పనీర్ మటర్ మసాలా పులావ్

పార్టీలేకె కానివ్వండి వీకెండ్స్కె కానివ్వండి చేసిన ప్రతీ సారీ 100% మార్క్స్ పడే సింపుల్ రెసిపీ పనీర్ మసాలా పులావ్ కుక్కర్లో. కమ్మని నేతి సువాసనతో మసాలా ఘుమఘుమలతో కారంగా ఘాటుగా పుల్లగా అక్కడక్క తగిలే ఉల్లిపాయలతో మస్త్ మస్త్గా ఉంటుంది పనీర్ మటర్ మసాలా పులావ్.

పులావ్లు అనేకం, చేసే తీరు వేసే పదార్ధాలతో ఎన్నైనా చేసుకోవచ్చు నచ్చిన తీరులో. ఈ పులావ్ కూడా అలాగ సృష్టించినదే. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ.

సాధారణంగా పనీర్ పులావ్, బటాణీ పులావ్, లేదా రెండూ కలిపి చేసే పులావ్లు చేస్తూనే ఉంటారు. ఈ పులావ్ కూడా పనీర్ తాజా బటాణీ వేసి చేసే పులావ్ రెసిపీనే, కానీ వేసే పదార్ధాలు చేసే తీరు కాస్త భిన్నం.

ఈ పనీర్ మసాలా మటర్ పులావ్ రెసిపీ కమ్మని చల్లని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.

Paneer Matar Masala Pulao in cooker

టిప్స్

పనీర్:

పనీర్ ముక్కలని లేత బంగారు రంగు వచ్చే దాకా వేపితే రుచిగా ఉంటుంది. మరీ ఎర్రగా ఎపితే పులవ్లో ఉడికినా ఫ్లేవర్స్ ఇంకవు పనీర్లోకి

బటాణీ:

నేను ఫ్రోజెన్ బటాణీ వాడాను కాబట్టి లాస్ట్లో వేసాను మీరు తాజా బఠానీ వేయకనుకుంటే ఉల్లిపాయలు వేగిన తరువాత బటాణీ వేసి వేపుకోవాలి

బాస్మతి:

  1. నేను గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం వాడాను, ఈ బియ్యం కుక్కర్ లో చేసేప్పుడు కప్పుకి 1.5 కప్పుల నీరు సరిపోతుంది. 2 నీళ్లు పోసి ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది.

  2. మీరు సోనా మసూరి బియ్యం వాడుకోదలిస్తే గంట సేపు నానబెట్టిన బియ్యానికి కప్పుకి 2 కప్పుల నీళ్లు ఉండాలి 2 విజిల్స్ హాయ్ ఫ్లేమ్ మీద రానిచ్చి మూడో విజిల్ లౌ ఫ్లేమ్ మీద రానిచ్చి 20 నిమిషాలు వదిలేయాలి.

నెయ్యి-నూనె:

కమ్మని పులావ్ కోసం నేను నెయ్యి వాడాను, మీరు కావాలంటే నూనె వాడుకోవచ్చు లేదా రెండూ కలిపి వాడుకోవచ్చు.

ఊరబెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి:

వెనిగర్/నిమ్మరసం లో ఊరబెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు పులావ్లో ఆక్రున పైన వేస్తే అక్కడక్కడా పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. నచ్చకుంటే ఉల్లిపాయ వేయకపోయినా పర్లేదు.

పనీర్ మటర్ మసాలా పులావ్ - రెసిపీ వీడియో

Paneer Matar Masala Pulao in cooker

One Pot Recipe | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Resting Time 20 mins
  • Total Time 1 hr 45 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • ఉల్లిపాయ పచ్చిమిర్చి ఊరబెట్టడానికి
  • ఒక నిమ్మకాయ రసం
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1 ఉల్లిపాయ ముక్కలు
  • ఉప్పు
  • 1/4 tsp పంచదార
  • పులావ్ కోసం
  • 1/2 cup నెయ్యి
  • 1 బిరియానీ ఆకు
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 tsp షాహీ జీరా
  • జాపత్రీ - కొద్దిగా
  • 1/2 tsp మిరియాలు
  • 200 gm పనీర్
  • 2 ఉల్లిపాయ చీకిలికలు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1/2 cup టమాటో ముక్కలు
  • 1/2 cup ఫ్రోజెన్ బటాణీ
  • 2 cup గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం (1 cup 185 gm)
  • 3 cups నీళ్లు
  • 2 పచ్చిమిర్చి ముక్కలు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

విధానం

  1. ఉల్లిపాయ ఊరబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి కలిపి గంట సేపు ఊరబెట్టాలి.
  2. నెయ్యి కరిగించి అందులో డ్రై మసాలాలు అన్నీ వేసుకోండి.
  3. అందులోనే పనీర్ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. వేగిన తరువాత తీసుకోవాలి.
  4. మిగిలిన నెయ్యిలో ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్దా వేసి వేపి పసుపు ఉప్పు జీలకర్ర పొడి కొద్దిగా నీళ్ళు వేసి వేపుకోవాలి.
  6. వేగిన మసాలాలో టమాటో ముక్కలు బటాణీ వేసి 3 నిమిషాలు వేపండి. .తరువాత నానబెట్టిన బియ్యం వేసి చెమ్మగారే దాకా వేపుకోవాలి.
  7. బియ్యంలో చెమ్మారిన తరువాత ఎసరు నీళ్లు పోసి కలిపి పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర తరుగు వేపిన పనీర్ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి 2 విజిల్స్ హై - ఫ్లేమ్ మీద రానివ్వాలి. తరువాత సెటప్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి.
  8. 20 నిమిషాల తరువాత నిమ్మరసంలో ఊరిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వడకట్టి పులావ్ పైన వేసి అడుగునుండి కలిపి చల్లని రైతాతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • S
    Shalini b
    Recipe Rating:
    Simple and tasty
  • S
    Swathi Durga
    I tried this on last Sunday Taste was supb Tried this with home made paneer
  • S
    Susmitha
    Recipe Rating:
    Mi recipies chala try chesanu... Biryani cheyadam kastam anukuna gani visami food made this possible to do easily. Vismali food spl garam masala, gutti vankaya, karivepaku podi, nalla karam any recipe 1 chisedhi vismai food tq so much for wonderful tips
  • D
    Durga Bhavani
    I tried this recipe few days back...i cooked for 3 members ..i only ate full pulav all the day..I'm in luv with this receipe
  • M
    mahith
    Recipe Rating:
    Super recipe sir
Paneer Matar Masala Pulao in cooker