పుల్ల ఉప్మా | పులి ఉప్మా
టైమ్ లేనప్పుడు తక్కువ పదార్ధాలతో త్వరగా అయిపోయె వంటకం తెలుగు వారి సంప్రదాయ “పుల్ల ఉప్మా”. లంచ్ బాక్సులకి కూడా పర్ఫెక్ట్. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
ఈ ఉప్మా చూడడానికి పసుపు వేసిన ఉప్మాలా ఉంటుంది. కానీ ఈ పుల్ల ఉప్మా పుల్లగా కారంగా ఉంటుంది. ఇంకా ఈ ఉప్మా బియ్యం రవ్వతోనే చేస్తారు.
పుల్ల ఉప్మా అని మేం అంటాము, ఆంధ్రా గోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాలా వారు ఉప్పిన్డి అంటారు. పిలవడం ఎలా ఉన్నా తిన్నాక తలవడం మానరు అంత రుచిగా ఉంటుంది. ఈ పుల్ల ఉప్మా లో ఉల్లి వేయరు, కాబట్టి పండుగలప్పుడు కూడా చేసుకోదగ్గ వంటకం.

టిప్స్
-
ఈ రెసిపీలో పులుపు తెలిసీ తెలియనట్లు ఉండాలి. చాలా కొద్దిగా చింతపండు సరిపోతుంది.
-
రవ్వ పులుపు మీద ఉడకడానికి కాస్త టైమ్ పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి
-
రవ్వ మెత్తగా ఉడికినా వేడి మీద కాస్త ముద్దగా అనిపిస్తుంది చల్లారాక పొడిగా అవుతుంది.
-
ఈ ఉప్మాలో ఉల్లి వేయరు, నచ్చితే తాళింపులో ఉల్లిపాయ తరుగు వేసుకోవచ్చు.
-
బియ్యం రవ్వ పాతది అయితే ఇంకొంచెం అంటే ¼ కప్పు ఎక్కువ నీళ్ళు పట్టవచ్చు రవ్వ మెత్తగా ఉడకడానికి.
పుల్ల ఉప్మా | పులి ఉప్మా - రెసిపీ వీడియో
Pulusu Uppindi | Pulla Upma | How to make easy Quick Sour Upma
Prep Time 1 min
Cook Time 15 mins
Resting Time 10 mins
Total Time 26 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బియ్యం రవ్వ
- 3 tbsp వేరుశెనగపప్పు
- 3 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tbsp పచ్చి శెనగపప్పు
- 1 tbsp మినపప్పు
- 2 - 3 ఎండు మిర్చి
- 2 రెబ్బలు కరివేపాకు
- 1/2 tsp మిరియాల పొడి
- ఉప్పు
- 1/4 tsp పసుపు
- ఉసిరికాయంత చింతపండు నుండి తీసిన 3 కప్పుల నీళ్ళు ()
- 1 tsp జీలకర్ర
విధానం
-
బియ్యం రవ్వని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాక కలుపుతూ రంగు మారకుండా వేపుకోవాలి.
-
ముకుడులో నూనె వేడి చేసి అందులో వేరు శెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. పప్పు వేగుతుండగా ఆవాలు,శెనగపప్పు, మినపప్పు ఎండు మిర్చి జీలకర్ర మిరియాల పొడి వేసి వేపుకోవాలి.
-
వేగిన తాలింపులో చింతపండు నీళ్ళు, ఉప్పు పసుపు కరివేపాకు రెబ్బలు వేసి హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి.
-
మరుగుతున్న ఎసరులో వేపుకున్న బియ్యం రవ్వ పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రవ్వ మెత్తబడే దాకా ఉడకనివ్వాలి.
-
రవ్వ మెత్తగా ఉడికాక స్టవ్ ఆపేసి 10 నిమిషాలు వదిలేస్తే ఉప్మా బిగుసుకుంటుంది. వేడిగా ఉప్మా ఆవాకాయ పచ్చడి, లేదా కారం పొడితో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
4 comments