రసం రైస్ రెసిపీ | రసం సాదం
చేసిన వంటకి రుచి తృప్తి రావాలంటే ఏవేవో వేయక్కర్లేదు... అన్నీ కలిపి ఉడికిచ్చినా చాలు అంటుంటారు పెద్దలు అలాంటిదే రసం రైస్. తెలికాకగా ఏదైనా తినాలనుకున్నా, లంచ్కి డిన్నర్కి ఎప్పుడైనా తృప్తినిచ్చే రెసిపీ రసం రైస్.
రసం రైస్ తెలుగు వారి కంటే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళలో కూడా ప్రేత్యేకంగా వడ్డిస్తారంటే అర్ధం చేసుకోవచ్చు రసం సాదంని ఎంతగా ఇష్టపడతారో! రసం రైస్ అని అందరికీ అర్ధం అవ్వడానికి అన్నానే కానీ అసలు పెరు రసం సాదం. అంటే రసం అన్నం!

టిప్స్
-
రసం సాదం కాస్త జారుగా ఉండగానే దింపితే చల్లారిన తరువాత కాస్త బిగుసుకుంటుంది.
-
రసం సాదంకి నెయ్యి తాలింపు రుచిగా ఉంటుంది, నూనెతో పెట్టె తాలింపు కంటే
-
నేను రసం సాదంకి నేను రెడీమేడ్ రసం పొడి వాడాను.
-
రసం ఒకవేళ గట్టిగా ముద్దలా అయితే ఎప్పుడయినా వేడి వేడి నీళ్ళు కలిపితే జారవుతుంది.
రసం రైస్ రెసిపీ | రసం సాదం - రెసిపీ వీడియో
Rasam Rice | Wedding style Rasam Sadam recipe | Simple Recipe
Prep Time 2 mins
Soaking Time 1 hr
Cook Time 20 mins
Total Time 1 hr 22 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బియ్యం (గంట సేపు నానబెట్టినవి)
- 6 Cups నీళ్ళు
- 1 టొమాటో
- 50 gm చింతపండు (వేడి నీళ్ళలో నానబెట్టి తీసిన గుజ్జు)
- ఉప్పు
- 1.5 tbsp రసం పొడి
- 1/4 tsp పసుపు
- 2 tbsp పెసరపప్పు (గంటసేపు నానబెట్టినవి)
- 2 tbsp కందిపప్పు (గంటసేపు నానబెట్టినవి)
-
తాలింపు
- 2 tbsp నెయ్యి
- 1 tsp ఆవాలు
- 1/4 tsp ఇంగువ
- 2 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 2 కరివేపాకు రెబ్బలు
- కొత్తిమీర తరుగు – చిన్నకట్ట
విధానం
-
కుక్కర్లో నానబెట్టి బియ్యంలో పసుపు, నీళ్ళు, టొమాటో, పెసరపప్పు, కందిపప్పు వేసి 4.5 కప్పులు నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద 5 విసిల్స్ రానివ్వాలి.
-
చింతపండు గుజ్జులో ఉప్పు, రసం పొడి వేసి కలిపి ఉంచుకోవాలి.
-
ఉడికిన రసం సాదంలో నీళ్ళు చింతపండు గుజ్జు పోసి ఉడికిన అన్నంని కాస్త చిదుముకోవాలి. ఒక ఉడుకుపట్టాక దింపేసుకోవాలి.
-
తాలింపుకోసం నెయ్యి కరిగించి అందులో తాలింపు సమగ్రీ అంతా వేసి వేపుకుని రసం సాదంలో కలుపుకోవాలి.

Leave a comment ×
2 comments