రవ్వ ఖజూర్
రవ్వలో పంచదార డ్రై ఫ్రూట్స్ కలిపి ఎర్రగా వేపి తీసే ఈ ఖజూరాలు బయట కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. ఇవి కనీసం వారం రోజులు నిలవుంటాయ్, కానీ అందాక ఉంటె గొప్పే… ఎందుకంటె చేసిన కొన్ని నిమిషాల్లో ఖాళీ అయిపోతాయ్!!!
ఈ సింపుల్ స్వీట్ రెసిపీ ముస్లిమ్స్ చేసే గుల్గుల్ స్వీట్కి దగ్గరగా ఉంటుంది, కానీ దీని రుచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక రోజు విస్మయ్ ఫుడ్ టీమ్ అంతా రవ్వతో ఏదైనా సింపుల్ స్వీట్ చేయాలనుకున్నాం, అది మాములుగా అందరికి తెలిసినదిగా ఉండకూడదు సింపుల్గా ఉండాలి ఇలా కొన్ని నిర్ణయించుకుని సెట్ చేసిన రెసిపీ!!!
మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు :శరవణా భవన్ స్టయిల్ రవ్వ కేసరి

టిప్స్
నీళ్లు: రవ్వని పంచదార పీల్చుకునేంత పోసుకోవాలి. పిండి మెత్తని బొండాల పిండి ఉండ మాదిరి ఉండాలి. ఇది అర్ధ,ఎం చేసుకుని నీరు పోసుకోవాలి.
కొబ్బరి: నేను రెడీమేడ్గా దొరికే ఎండుకొబ్బరి పొడి వాడేశాను, మీరు ఎండుకొబ్బరి తురుము కూడా వాడుకోవచ్చు.
చెర్రీలు: చెర్రీలు అంటే నిజమైన చెర్రీలు కావు, భారతీయులు పిలుచుకునే చెర్రీలు ఇవి. ఇవి పంచదార పాకంలో ఊరబెట్టిన వాక్కాయలు (గరొండా హిందీలో). పండిన వాక్కాయలని రంగు పంచదార పాకంలో ఊరబెట్టినవి. ఇవే వెనుకటికి ఐస్క్రీమ్ మీద పెట్టి చెర్రీలు అని ఇచ్చేవారు. ఆ చెర్రీలు నేను వాడింది. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వాడుకోవచ్చు
పైనాపిల్ ఎసెన్స్: ఆఖరున వేసే 4-5 బోట్ల ఎసెన్స్ ఎంతో ఫ్లేవర్నిస్తుంది ఖజూరాలకి. లేని వారు వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోండి. రెండూ లేవంటే యాలకులపొడి వేసుకోండి.
వేపే తీరు: ఖజూర్లు మరిగే వేడి నూనెలో వేసి 2-3 నిమిషాలు వదిలేయండి, అప్పుడు గట్టి పడతాయ్, ఆ తరువాత తిప్పుకుంటూ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసుకోవాలి. నూనెలోనే ఎర్రగా వేపితే చల్లారేపాటికి నల్లగా అయిపోతాయి. వేడి మీద ఖజూర్లు మెత్తగా అనిపిస్తాయి, చల్లారాక కరకరలాడుతూ గట్టిగా అవుతాయి.
రవ్వ ఖజూర్ - రెసిపీ వీడియో
Rava Khajoor | How to Make Rava Khajoor with Tips
Prep Time 1 min
Cook Time 15 mins
Resting Time 30 mins
Total Time 46 mins
Servings 15
కావాల్సిన పదార్ధాలు
- 1 ½ cups Bombay Rava/బొంబాయి రవ్వ
- ½ cups Coconut Powder/కొబ్బరి పొడి
- 1 cup Sugar/పంచదార
- ¼ cup Cherries (Grated)/చేర్రీల తరుగు
- 2 tbsp Dry dates/ఎండు ఖర్జూరం తరుగు
- 1 tbsp Oil/నూనె
- 1 tsp Baking Powder/బేకింగ్ పౌడర్
- ½ tsp Cardamom Powder/యాలకల పొడి
- 4-5 drops Pineapple Essence/పైనాపిల్ ఎసెన్స్
- Oil for Frying/నూనె వేపుకోడానికి
- ¼ - 1/3 water/నీళ్లు
విధానం
-
రవ్వలో నూనె, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి.
-
కొబ్బరి పొడి చెర్రీల తరుగు, ఎండు ఖర్జూరం ముక్కలు కొద్దిగా నీరు వేసి రవ్వని నిమురుతూ తడపండి
-
తడిచిన రవ్వలో పంచదార యాలకులపొడి ఇంకా మిగిలిన నీరుపోసి రవ్వని ముద్దగా తడిపి ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి
-
ముప్పై నిమిషాలు నానిన రవ్వలో పైనాపిల్ ఎసెన్స్ వేసి కలుపుకోండి
-
మరిగే వేడి నూనెలో బొండాల మాదిరి వేసి 2- నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనిస్తే ఖజూరాలు గట్టి పడతాయ్.
-
3 నిమిషాల తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ మీడియం మీదే లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసి జల్లెడలో లేదా బుట్టలో వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తరువాత గాలి చొరని డబ్బాలో పెట్టి ఉంచితే వారం రోజులు నిలవుంటాయ్.

Leave a comment ×
5 comments