పంజాబీ ఆలూ మేథీ ఉంటే పండుగే

Curries
5.0 AVERAGE
3 Comments

కొన్ని సార్లు ఒక్క కూర చేసినా అందరికీ నచ్చేది చేస్తే చాలు ఇంకేమీ వద్దు అంటారు అలాంటిదే పంజాబీ స్టైల్ ఆలూ మేథీ. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినే సింపుల్ ఆలూ కర్రీ రెసిపీ.

బంగాళా దుంపలు మెంతి కూర కలిపి చాలా ప్రాంతాల్లో చేస్తారు కానీ పంజాబీ పద్ధతి చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల వారు మెంతి కూర వేపి ఉడికించిన ఆలూ కలిపి తాలింపు వేసి దింపేస్తారు. పంజాబీ పద్ధతి కూడా దాదాపుగా అంతే కానీ, వేసే మసాలాల కారణంగా కూర రుచి ప్రేత్యేకంగా ఉంటుంది.

పంజాబీ ఆలూ మేథీ పుల్లగా కారంగా ఘాటుగా చిరు చేదుగా వేడిగా అన్నంతో, రొట్టెలతో ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్

  1. ఆలూని చెక్కు తీసి 1.5 ఇంచుల ముక్కలుగా కోసుకోవాలి.

  2. ఆలూని 80% ఉడికించి దింపేస్తే చాలు. 80% అంటే ఫోర్క్ గుచ్చితే సులభంగా అలవోలోకి డిగాలి ఇంకా ఆలూ ఫోర్క్ని పట్టి నిలిచి ఉండాలి

  3. ఆలూని మూతపెట్టకుండా హై ఫ్లేమ్ మీదే ఉడికించాలి. అప్పుడు మరీ మెత్తగా ఉడకవు ఆలూ. ఉడికించిన ఆలూని వెంటనే తీసి మరో ప్లేట్లో వేసి చల్లారబెట్టాలి గాలికి. స్టవ్ ఆపేసి నీళ్ళలో వదిలేసినా ఆలూ మెత్తగా ఉడికిపోతుంది. కూర తయారయ్యేపాటికి గుజ్జుగా అయిపోతుంది.

మెంతి కూర:

  1. మెంతి కూర నూనెలో పసరు వాసన పోయి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి. అప్పుడు రుచిగా ఉంటుంది.

  2. నేను పెద్ద ఆకులు ఉండే మెంతి కూర వాడను నచ్చితే చిన్న ఆకులున్న మెంతి కూరా వాడుకోవచ్చు. కాకపోతే కొద్దిగా చేదు ఎక్కువగా ఉంటుంది అంతే

ఇంకొన్ని టిప్స్:

  1. ఆలూ మరీ పాతవి లేదా మొలకలు వచ్చినవి వాడితే ఆలూ తియ్యగా ఉంటుంది అంత రుచిగా ఉండదు కూర. కాబట్టి కొత్త ఆలూ వాడుకోండి

  2. నేను నూనెలో మెంతులు వేశాను సువాసన రుచి కోసం. మీకు నకచకుంటే మెంతులు వదిలేవచ్చు

  3. జీలకర్ర తాళింపులో వేసేప్పుడు నూనె మాంచి కాకమీద ఉంటే జీలకర్ర నూనెలో పడిపడగానే చిట్లుతాయ్, అప్పుడు పరిమళం కూరకి

పంజాబీ ఆలూ మేథీ ఉంటే పండుగే - రెసిపీ వీడియో

Punjabi style Aloo Methi curry | Sauteed Potatoes & Fenugreek Leaves Curry | Alu Methi

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms 1.5 అంగుళం బంగాళా దుంప ముక్కలు
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • కూరకి
  • 3 tbsp నూనె
  • 2 చిటికెళ్లు మెంతులు
  • 2 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 1/4 cup ఉల్లిపాయ
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • 1 tsp కారం
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp ధనియాల పొడి
  • ఇంగువ – 2 చిటికెళ్లు
  • ఉప్పు
  • 1/2 tsp గరం మసాలా
  • 1/4 tsp చాట్ మసాలా
  • 100 gms మెంతికూర ఆకులు
  • 2 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 1 tsp నిమ్మరసం

విధానం

  1. నీళ్ళలో చెక్కు తీసుకున్న ఆలూ ముక్కలు, ఉప్పు పసుపు వేసి 80% ఉడికించి తీసి చల్లారబెట్టాలి.
  2. ముకుడులో నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి ఎర్రబడనివ్వాలి.
  3. తరువాత ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేపుకుని ఉల్లిపాయ తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోండి.
  4. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే ఇంగువ ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడనివ్వాలి. ఆ తరువాత అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోండి.
  5. అల్లం ముద్ద వేగిన తరువాత జీలకర్రపొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి వేపుకోండి.
  6. మెంతి కూర ఆకు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోండి. నూనె పైకి తేలాక ఉడికించిన ఆలూ వేసి నెమ్మదిగా కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు వేగనివ్వాలి.
  7. దింపే ముందు పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం పిండి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    What a taste. Feel like in heaven.
  • M
    Monika
    Recipe Rating:
    I have tried this recipe and it is very good. I have followed the tips as suggested by you. Thank you for sharing this
  • A
    Ananthakumar
    In Telugu write up in description of Aloo Methi kura, I find a grammatical mistake. Please verify twice in future. నేను పెద్ద ఆకులు వున్న మెంతి కూర వాడాను (used it) బదులుగా వాడను (I don't use it) అని టైప్ అయ్యింది. But Your all recipes are super with your voice gives garnishing to your dishes and videos 👍
Punjabi style Aloo Methi curry | Sauteed Potatoes & Fenugreek Leaves Curry | Alu Methi