పనీర్ కోఫ్తా బిర్యానీ

బిర్యానీ అనగానే కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది ఫుడ్ లవర్స్కి. ఆలాంటి మరో స్పెషల్ బిర్యానీ పనీర్ కోఫ్తా బిర్యానీ. వీకెండ్స్కి , పార్టీకి లేదా పనీర్ కోఫ్తా బిర్యానీ చాలా బాగుంటుంది.

పనీర్ బిర్యానీకి పనీర్ కోఫ్తా బిర్యానీకి రుచిలో తేడా ఉంది. రెండూ వేటికవే ప్రేత్యేకం. పనీర్ కోఫ్తా బిర్యానీ రెసిపీ కూడా దాదాపుగా హైదరాబాదీ ధం బిర్యానీలాగానే ఉంటుంది, దాదాపుగా అవే పదార్ధాలు కూడా కానీ ఈ బిర్యానీలో పనీర్లో మాసాలు వేసి వేపుతాము, ఇంకా కారం తక్కువుగా కమ్మగా ఉంటుంది.

ఒక్కో బిర్యానీకి ఒక్కో రుచి ఒక్కో తీరులో ధం చేయాలీ. కానీ ఈ పనీర్ కోఫ్తా ధం బిర్యానీ ధం చాలా సులభం. నాన్ వెజ్ బిర్యానీలలా అడుగు మాడుతుంది అని గాని, సరిగా ఉడకకుండా ఉంటుంది అనే భయం అవసరం లేదు. స్టెప్స్ టిప్స్ ఫాలో అయి చేస్తే బెస్ట్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు.

టిప్స్

కోఫ్తా:

  1. పనీర్ కోఫ్తాలు నేను నిమ్మకాయ సైజు చేశా మీరు కావలనుకుంటే ఉసిరికాయ లేదా ద్రాక్షపండు అంత సైజులోనూ చేసుకోవచ్చు.

  2. పనీర్ ఆలూ రెంటిలోనూ ఉన్న నీరు కోఫ్తాలు చేయడానికి సరిపోతుంది. అవసరమైతే tsp నీరు వేసుకోవచ్చు.

  3. కోఫ్తాలు నూనె వేసిన వెంటనే గరిట పెట్టకుండా ఒక నిమిషం వదిలేయండి, ఆ తరువాత నిదానంగా కలుపుతూ ఎర్రగా వేపుకుంటే పగలవు.

సోనా మసూరి బియ్యం:

  1. ఇదే బిర్యానీ మామూలు బియ్యంతో చేయాలనుకుంటే 80% ఉడికించి మరో 3 తబసప నీళ్ళు ఎక్కువగా పోసుకోండి ఇంకో 2 నిమిషాలు ఎక్కువ సేపు ధం చేసుకోండి.

80% ఉడకడం అంటే:

  1. మెతుకు మెదిపినా లేదా నోట్లో వేసుకున్నా తెలుస్తుంది, మొత్తంగా ఉడికి లోపల కొద్దిగా పలుకుగా తగులుతుంది. అంటే మరో 5 నిమిషాలు ఉడికిస్తే అన్నం మెత్తగా ఉడుకుతుంది అనే స్టేజ్.

పనీర్ కోఫ్తా బిర్యానీ - రెసిపీ వీడియో

Paneer Kofta Biryani recipe | Veg Kofta Biriyani | Kofte Ki Biryani

Biryanis | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Resting Time 20 mins
  • Total Time 50 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • పనీర్ కోఫ్తా కోసం
  • 150 gms పనీర్ తురుము
  • 2 ఉడికించిన ఆలూ తురుము
  • 1/4 tsp తెల్ల మిరియాల పొడి
  • 1/2 tsp నల్ల మిరియాల పొడి
  • 1/2 tsp పంచదార
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 2 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 1/2 tsp యాలకల పొడి
  • ఉప్పు
  • 2 tsp కార్న్ ఫ్లోర్
  • 1 tbsp మైదా
  • కోఫ్తా కర్రీ కోసం
  • 3 tbsp నెయ్యి
  • 2 tsp నూనె
  • 1 inch దాల్చిన చెక్క
  • 2 యాలకలు
  • 5 లవంగాలు
  • 1 బిర్యానీ ఆకు
  • 1 tbsp షాహీ జీరా
  • 1 అనాస పువ్వు
  • 1 ఉల్లిపాయ తరుగు
  • 1.25 అల్లం వెల్లులి పేస్ట్
  • 2 tbsp జీడిపప్పు పేస్ట్
  • 3 tbsp నీళ్ళు
  • 1/2 cup టొమాటో ముక్కలు
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 3/4 tsp గరం మసాలా
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 cup పెరుగు
  • 80 ml నీళ్ళు
  • 3 పచ్చిమిర్చి ముక్కలు
  • 2 tbsp పుదీనా
  • 2 tbsp కొత్తిమీర
  • రైస్ వండుకోడానికి
  • 2 cup బాస్మతి బియ్యం (300 gm)
  • 2 liters నీళ్ళు
  • 1 tbsp షాహీ జీరా
  • 2 Inches దాల్చిన చెక్క
  • 6 యాలకలు
  • 6 లవంగాలు
  • 1 నల్ల యాలక
  • 2 బిర్యానీ ఆకు
  • 2 మరతీ మొగ్గలు
  • 3 అనాస పువ్వు
  • 1.5 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 2 tbsp ఎండిన గులాబీ రేకులు
  • 3 పచ్చిమిర్చి ముక్కలు
  • 3 tbsp ఉప్పు
  • 3 tbsp పాలు
  • ధం చేసుకోడానికి
  • 3 tbsp నెయ్యి
  • 3 tbsp అన్నం వండుకున్న నీళ్ళు
  • 2 చిటికెళ్లు జాజికాయ పొడి
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • 1/2 tsp కుంకుమ పువ్వు నీళ్ళు

విధానం

  1. కోఫ్తా కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుకోండి.
  2. కలుపుకున్న పనీర్లో ఆఖరున మైదా కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి పగుళ్లు లేని ఉండలు చుట్టుకోండి
  3. కోఫ్తాలని వేడి నూనెలో వేసి కోఫ్తా పగలకుండా ఎర్రగా వేపుకుని తీసుకోండి
  4. కోఫ్తా కర్రీ కోసం నెయ్యి నూనె కరిగించి యాలకలు లవంగాలు షాహీ జీరా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అనాసా పువ్వు ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి
  5. ఉల్లిపాయ ఎర్రబడ్డాక అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోండి. వేగిన ఉల్లిపాయాల్లో టొమాటో ముక్కలు వేసి గుజ్జుగా అయ్యేదాక వేపుకోవాలి
  6. టొమాటో గుజ్జుగా అవుతుండగా కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
  7. నూనె పైకి వచ్చకా జీడిపప్పు ముద్ద కొద్దిగా నీళ్ళు వేసి బాగా వేపుకోవాలి.
  8. స్టవ్ ఆపేసి పెరుగు తగినన్ని నీళ్ళు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చీ ముక్కలు వేసి బాగా కలిపి ఒక పొంగు రానివ్వాలి.
  9. ఉడుకుతున్న గ్రేవీలో వేపుకున్న కోఫ్తాలు వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. నిమిషం తరువాత సగం కోఫ్తాలు సగం గ్రేవీ తీసి పక్కనుంచుకోండి. మిగిలినది బిర్యానీ చేసే గిన్నెలోనే ఉంచండి.
  10. రైస్ వండుకోడానికి ఎసరులో మసాలా సామానంతా వేసి మరగ కాగనివ్వాలి. మరుగుతున్న ఎసరులో నానుతున్న బాస్మతి బియ్యం, పాలు పోసి 80% ఉడికించుకోవాలి (80% ఉడకడం టిప్స్ చూడండి )
  11. 80% ఉడికిన బాస్మతి బియ్యం సగాన్ని వడకట్టి కోఫ్తా పైన వేసకోవాలి పక్కనుంచుకున్న కోఫ్తా గ్రేవీ కోఫ్తాలు మొత్తం రైస్ పైన పోసి మిగిలిన రైస్ కోఫ్తాల పైన వేసి సర్దుకోవాలి.
  12. రైస్ పైన జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు, నెయ్యి అన్నం ఉడికిన నీళ్ళు పోసి సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసి మూత పెట్టి సీల్ చేసి 12 నిమిషాలు సిమ్లో ధం చేసి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి
  13. 20 నిమిషాల తరువాత పైన ½ tsp కుంకుమపువ్వు నీళ్ళు పోసి అడుగునుండి అట్లకాడతో తీసి మిర్చీ కా సాలాన్తో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • S
    srimayyia
    Amazing recipe.Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 9722260
  • P
    Pavan
    Batchlars కి దేవుడు Sir మీరు. సూపర్