ముల్లంగి పచ్చడి

తెలుగు వారి తీరు ముల్లంగి పచ్చడి నోటికి కారంగా ఘాటుగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఇడ్లీ అట్టు గారెలతో పాటు వేడిగా నెయ్యి వేసిన అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

ముల్లంగి ముక్కలు చింతపండు ఎండుమిర్చి వేసి చేసే ఈ పచ్చడి ఫ్రిజ్లో నెలరోజులు నీరు తగలకుండా బయట ఉంచితే 15 రోజులు నిల్వ ఉంటుంది. ముల్లంగి పచ్చడి తీరు కూడా టమాటో పచ్చడికి మల్లె ఉంటుంది. కానీ వేసే పదార్ధాల కొలతలు రుచి భిన్నంగా ఉంటుంది.

మిలిగిలిన దక్షిణాది వారితో పోలిస్తే తెలుగు వారికి ముల్లంగి వాడకం తక్కువే!!! చాలా సార్లు ముల్లంగి వాసన నచ్చదు అనేవారు ఎక్కువ. కానీ ఈ తీరులో చేసే పచ్చడి మాంచి పరిమళంతో చాలా రుచిగా ఉంటుంది.

పచ్చడి రుచితో పాటు నిల్వ ఉంచుకునే తీరు కోసం టిప్స్ చుడండి:

Radish Chutney | Mullangi Chutney

టిప్స్

ముల్లంగి:

  1. ముల్లంగి ముక్కలు ఎక్కువ నూనె లో ఎర్రగా వేగాలి అప్పుడే ముల్లంగి ఘాటు వాసన తగ్గుతుంది.

  2. నీరుతో ఉండే ముల్లంగి ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేపుకోవాలి

నూనె:

ఈ పచ్చడికి నేను వేసినంత మాత్రం నూనె ఉండాలి, లేదంటే పచ్చడి ఎండిపోయినట్లుగా అయిపోతుంది

చింతపండు:

వేగిన నాలుగు వందల గ్రాముల ముల్లంగి ముక్కలకు సుమారు 100 గ్రాములు గింజలు తీసేసిన చింతపండు అవసరమవుతుంది. కాస్త పులుపు కావాలనుకుంటే చింతపండు పెంచుకోండి అలాగే ఉప్పు ఎండు మిరపకాయలు కూడా పెంచుకోవాలి.

గ్రైండ్ చేసే తీరు:

  1. గ్రైండింగ్ ముందుగా ధనియాలు మిరపకాయలు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పొడి మాదిరి చేయకూడదు.

  2. పచ్చడి గ్రైండింగ్ కి అవసరమైతే 2-3 tbsp నీరు పోసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు.

ముల్లంగి పచ్చడి - రెసిపీ వీడియో

Radish Chutney | Mullangi Chutney

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 15

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms ముల్లంగి
  • 1 inch అల్లం
  • ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు
  • 1/2 tsp పసుపు
  • 1/2 cup నూనె
  • 1/2 cup ధనియాలు
  • 25 - 30 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • ఉప్పు
  • తాలింపు కోసం
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు

విధానం

  1. ముల్లంగి చెక్కు తీసి ఒకే తీరుగా చైనా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ⅓ కప్పు నూనె వేడి చేసి ముల్లంగి ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చే దాకా వేపుకోవాలి.
  3. 15 నిమిషాలకి ముల్లంగి ఘాటు తగ్గి లేత బంగారు రంగులోకి వేగుతాయ్, అప్పుడు ఉల్లిపాయ అల్లం పసుపు వేసి 3-4 నిమిషాలు వేపుకోవాలి.
  4. ఉల్లిపాయ కాస్త మగ్గిన తరువాత చింతపండు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపి తీసి పక్కనుంచుకోవాలి.
  5. అదే మూకుడులో మిగిలిన నూనె వేడి అందులో ఎండుమిర్చి వేసి మిరపకాయలని పొంగనివ్వాలి.
  6. పొంగిన మిరపకాయల్లో ధనియాలు జీలకర్ర కొద్దిగా పసుపు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకుని తీసుకోవాలి.
  7. మిక్సీ జార్లో ధనియాలు ఎండుమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన ధనియాల కారంలో వేపిన ముల్లంగి ముక్కలు ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. (అవసరమైతే 2-3 tbsp వేడి నీళ్లు పోసుకోవాలి).
  8. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేపి ముల్లంగి పచ్చడిలో కలిపేసుకోవాలి.
  9. ఈ పచ్చడి నీరు తగలకుండా గాజు సీసాలో ఉంచితే కనీసం 15 రోజులు బయట నెల రోజుల పైన ఫ్రిజ్లో ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

Radish Chutney | Mullangi Chutney