళు
- ఉప్పు – చిటికెడు
- 1/2 A pinch పచ్చకర్పూరం
- 10 - 12 తులసి ఆకులు
- 1/2 tsp యాలకలపొడి
- 1/2 tsp సొంటి పొడి
- 1 tsp నిమ్మరసం
- 1/2 tsp మిరియాల పొడి
విధానం
-
బెల్లం లో నీళ్ళు మిగిలిన పదార్ధాలన్నీ వేసి కరిగించాలి, తరువాత వడకట్టుకోవాలి
-
వడకట్టుకున్న పానకంలో మిరియాల పొడి, నిమ్మరసం, తులసి ఆకులు వేసి కలుపుకోవాడమే!

Leave a comment ×