పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్

Sweets
5.0 AVERAGE
1 Comments

10 నిమిషాల్లో తయారయ్యే బెస్ట్ స్వీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రా స్పెషల్ పాకం పూరీలు 100% పర్ఫెక్ట్ స్వీట్. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

పాకం పూరీలు ఇవి ఆంధ్రుల ప్రేత్యేకమైన వంటకం...ఇవి చేయడం ఎంతో సులభం. ఇవి కనీసం 10 రోజుల పైన నిలవుంటాయ్. మా యింట్లో స్వీట్ తినాలనిపించినా, లేదా పూరీలు చేసే రోజు మరి కొంచెం పిండి ఎక్కువ కలిపి కూడా ఇవి చేస్తుంటాం. పూరీలు మిగిలినిపోయినా మరో పద్ధతిలో ఇవి చేస్తుంటాం.

ఇంకా మా ఇంట్లో పాలు దగ్గరగా కాచి ఈ పాకం పూరీలు వేసి కూడా తింటుంటాం. ఎటొచ్చీ మొత్తానికి చాల ఎక్కువగా ఈ రెసిపీ చేస్తూనే ఉంటాం. ఇవి చాలా బాగుంటాయ్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయ్. ఇవి దాదాపుగా ఆంధ్రా అంతటా చేస్తున్నా, గోదావరి జిలాల్లో చాలా ఎక్కువగా చేయడం నేను చూసాను.

ఇవి మామూలు పూరిలా లాగే చేస్తారు కాని చిన్న మర్పులున్నాయ్ అంతే.

pakam puri sweet puri

టిప్స్

• మైదా కి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు

• పూరిలని పల్చగా వత్తుకుంటే క్రిస్పీ గా వస్తాయ్, అల కావాలనుకుంటే ఇదే విధంగా చేసుకోవచ్చు. అవీ కూడా బాగుంటాయ్

• ఈ పూరిలను ఇదే కొలతలతో బెల్లం పాకం తో కూడా చేసుకోవచ్చు, అవీ చాలా బాగుంటాయ్

• పాకం తీగపాకం వస్తే పూరీలు కనీస 10 రోజులు నిలవుంటాయ్

• ఇవి మిగిలినిపోయిన పూరిలతో చేసుకోదలిస్తే పాకం లో వేసి పూరిలను ఓ నిమిషం మరగనిచ్చి దిమ్పెసుకోండి, అప్పుడు పూరీలు పాకాన్ని పీలుస్తాయ్

పాకం పూరీలు | ఈ పద్ధతి లో పూరీలు చేస్తే కనీసం 15 రోజులు నిలవుంటాయ్ - రెసిపీ వీడియో

Puris in Syrup | Pakkam Puri | How to make Sweet Puri

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Total Time 21 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • పూరిలకి
  • 250 gms మైదా/ గోధుమ పిండి
  • 1/4 spoon ఉప్పు
  • 3 tbsp నెయ్యి
  • పాకానికి
  • 500 gm పంచదార
  • 1 tsp యలకల పొడి
  • 150 ml నీళ్ళు

విధానం

  1. ముందుగా పిండి లో ఉప్పు నెయ్యి వేసి బాగా కలుపుకొండి. ఆ తరువాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి మెత్తగా వత్తుకోండి
  2. బాగా వత్తుకున్నాక 30 నిమిషాలు తడి గుడ్డ కప్పి పక్కనుంచుకోండి
  3. ఇప్పుడు పాకం కోసం పంచదార లో నీళ్ళు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోండి, తరువాత యాలకల పొడి వేసి దింపేయండి
  4. నానుతున్న పిండిని నిమ్మకాయంత బాల్స్ గా చేసుకుని పల్చగా గుండ్రంగా వత్తుకోండి
  5. ఆ తరువాత పూరి పైన నెయ్యి రాసి మధ్యకి మడిచి, మళ్ళీ మధ్యకి మరో మడత వేసి మందంగా వత్తుకోండి
  6. ఈ పూరీ మందంగా లేదా పల్చగా ఎలా వత్తుకున్నా బాగుంటుంది, కాని పల్చగా వత్తుకుంటే క్రిస్పీ గా వస్తాయ్. మందంగా వత్తుకుంటే పూరీలు పొంగి జ్యుసీ గా ఉంటాయ్
  7. వేడి వేడి నూనెలో వేసి పూరీలు పొంగనిచ్చి, వెంటనే వేడి పాకం లో వేసి 30 సెకన్లు ఉంచి తీసెయ్యండి
  8. వేడి వేడిగా జ్యుసీగా చాలా బాగుంటాయ్. చల్లారాక కూడా పూరిల పైన పంచదార పాకం ఏర్పడి అవీ రుచిగా ఉంటాయ్
  9. ఇవి డబ్బాలో దాచుకుంటే కనీసం వారం పాటు నిలవుంటాయ్

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    srimayyia
    Recipe Rating:
    a very famous breakfast .Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 9722260,
pakkam puri sweet puri