రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ

బోనెల్స్ చికెన్కి మాసాలాలూ దట్టించి ఊరబెట్టి జీడీపప్పు వేసి కలిపి నూనెలో ఎర్రగా వేపి తీసే పకోడీ చేసినంత సేపు పట్టదు ఖాళీ చేయడం. ముక్క ముక్కలో కరకరలాడే కాజు ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్కి లేదా పార్టీస్కి ట్రై చేసి చుడండి, ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అంతే!

ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రీ స్పెషల్ రెసిపీ ఈ కాజు చికెన్ పకోడీ. నేను మొదటి సారి ఈ రేసీపీ రాజమండ్రీలో ఒక చిన్న హోటల్లో తిన్నాను, చాలా సింపుల్ ఫ్లేవర్స్తో ఎంతగానో నచ్చేసింది. వెంటనే హోటల్ ఓనర్ని అడిగితే ఇది రాజమండ్రీ స్పెషల్ అని రెసిపీ కూడా షేర్ చేశారు.

వారు కమర్షియల్ స్టయిల్లో చేశారు, నేను చిన్న మార్పులతో చేస్తున్నాను. ఈ కాజు చికెన్ పకోడీ కూడా దాదాపుగా చికెన్ పకోడీలాగానే చేసుకోవాలి, కానీ వేసే పదార్ధాలు కాస్త భిన్నం అంతే!

ఈ రెసిపీలో పర్ఫెక్టుగా చికెన్ ఎలా వేపుకోవాలి, ఎలా వేపితే చికెన్ లోపలి దాకా ఉడుకుతుంది లాంటి టిప్స్తో ఉంది. చెస్ ఏముంది ఒక్క సారి టిప్స్ జాగ్రత్తగా ఫాలో అవుతూ చేసుకోండి.

Rajamundry Special Chashew Chicken Pakodi | Kaju Chicken Pakodi

టిప్స్

చికెన్:

నూనె బాగా వేడెక్కాక మంట పూర్తిగా తగ్గించండి లేదా నూనె బాగా ఎక్కువగా వేడెక్కితే స్టవ్ ఆపేసి జీడిపప్పు ముక్కలు చికెన్కి అద్ది నూనెలో ఒక పావుకిలోనే వేసుకోండి.

చికెన్ ముక్కలు వేసాక మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి 10-12 నిమిషాలు వేపితే ముక్క ముందు లోపలిదాకా మగ్గుతుంది, ఆ తరువాత హై ఫ్లేమ్లోకి మంట పెంచి ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.

చికెన్ మూకుడు సైజుకి మించి వేస్తే వేడెక్కిన నూనె చల్లబడి ముక్క సరైన తీరుగా వేగదు.

కోటింగ్:

చికెన్లో ఎగ్ వేస్తేనే పైన కోటింగ్ జారిపోకుండా చక్కగా పట్టుకుంటుంది. నీళ్లతో కలిపితే వేగేప్పుడు కోటింగ్ ఊడిపోతుంది. ఇంకా జీడీపప్పుని పట్టుకుంటుంది.

ఏ కారణం చేతనైన పిండి లూస్ అయితే కాస్త కారన్ఫ్లోర్ కలుపుకోండి.

నిజానికి చికెన్ పకోడికి సెనగపిండి కాస్త బియ్యం పిండి వాడుకోవాలి. నేను కార్న్ ఫ్లోర్ మైదా వాడాను.

నచ్చితే మీరు సెనగపిండి మైదా కలిపి వాడుకోవచ్చు.

బియ్యం పిండి తగిలితే పకోడీ వేడి మీద కరకరలాడుతూ ఉంటుంది. కానీ, చల్లారితే బిరుసెక్కిపోతుంది ముక్క.

పకోడీ వేపే తీరు:

నూనె బాగా వేడెక్కాక మాన్తా పూర్తిగా తగ్గించండి లేదా బాగా ఎక్కువగా వేడెక్కితే స్టవ్ ఆపేసి జీడిపప్పు ముక్కలు చికెన్కి అద్ది నూనెలో ఒక పావుకిలోనే వేసుకోండి.

చికెన్ ముక్కలు వేసాక మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి 10-12 నీంసిహాలు వేపితే ముక్క ముందు లోపలిదాకా మగ్గుతుంది, ఆ తరువాత హాయ్ ఫ్లేమ్లోకి మంట పెంచి ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.

చికెన్ మూకుడు సైజుకి మించి వేస్తే వేడెక్కిన నూనె చల్లబడి ముక్క సరైన తీరుగా వేగదు.

ఆఖరుగా:

రాజమండ్రీలో నేను తిన్న దగ్గర అజినొమొటో వేశారు రుచి చాలా బాగుంది. కానీ ఈ రెసిపీ నేను అజినొమొటో వేయడం లేదు. నచ్చితే మీరు వేసుకోండి.

రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ - రెసిపీ వీడియో

Rajamundry Special Chashew Chicken Pakodi | Kaju Chicken Pakodi

Starters | nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Resting Time 2 hrs
  • Total Time 2 hrs 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kg బోనెల్స్ చికెన్
  • మసాలా పేస్ట్ కోసం
  • 5 పచ్చిమిర్చి
  • 10 వెల్లులి
  • 1.5 inch అల్లం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp జీలకర్ర పొడి
  • 3/4 tsp గరం మసాలా
  • 1 1/4 tsp కారం
  • 1/4 tsp పసుపు
  • 1 tsp కసూరి మేథీ
  • చికెన్ నానబెట్టుకోడానికి
  • 1.5 tbsp నిమ్మరసం
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 tbsp బీట్ చేసుకున్న గుడ్డు
  • 3 tbsp కార్న్ ఫ్లోర్
  • 1 tbsp మైదా
  • 2 tbsp కరివేపాకు తరుగు
  • కొత్తిమీర - కొద్దిగా
  • 100 gms జీడీపప్పు
  • నూనె - వేపుకోడానికి
  • 5 - 6 పచ్చిమిర్చి
  • కరివేపాకు - 3 రెబ్బలు పైన చల్లుకోడానికి

విధానం

  1. మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  2. బోనెల్స్ చికెన్ని ముప్పావు ఇంచ్ మందంగా రెండు ఇంచుల పొడవుగా కోసుకోండి.
  3. తరుక్కున్న చికెన్కి మసాలా పేస్ట్ నిమ్మరసం ఉప్పు కరివేపాకు తరుగు గుడ్డు పట్టించి కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోండి. నేను రాత్రంతా నానబెట్టాను.
  4. నానిన చికెన్లో కొత్తిమీర తరుగు, కార్న్ ఫ్లోర్, మైదా వేసి కోటింగ్ గట్టిగా కలుపుకోండి.
  5. జీడిపప్పు పలుకులు వేసి ప్రతీ చికెన్ ముక్కకి గట్టిగా అద్ది మరిగే వేడి నూనె మాన్తా అతగ్గించి ముక్కలు వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
  6. అదే నూనె లో ఆఖరుగా పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేపి చికెన్ పైన వేసి వేడి వేడిగా నిమ్మచెక్క ఉల్లిపాయ తరుగుతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • S
    Srinivas Jammugani
    Recipe Rating:
    Adhbhuthaha anthe....
  • R
    Ratna kumari
    Tried this recipe ....came out very well and tasty teja garu
  • R
    rohit
    Recipe Rating:
    That was an amazing treat for us and we tried and used cashew from this brand https://trupery.com/product-category/nuts-and-kernels/natural-raw-nuts-and-kernels/cashew-nut/ and it was a really good one...
Rajamundry Special Chashew Chicken Pakodi | Kaju Chicken Pakodi