తమిళనాడులో అడైలు ఎన్నో ఉన్నాయి. అన్నీ వేటికవే ప్రత్యేకం. అన్నీ రుచిగా ఆరోగ్యకరమైన అడైలున్నాయ్. అడై కి అట్టుకి చిన్నా తేడా ఉంది, ఆ తేడా రుచి, రూపం రెండింటిలోనూ ఉంది. అడైలో వేసే పదార్ధాలు అడైని బట్టి మారిపోతుంటాయ్. అడైలు ఎక్కువగా బెల్లం నంజుకుతింటారు. ఇంకా చట్నీ సాంబార్ ఎలాగూ ఉంటాయి. తమిళనాడులో సాయంత్రాలు అడై దుకాణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.

“అడై చాలా తక్కువ టైం లో చేసుకోగలిగిన టిఫిన్. అడై అంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటుంది. పిండి కూడా జస్ట్ 30 నిమిషాల్లో అయిపోతుంది.

Rava Adai Recipe | Rava Kara Adai Dosa Recipe | How to make Rava Adai

టిప్స్

తమిళనాడు స్టైల్ అడై కి కొన్ని టిప్స్:

• అడై పిండి ఎక్కువగా నానకూడదు. పిండి నానితే అడై కరకరలాడడం పోతుంది.

అడై పిండి ఫ్రిజ్లో ఉంచి వాడుకోవచ్చా?

• ఫ్రిజ్లో ఉంచి రెండో రోజూ వాడుకోవచ్చు. కానీ, పిండి కాస్త చిక్కగా ఉంచితే కరకరలాడుతూ వస్తాయి అడైలు అడైలు అట్లులా పోయాకూడదు

• అడైలు కాస్త మందంగా ఉండాలి అట్లు మాదిరి పల్చగా పోయకండి.

• అడై పోసే ముందు ఉల్లిపాయ రుద్దితే అడై పెనం కి అంటుకోకుండా వస్తుంది

• అడై నాన్-స్టిక్ పెనాల మీద కంటే కాస్ట్ ఐరన్ పెనాల మీద చాలా బాగా కాలతాయ్

• అడై దోస పిండిలా పల్చగా గరిటతో తిప్పలేము. అందుకే నిదానంగా కాస్త మందంగా వేసుకోండి.

Rava Adai Recipe | Rava Kara Adai Dosa Recipe | How to make Rava Adai

రవ్వ అడై - రెసిపీ వీడియో

Rava Adai Recipe | Rava Kara Adai Dosa Recipe | How to make Rava Adai Dosa

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 5 mins
  • Resting Time 30 mins
  • Total Time 40 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బొంబాయి రవ్వ
  • 2 tbsps బియ్యం పిండి
  • ఉప్పు
  • 1/2 cup పుల్లటి పెరుగు
  • 1/3 cup నీళ్ళు
  • 2 tbsp పచ్చికొబ్బరి తరుగు
  • 2 tbsps కేరట్ తురుము
  • 2 tbsps ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp కరివేపాకు తరుగు
  • 2 tbsps కొత్తిమీర తరుగు

విధానం

  1. రవ్వలో బియ్యం పిండి, పుల్లటి పెరుగు, ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసి పిండిని గట్టిగా కలుపుకుని 30 నిమిషాలు పక్కనుంచుకోండి.
  2. 30 నిమిషాల తరువాత మిగిలిన సామానంతా వేసి కొద్దిగా నీళ్ళు కలుపుకుని పిండిని కాస్త గట్టిగా ఇడ్లి పిండిలా కలుపుకోండి.
  3. ఇప్పుడు పెనం మీద నూనె రాసి ఓ సారి ఉల్లిపాయ తో రుద్ది పిండి ని ఉతప్పంలా మందంగా స్ప్రెడ్ చేసుకుని పైనా అడై అంచుల వెంటా నూనె వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోండి.
  4. ఓ సైడ్ ఎర్రగా కాలాకా మరో వైపు తిప్పి కాలుచుకుని వేడి వేడిగా టమాటో పచ్చడి లేదా సెనగపప్పు చట్నీతో తినండి.
  5. ఇవి వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.