స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆలూ కూర్మ

చూడానికి ఆకర్షణీయంగా, చేయడానికి సులభంగా తిన్నకొద్దీ తినాలనిపించేలా ఉంటుంది డిల్లీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆలూ కుర్మా. డిల్లీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఉదయాన్నే పూరీతో ఇచ్చే ఘుమఘుమలాడే మసాలా పూరీ కర్రీ.

పూరీ కర్రీ దేశమంతట ప్రాంతానికి ఒక్కో తీరుగా చేస్తారు. ఇది డిల్లీ స్టైల్. ఈ ఆలూ కర్రీ ఉదయాన్నే డిల్లీలో బండ్లతో మొదలు టిఫిన్ సెంటర్లలో అన్నీ చోట్ల పూరీతో ఇస్తారు. ఈ ఆలూ కర్రీ చలి కాలంలో వేడి పూరీలతో ఇంకా రుచిగా అనిపిస్తుంది. ఈ ఆలూ కర్రీ అట్లతో నంజుడికి ఎంతో రుచిగా ఉంటుంది. ఎంతైనా దక్షిణాది వాడిని కదా. కాబట్టి ఏ రెసిపీ రుచి చూసినా మా రెసిపీస్ దేనితో బాగుంటుందో చూస్కుంటా అలా చెబుతున్నదే. నిజంగా కూడా దోశలతో, చపాతీల తో చాలా రుచిగా ఉంటుంది.

Potato Curry | Street Food Style Aloo Curry | Poori Curry | Puri Curry

టిప్స్

ఆలూ:

  1. ఈ కర్రీ రుచి మంచి ఆలూని ఎంచుకోవడంలోనే ఉంది. పాతవి మొలకలు వచ్చిన ఆలూ పిండిగా తియ్యగా, పిండిగా ఉంటూ అంత రుచిగా ఉండదు కర్రీ.

  2. ఆలూని పొందికగా ముక్కలుగా కోయకూడదు. ఉడికించిన ఆలూని చేత్తో మెదిపి కర్రీలో వేసుకోవాలి.

  3. కర్రీ చిక్కదనం కోసం ఆలూ వేశాక కొన్ని ముక్కలని మెదుపుకోవాలి, అప్పుడు కూర చిక్కబడుతుంది

  4. ఆలూ కర్రీ సన్నని సెగ మీద ఎక్కువసేపు మరిగితే మసాలాల రుచి ఆలూకి పట్టి చాలా రుచిగా ఉంటుంది.

స్ట్రీట్ ఫుడ్ టెస్ట్ కోసం ఇంకొన్ని టిప్స్:

  1. స్ట్రీట్ ఫుడ్ లాంటి ఎర్రటి రంగు రుచి రావాలంటే కాసింత నూనె ఉండాలి కూరలో.

  2. మసాలాలు బాగా కాగిన నూనెలో ఒక్కోటి వెంటవెంటనే వేసేయాలి అప్పుడు ఆ నూనె వేడికి మసాలాలు చిట్లి ఫ్లేవర్స్ వస్తాయ్.

  3. స్ట్రీట్ ఫుడ్ అంటే కచ్చితంగా అల్లం వెల్లులి పేస్ట్ ఉండాలి. నచ్చని వారు వేయనక్కర్లేదు.

స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆలూ కూర్మ - రెసిపీ వీడియో

Potato Curry | Street Food Style Aloo Curry | Poori Curry

Street Food | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 3 ఉడికించి మెదుపుకున్న ఆలూ
  • 4 tbsp నూనె
  • 1 tsp దంచిన ధనియాలు
  • 2 చిటికెళ్లు నాలిపిన వాము
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp సొంపు
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 1 cup టొమాటో తరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tsp ధనియాల పొడి
  • 3/4 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 1.25 tsp కారం
  • 1/2 tsp ఆమ్చూర్ పొడి
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • 400 ml నీళ్ళు
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 1 tsp కసూరి మేథి

విధానం

  1. పాన్లో నూనె వేడి చేసి అందులో సొంపు, జీలకర్ర, నలిపిన ధనియాలు, వాము వేసి వేపుకోవాలి.
  2. వేగిన మసాలాలో ఉల్లిపాయ తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి.
  3. అల్లం వెల్లులి పేస్ట్ వేగిన తరువాత మిగిలిన మసాలాలు అన్నీ వేసి వేపుకోవాలి.
  4. నూనె పైకి తేలాక టొమాటో తరుగు కాసిని నీళ్ళు పోసి టొమాటో మెత్తగా గుజ్జుగా అయ్యి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  5. వేగిన మసాలాల్లో మెదిపిన ఆలూ వేసి పాన్ అడుగుపట్టేదాక వేపుకోవాలి. ఆ తరువాత నీళ్ళు పోసి హాయిగహ ఫ్లేమ్ మీద ఒక పొంగు రావాలి.
  6. పొంగువచ్చిన తరువాత కొన్ని ఆలూని గరిటతో మెదుపుకోవాలి. ఆ తరువాత కసూరి మేథి నలిపి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి.
  7. దింపే ముందు ఒక్క సారి ఉప్పు కారాలు సరిచూసి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Jeera and saunf over sauté, hence it was not matched to your process. Next time I have to be very care in sauté
  • Y
    Yasaswy Tallam
    Recipe Rating:
    Great recipe! Easy to understand!
  • S
    Sumukh Goruganthu
    Recipe Rating:
    Super
Potato Curry | Street Food Style Aloo Curry | Poori Curry | Puri Curry