పెసరపప్పు పూర్ణాలు
పండుగలకి వ్రతాలకి ఆంధ్రాలో కోనసీమ ప్రాంతంలో ఇష్టంగా చేసుకునే రెసిపీ పెసరపప్పు బూరెలు. తెలుగు వారి ఇళ్ళలో పూర్ణాలు లేకుండా ఏ శుభకార్యానికి పరిపూర్ణత రాదు అంటే అర్ధం చేసుకోవచ్చు పూర్ణాలు ఎంత ఇష్టంగా తింటారో తెలుగు వారు.
పూర్ణాలనే కొందరు బూరెలు అని కూడా అంటారు, అంతా ఒక్కటే. సాధారణంగా పూర్ణాలు-బూరెలు అంటే పచ్చిశెనగపప్పు ఉడికించి బెల్లం కలిపి ఉండలు చేసి మినపపిండి లో ముంచి ఎర్రగా వేపి తీస్తారు. పచ్చిశెనగపప్పుతో చేసే లోపలి స్టఫ్ఫింగ్ దాదాపుగా బొబ్బట్ల స్టఫ్ఫింగ్. కానీ ఈ పెసరపప్పు బూరెల స్టఫ్ఫింగ్ పూర్తిగా భిన్నం, వీటి రుచి తయారీ అన్నీ ప్రేత్యేకమే! ఈ రెసిపీలో నేను గంటల తరువాత కూడా బూరెలు క్రిస్పీగా ఉండే స్పెషల్ టిప్స్తో చెప్తున్న. ఈ టిప్స్తో చేస్తే సాదారణంగా గంటల తరువాత పూర్ణాలు మెత్తగా అయిపోతుంటాయ్, కానీ నా తీరులో గంటల తరువాత కూడా కరకరలాడుతూ ఉంటాయ్.

టిప్స్
పై పిండి:
-
సంప్రదాయ పద్ధతిలో లోపలి పూర్ణాన్ని అట్ల పిండిలో ముంచి వేస్తారు. నిజమే ఆ తీరులో వేడి మీద రుచిగానే అనిపిస్తాయ్. కాస్త చల్లారగానే మెత్తగా అయిపోతాయ్. అంత రుచిగా ఉండవు.
-
కానీ ఇలా పొడి బియ్యం పిండిలో నీళ్ళు కలిపి గంట సేపు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బిన మినప పిండి కలిపితే బూరెలు వేస్తే గంటల తరువాత కూడా కరకరలాడుతూ ఉంటాయ్.
-
పైపిండి ఒక్కో సారి మందంగా అయి తినేందుకు అంత రుచిగా అనిపించదు. అందుకే ఎప్పుడైనా పై పిండి నీళ్లతో పలుచన చేసుకున్నాక పిండిలో వేలు ముంచి చూడండి. వెలికి ఏ మందాన పిండి అంటుందో ఆ మందాన పూర్ణంకి పిండి అంటుతుందని గుర్తు.
పూర్ణం:
-
పెసరపప్పుని ఆవిరి మీద ఉడికించాక, పూర్తిగా చల్లారిన తరువాత మెడిపితే రవ్వగా అవుతుంది లేదంటే ముద్దగా అయిపోతుంది.
-
పాకంలో కూడా పెసరపప్పు రవ్వని వేసి నిదానంగా గడ్డలని చిదుముకుంటూ దగ్గరపడానివ్వాలి. గడ్డలు ఉంటే పాకం సరిగా పీల్చక చప్పగా ఉంటుంది.
పర్ఫెక్ట్ కొలతలు:
- ఏ కొలతకి చేసినా మినపప్పుకి రెండింతలు బియ్యం పిండి. మిగిలిన పెసరపప్పు బెల్లం పచ్చికొబ్బరి తురుము అన్నీ బియ్యం పిండికి సమానం.
పెసరపప్పు పూర్ణాలు - రెసిపీ వీడియో
Pesarapappu Burelu | Pesara Purnam burelu | Poornam boorelu | Polem Boorelu
Prep Time 5 mins
Cook Time 30 mins
Total Time 35 mins
Pieces 14
కావాల్సిన పదార్ధాలు
-
పై పిండికి
- 1/2 cup మినపప్పు (4 గంటలు నానబెట్టినది)
- 1 cup బియ్యం పిండి
- ఉప్పు – చిటికెడు
- నీళ్ళు తగినన్ని
-
పెసరపప్పు పూర్ణానికి
- 1 cup పెసరపప్పు (4 గంటలు నానబెట్టినది)
- 1 cup పచ్చి కొబ్బరి తురుము
- 1 1/4 cup బెల్లం తురుము
- 1/2 tsp యాలకల పొడి
- 1 tsp నెయ్యి
- 1 tbsp నీళ్ళు
- నూనె – బూరెలు వేపుకోడానికి
విధానం
-
బియ్యం పిండిలో ఉపపేసి నీళ్ళతో మెత్తగా తడిపి గంటసేపు నానబెట్టుకోవాలి.
-
మినపప్పుని నీళ్ళతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-
గంట నానిన బియ్యం పిండిలో రుబ్బుకున్న మినపపిండిని తగినన్ని నీళ్ళని కలిపి పక్కనుంచుకోండి (పై పిండి పర్ఫెక్ట్ గా ఏ జారులో ఉండాలో టిప్స్ చూడండి).
-
నానిన పెసరపప్పుని కాసిని నీళ్ళతో ఇడ్లీ పిండి అంత చిక్కగా అట్ల పిండి అంత మెత్తగా రుబ్బుకుని ఇడ్లీ ప్లేట్స్లో వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసుకోవాలి.
-
స్టీమ్ అయిన ఇడ్లీలు చల్లారాక తీసి ముక్కలు చేసి గడ్డలు లేకుండా రవ్వగా చేసుకోండి. (వేడి మీద ముద్దగా ఉంటుంది చల్లారాక రవ్వగా అవుతుంది).
-
పాన్లో నెయ్యి కరిగించి కొబ్బరి తురుముని ఒక నిమిషం వేపుకోవాలి. వేగిన కొబ్బరిలో బెల్లం నీళ్ళు పోసి బెల్లం కరిగి ఒక పొంగురానివ్వాలి.
-
పొంగుతున్న పాకంలో రవ్వగా చేసుకున్న పెసరపప్పుని గడ్డలు ఉంటే వాటిని చిదుముకుంటూ పాకం పీల్చి దగ్గరపడానివ్వాలి. తరువాత పూర్తిగా చల్లార్చి నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోండి.
-
పెసర ఉండలని కలిపి ఉంచుకున్న బియ్యం పిండిలో ముంచి పైకి లేపి నెమ్మదిగా విదిలిస్తే మందంగా ఉండే పిండి కిందికి జారీ పలుచున అవుతుంది, అప్పుడు వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని తీసుకోండి.
-
ఇవి గంటల తరువాత కూడా చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయ్.

Leave a comment ×
2 comments