రాయలసీమ పులగం పల్లీ పచ్చడితో
బియ్యం పొట్టు పెసరపప్పు కొద్దిగా మసాలాలు కొంచెం ఎక్కువ కారం వేసి చేసే రాయలసీమ పులగం తినడానికి సమయం సందర్భం అవసరమే లేదు. చేసినంత సేపు పట్టదు ఖాళీ చేయడం ఈ వన్ పాట్ రెసిపి. ఎంతో రుచి మరెంతో పరిమళం రాయలసీమ పులగం రెసిపీ.
పులగం అంటే కిచిడి. కిచిడిని తెలుగులో పులగం అనే అంటారు. అన్నం బియ్యం కలిపి వండేదాన్నని పులగం అంటారు తెలుగులో. అన్నం పప్పు కొద్దిగా ఉప్పు వేసి వన్డే పులగం తెలుగు వారందరూ చేస్తారు. కానీ రాయలసీమ ప్రాంతం వారు కాస్త భిన్నంగా చేస్తారు. అంటే పెసలకి బదులు అలసందలు వాడతారు. ఇంకా కొందరు చప్పగా ఉప్పు వేసి పులగం వేసి చేస్తే ఇంకొందరు కొద్దిగా మసాలాలు వేసి చేస్తారు. నేను మసాలాలు వేసి చేస్తున్నా. ఈ పులగం ఘాటుగా కారంగా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. వేడివేడిగా నెయ్యి పల్లీల పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.
ఈ సింపుల్ పులగం రెసిపీ వీకెండ్స్కి, లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వండుకుతుంటే మరింత రుచిగా అనిపిస్తుంది. నిజానికి నేను రాయలసీమ వాడిని కాదు, కానీ ఒకింత కారంగా ఉండే వారి వంటలు మమకారంతో వడ్డిస్తారు దానితో వంటకి మరింత రుచి చేకూరుతుంది అనిపిస్తుంది. ఈ రెసిపీ కూడా నేను కర్నూల్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రుచి చేసినదే!
వేడి వేడిగా పులగంలో పల్లీ పచ్చడి, లేదా పచ్చి పులుసు నంజుకు తినడం మాటల్లో చెప్పలేని అనుభూతి ఈ సింపుల్ కిచిడి.

టిప్స్
పులగం:
-
ఈ పులగం పొడి పొడిగా ఉంటుంది. రాగి ముద్దలా జిగురుగా ముద్దగా ఉండదు.
-
ఈ పులగంలో నెయ్యి వేసుకుని తింటారు. నూనె వేసి చేస్తారు. ఇంకా పల్లీ పచ్చడి లేదా నాన్ వెజ్తో సరైన జోడీ.
-
ఈ పులగంకి నచ్చితే పొత్తు లేని పెసరపప్పు, అలసందలు కూడ అవాడుకోవచ్చు నేను బద్దలుగా చేసిన పొత్తు పప్పు వాడాను.
పల్లీ పచ్చడి:
-
నేను చేస్తున్న పల్లీ పచ్చడి కారం పులగంలోకి సరిపోయేలా ఉంటుంది. మీరు అన్నంలో తినాలనుకుంటే 3-4 మిర్చి ఎక్కువగా వేసుకోండి
-
మీరు పచ్చడి ఎక్కువ మోతాదులో చేసి ఫ్రిజ్లో ఉంచుకోవాలనుకున్నా 3-4 మిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఫ్రిజ్లోకి చేరిన పచ్చడి చెప్పబడుతుంది కాబట్టి.
రాయలసీమ పులగం పల్లీ పచ్చడితో - రెసిపీ వీడియో
Rayalaseema Pulagam & Palli Chutney
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
పులగం కోసం
- 1 cup బియ్యం
- 1/2 cup పెసరపప్పు
- 1 tsp ఆవాలు
- 1/2 tsp మిరియాలు
- 1 tsp జీలకర్ర
- 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
- 1 ఉల్లిపాయ చీలికలు
- 2 రెబ్బల కరివేపాకు
- 4 పచ్చిమిర్చి చీలికలు
- 2 టమాటో ముక్కలు
- ఉప్పు
- 1/4 tsp పసుపు
- 3 cups నీళ్లు
-
పల్లీ పచ్చడి
- 1 cup వేరుశెనగగుళ్ళు
- 10 ఎండు మిర్చి
- ఉప్పు
- చింతపండు - ఉసిరికాయంత
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 1 టమాటో ముక్కలు
- 1 tbsp ధనియాలు
- 1 tsp జీలకర్ర
- 1/4 tsp పసుపు
- 7 - 8 వెల్లులి
- 3 tbsp నూనె
విధానం
-
పులగం కోసం:
కుక్కర్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆ తరువాత మిరియాలు వేసి వేపుకోవాలి.
-
ఆవాలు వేగిన తరువాత ఉల్లిపాయ చీలికలు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి.
-
ఉల్లిపాయలు మెత్తబడ్డాక అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోండి. వేగిన తరువాత టమాటో ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి.
-
గంట సేపు నానబెట్టిన బియ్యం గంట సేపు కడిగి నానబెట్టిన పొట్టు పెసరపప్పు వేసి చెమ్మరిపోయేదాకా వేపుకోవాలి.
-
చెమ్మారిన బియ్యంలో నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ హాయ్ ఫ్లేమ్ మీద 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి.
-
20 నిమిషాల తరువాత అడుగునుండి నెమ్మదిగా కలిపి పల్లీ పచ్చడి, పచ్చి పులుసుతో సర్వ్ చేసుకోండి.
-
పల్లీ పచ్చడి కోసం:
కప్పు పల్లీలని సన్నని సెగ మీద వేపి, చల్లార్చి పొత్తు తీసి ఉంచుకోవాలి.
-
మూకుడులో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
-
వేగిన ఎండుమిర్చి పొట్టు తీసుకున్న పల్లీలు నానబెట్టుకున్న చింతపండు తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనెలో ధనియాలు జీలకర్ర పసుపు ఉప్పు వేసి వేపుకోవాలి తరువాత టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేపి తీసి మీకేసీ జార్లో వేసి 3-4 సార్లు పల్స్ చేసి తీసుకొండి.
-
మెదిగిన పచ్చడిలో ఆఖరుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేడివేడిగా కిచిడి, అట్టు ఇడ్లీ ఇలా దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×