పిజ్జా బ్రెడ్ సమోసా

Snacks
4.0 AVERAGE
4 Comments

చేసినంత సేపు పట్టదు ప్లేట్ ఖాళీ చేయడానికి అంతలా లాగించేస్తారు ఈ క్యూట్ పిజ్జా బ్రెడ్ సమోసాలని. తినడం మొదలెడితే ఎన్ని తింటున్నామో తెలియనివ్వకుండా తినిపించే ఈ చీస్ స్టఫ్ఫింగ్ సమోసా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో వివరంగా ఉంది.

సమోసా అంటే ఇష్టపడని వారు ఎవరు చెప్పండి. ఈ సమోసా పిజ్జా స్టఫ్ఫింగ్తో చీసీగా ఉంటుంది. బ్రెడ్ లేయర్స్తో కరకరలాడుతూ భలేగా ఉంటుంది. పార్టీస్కి లేదా స్టార్టర్గా బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ సమోసాలు చేసి ఫ్రీజ్ చేస్తే కనీసం నెల రోజులు నిలవ ఉంటాయ్.

కాబట్టి టైమున్నప్పుడు చేసి ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ తయార్!

Pizza Bread Samosa | Crispy Bread Samosa

టిప్స్

బ్రెడ్:

  1. ఈ పిజ్జా బ్రెడ్ సమోసా చేయడానికి కచ్చితంగా తాజా శాండ్విచ్ బ్రెడ్ ఉండాలి. మిల్క్ బ్రెడ్ కంటే శాండ్విచ్ బ్రెడ్ పర్ఫెక్ట్ ఈ సమోసాకి.

బ్రెడ్ షీట్స్:

  1. బ్రెడ్ అంచులని తీసేసి పలుచని షీట్స్గా ప్రెషర్ ఇస్తూ వత్తుకోవాలి. ముఖ్యంగా అంచులని మూలలని.

సమోసా మీద పగుళ్లు వస్తే:

  1. సమోసా మడుస్తున్నపుడు పగుళ్లు వస్తుంటాయ్ ఒక్కో సారి. అప్పుడు పగుళ్ళ దగ్గర మైదా పూస్తే చాలు

స్టఫ్ఫింగ్:

  1. నేను వేసినవే కాదు నచ్చితే పనీర్ తురుము, ఆలీవ్స్ లేదా పిజ్జాకి వాడేవి ఇంకేమైనా వేసుకోవచ్చు.

పిజ్జా బ్రెడ్ సమోసా - రెసిపీ వీడియో

Pizza Bread Samosa | Crispy Bread Samosa

Snacks | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 7 mins
  • Total Time 22 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 15 శాండ్విచ్ బ్రెడ్
  • స్టఫ్ఫింగ్ కోసం
  • 2 tsp ఎల్లో కాప్సికం తరుగు
  • 2 tsp గ్రీన్ కాప్సికం తరుగు
  • 2 tsp రెడ్ కాప్సికం తరుగు
  • 2 tsp స్వీట్ కార్న్
  • 1/2 tsp పిజ్జా సీసనింగ్
  • 1 1/2 tsp పిజ్జా సాస్
  • ఉప్పు – కొద్దిగా
  • 1/4 tsp మిరియాల పొడి
  • 1/2 tsp చిల్లీ ఫ్లేక్స్
  • 1 tbsp ఆలేపినోస్
  • 1.5 cup మొజారేల్లా ఛీస్
  • 1 tbsp బేసిల్ ఆకుల తరుగు (ఆప్షనల్)
  • నూనె – వేపడానికి
  • బ్రెడ్ని సీల్ చేయడానికి
  • 1 tbsp మైదా
  • నీళ్ళు

విధానం

  1. స్టఫ్ఫింగ్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి కలిపి పక్కనుంచుకోండి.
  2. బ్రెడ్ అంచులని తీసేయండి. తరువాత పలుచని షీట్స్గా రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా అంచులని, మూలని అదిమిపెట్టి వత్తి సమానంగా రోల్ చేసుకోండి.
  3. బ్రెడ్ షీట్లని సమోసా షీట్స్లా మధ్యకి టైయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి.
  4. మైదాలో నీళ్ళు కలిపి చిక్కని పేస్ట్ చేసి పక్కనుంచుకోండి.
  5. కట్ చేసుకున్న సమోసా షీట్స్ అంచులకి మైదా పూసుకోవాలి. తరువాత మధ్యలో స్టఫ్ఫింగ్ కొద్దిగా ఉంచి ముందు మూలని గట్టిగా అదిమిపెట్టి తరువాత మధ్యకి మడిచి గట్టిగా సీల్ చేయాలీ. పగుళ్ళు ఉంటే మైదా పూయాలి పగుళ్ళ మీద.
  6. తయారు చేసుకున్న సమోసాలని వేడి నూనెలో లేత బంగారు రంగు కంటే కాస్త ఎక్కువగా వేపి తీసుకుంటే బయటకి తీశాక ఎర్రటి రంగు వచ్చేస్తాయ్.
  7. ఈ సమోసాలు వేడిగా టొమాటో సాస్తో చెప్పలేనంత రుచిగా ఉంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

Pizza Bread Samosa | Crispy Bread Samosa