పర్ఫెక్ట్ రవ్వ ఉప్మా | సింపుల్ ఉప్మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో
బోరు అనే ఉప్మాని రోజూ తినాలనిపించెంత గొప్పగా చేయాలనుకుంటున్నారా? అయితే నా స్టైల్ స్పెషల్ “రవ్వ ఉప్మా” ట్రై చేయండి. ఈ సింపుల్ ఉప్మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
“ఉప్మా” దక్షిణ భారతదేశంలో ప్రతీ ఇంట్లో వారంలో రెండు రోజులైనా చేస్తారు. ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉన్నా, పెళ్ళిళ్ళకి అన్నింటికీ ఉప్మా చేస్తే సులభంగా పనైపోతుంది అనే ఉద్దేశంతోనే ఎక్కువ చేస్తారు. అంత ఎక్కువగా చేయడమే చేటయ్యింది ఈ తరానికి. ఉప్మా చూస్తే చాలు మొహం చిట్లించేస్తారు. కానీ నా స్టైల్లో చేసి చూడండి ఇష్టంగా తింటారు.
“ఉప్మా” చేసే తీరులో చేస్తే అందరూ ఇష్టంగా తింటారు, వాటికి కొన్ని పద్ధతులు కొలతలు టిప్స్ ఉన్నాయి అవన్నీ వివరంగా టిప్స్లో రెసిపీలో ఉన్నాయి చూడండి.

టిప్స్
-
బొంబాయ్ రవ్వలో జీలకర్ర వేసి సన్నని సెగ మీద కలుపుతూ వేపుతుంటే జీలకర్ర సువాసన రవ్వకి పట్టి ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.
-
నేను ఈ రెసిపీలో ఉల్లిపాయ వాడలేదు, నచ్చితే మీరు ఉల్లిపాయ వేసుకోవచ్చు.
-
ఏ కొలతకి ఉప్మా చేసిన కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు, 1 కప్పు పాలు పోసుకోవాలి.
-
పాలు ఉప్మాకి కమ్మదనంతో పాటు కొత్త రుచినిస్తుంది.
-
ఉప్పు మరుగుతున్న ఎసరులో వేస్తే పాలు విరిగిపోతాయ్, అందుకే వేపిన రవ్వలో కలిపి వేసుకోవాలి.
-
ఉప్మాలో శెనగపప్పు, మినపప్పు ఎక్కువగా ఉంటే ఎర్రగా కరకరలాడుతూ తగులుతుంటే రుచిగా ఉంటుంది.
-
నేను జీడిపప్పు వేశాను నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు.
-
ఎసరులో రవ్వ పోసి కలిపి 5 నిమిషాలు కలిపి దింపేయండి. ఎక్కువగా ఉడికిస్తే ఉప్మా గట్టిగా అయి మృదుత్వాన్ని కోల్పోయి చల్లారాక పొడి పొడిగా అవుతుంది.
పర్ఫెక్ట్ రవ్వ ఉప్మా | సింపుల్ ఉప్మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో - రెసిపీ వీడియో
Perfect Rava Upma | Secret Recipe For Perfect Upma | Tips to make perfect Upma Recipe | How to make Rava Upma | Easy Upma recipe for breakfast
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బొంబాయ్ రవ్వ
- 1 tsp జీలకర్ర
- 3 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 2 tsp పచ్చి శెనగపప్పు
- 2 tsp మినపప్పు
- 2 రెబ్బలు కరివేపాకు
- 1 tbsp అల్లం
- 15 జీడిపప్పు
- 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
- 1/4 cup నెయ్యి
- ఉప్పు రుచికి సరిపడా
- 1 cup పాలు
- 3 cup నీళ్ళు
విధానం
-
ముకుడులో రవ్వ జీలకర్ర వేసి సన్నని సెగ మీద రవ్వ మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకుని దింపేసుకోండి. రవ్వ సువాసన రావడానికి కనీసం 10 నిమిషాలు సమయం పడుతుంది.
-
ముకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, శెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి, తరువాత కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేపుకోవాలి.
-
వేగిన తాలింపులో నీళ్ళు పాలు పోసి హై-ఫ్లేమ్ మీద మరగ కాగనివ్వాలి.
-
వేపుకున్న రవ్వలో ఉప్పు కలిపి గరిటతో కలుపుతూ మరుగుతున్న ఎసరులో పోసుకోవాలి.
-
రవ్వని బాగా కలిపి 5 నిమిషాలు పాటు దగ్గర పడనిచ్చి, దింపి 5 నిమిషాలు వదిలేయండి.
-
ఆఖరున నెయ్యి వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
4 comments