Sweets
5.0 AVERAGE
3 Comments

పండుగలకి పార్టీలకి ఇన్స్టంట్గా అయిపోయే సింపుల్ స్వీట్ పనీర్ పాయసం. టీ పెట్టినంత సులభం అంటుంటాను. చాలా తక్కువ పదార్ధాలతో కమ్మని రుచినిచ్చే బెస్ట్ స్వీట్ పనీర్ పాయసం.

ఈ పనీర్ పాయసం ఉత్తర భారత దేశం రెసిపీ పనీర్ ఖీర్గా ఇష్టంగా తింటారు. ఈ పాయసం వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కేవలం పాలు పనీర్ పంచదార డ్రై ఫ్రూట్స్ అంతే, అంత సింపుల్ రెసిపీ.

Paneer Payasam | Quick & Easy Paneer Kheer | Chanar Payesh

టిప్స్

పనీర్ గురుంచి:

  1. తాజా మృదువైన పనీర్ వాడితే పాయసం బాగుంటుంది.

  2. పనీర్ పాయసంలో వేయడానికి ముందు వేడి నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టి ఆ తరువాత పెద్ద రంధ్రాల వైపు తురుమి వేసుకోండి.

  3. పనీర్ నచ్చితే చేత్తో చిదిమి కూడా వేసుకోవచ్చు.

పాయసం ఫ్లేవర్ ఇలా మార్చండి:

  1. పాయసంలో నేను యాలకలపొడి వేశాను, నచ్చితే ఆకరున రోజ్ వాటర్ వేసుకోవచ్చు

  2. నేను డ్రై ఫ్రూట్స్ వేశాను, నచ్చితే తవోటీ ఫరోవతి కూడా వేసుకోవచ్చు కానీ ఆఖరున వేసుకోవాలి

బెల్లం తో చేసుకోదలిస్తే

  1. పంచడారకి బదులు బెల్లం వాడుకోదలిస్తే బెల్లం కరిగించి పాయసం పొయ్యి మీది నుండి దింపి పాకం వడకట్టి పోసి కలిపి చేసుకోండి

పనీర్ పాయసం - రెసిపీ వీడియో

Paneer Payasam | Quick & Easy Paneer Kheer | Chanar Payesh

Sweets | vegetarian
  • Cook Time 20 mins
  • Total Time 20 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms పనీర్
  • 750 ml పాలు
  • 1/4 cup పంచదార
  • 1/2 tsp యాలకలపొడి
  • 2 - 3 tbsp డ్రై ఫూట్స్ (కాజు బాదం, కిస్మిస్)

విధానం

  1. చిక్కని పాలని కలుపుతో బాగా మరిగించండి.
  2. తారువాత పంచదార వేసి 600 ml అయ్యేదాక మరిగించాలి.
  3. పాలఉ చిక్కబడ్డాక వేడి నీళ్ళలో నానబెట్టి తురిమిన పనీర్, యాలకలపొడి డ్రై ఫ్రూట్స్ వేసి వేసి 10 నిమిషాలు మరిగించాలి.
  4. ఫ్రిజ్లో పెట్టి చల్లగా లేదా వేడిగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

Paneer Payasam | Quick & Easy Paneer Kheer | Chanar Payesh