నాకెంతో ఇష్టమైన టిఫిన్స్ లో రాగి రవ్వ దోశ ఒకటి. ఎందుకంటే ఇన్స్టంట్ ఇంకా తక్కువ నూనెతో ఎర్రగా కాలుతుంది. ఆడగాలే గాని ఇన్స్టంట్ అయిపోయె దోశలు ఇంటికోటి చెప్తారు దక్షిణ భరత దేశంలో. అలా పుట్టినదే ఈ రాగి రవ్వ దోశ రెసిపీ కూడా.

రవ్వ దోశ అందరికీ తెలిసినదే, నేను ఇది వరకే రవ్వ దోశకి పర్ఫెక్ట్ టిప్స్తో పోస్ట్ చేశా చూడండి. ఈ రాగి రవ్వ దోశ కూడా దాదాపుగా మామూలు రవ్వ దోశ మాదిరే చేసుకోవాలి. కానీ వేసే పదార్ధాలు కాస్త భిన్నం అంతే!

ఈ సింపుల్ రవ్వ దోశ చేయడం చాలా తేలికే అయినా కొన్ని టిప్స్తో చేస్తేనే పల్చగా కరకరలాడుతూ వస్తుంది.

Instant Finger Millet Rava Dosa | Ragi Rava Dosa | Finger Millet Sooji Dosa

టిప్స్

పెనం:

  1. రవ్వ దోశకి పెనం చాలా ముఖ్యమైనది. కాస్ట్ ఐరన్, మందంగా ఉండే ఇనుప పెనాల మీద అట్లు ఎంతో క్రిస్పీగా వస్తాయి, మామూలు నాన్స్టిక్ పెనాల మీద వేసే అట్ల కంటే.

  2. అట్టు పోసే ముందు పెనం అంతా సమానంగా బాగా వేడెక్కి ఉండాలి, ఇంకా మంట పెనం అంతా తగిలేలా చూసుకోవాలి. అంటే పెనం మధ్యన మంట వచ్చి అంచుల దాకా మంట చెరనట్లైతే అత్తలు మధ్యన ఎర్రగా కాలుతుంది అంచులు మెత్తగా ఉంటాయ్. కాబట్టి అట్టు పోసాక మధ్యన రంగు మారుతుండగా పెనాన్ని జరుపుణతూ అన్నీ వైపులా కాలనివ్వాలి. అప్పుడు అట్టు పర్ఫెక్ట్గా కాలుతుంది.

  3. రవ్వ అట్టు మామూలు అట్టు కంటే కాస్త నిదానంగా కాలుతుంది కాలాలి కూడా అప్పుడే అట్టు కరకరలాడుతూ వస్తుంది. కాబట్టి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ వైపులా పెనాన్ని జరుపుకుంటూ కరకరలాడేట్టు కాల్చుకోవాలి.

పిండి:

  1. పిండి పలుచగా పలుచని మజ్జిగ అంత చిక్కగా ఉండాలి అప్పుడు అట్టు త్వరగా కరకరలాడేట్టు కాలుతుంది.

  2. అట్టు పిండి అడుగునుండి కలిపి పైన తేటని మాత్రమే తీసుకుని అట్టు పోసుకోవాలి అప్పుడు పలుచన పిండి వస్తుంది.

  3. మూడు నాలుగు అట్లు పోశాక పిండి చిక్కబడుతుంది అప్పుడు ¼ కప్పు నీళ్ళు చిటికెడు ఉప్పు వేసి కలిపి అట్టు పోసుకుంటే అట్టు పలుచగా వస్తుంది.

  4. రాగి పిండిలో జిగురు చాలా తక్కువ అందుకే గోధుమపిండి వేశాను. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు.

  5. నేను అట్టు రుచి కోసం పిండిని పలుచని మజ్జిగతో తడిపాను, మీరు కావాలంటే అచ్చంగా నీళ్ళతో తడుపుకోవచ్చు.

రాగి రవ్వ దోశ - రెసిపీ వీడియో

Instant Finger Millet Rava Dosa | Ragi Rava Dosa | Finger Millet Sooji Dosa

Breakfast Recipes | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 25 mins
  • Resting Time 10 mins
  • Total Time 37 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup రాగి పిండి
  • 1 cup బొంబాయ్ రవ్వ
  • 1/3 cup గోధుమ పిండి
  • ఉప్పు
  • 2 రెబ్బల కరివేపాకు తరుగు
  • ఇంగువ – చిటికెడు (ఆప్షనల్)
  • 1 tbsp మిరియాల పొడి
  • 1 tsp జీలకర్ర
  • 2 tsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 1 liter పలుచని మజ్జిగ
  • 1/2 liter నీళ్ళు
  • అట్టు కాల్చుకోడానికి
  • నూనె – అట్లు కాల్చుకోడానికి
  • ఉల్లిపాయ తరుగు అట్టు పైన చల్లుకోడానికి

విధానం

  1. అట్టు పిండికి ఉంచిన పదార్ధాలన్నీ మజ్జిగతో బాగా కలిపి 10 నిమిషాలు వదిలేయండి.
  2. 10 నిమిషాల తరువాత నెళ్లతో పలుచన చేసుకోండి.
  3. పెనం మీద 3-4 బొట్లు నూనె వేసి దాని మీద ఉల్లిపాయ తరుగు చల్లి రాగి పిండిని బాగా కలిపి పైన తేట పెనం అంతా పలుచగా పోసుకోండి.
  4. అట్టు మద్య ఎర్రబడుతుండగా అట్టు అంచుల వెంట మధ్యన నూనె వేసి పెనం అంతా అన్నీ వైపులా ఎర్రగా కరకరలాడేటు కాలుచుకోండి (పర్ఫెక్ట్గా దోసాను కాల్చడానికి టిప్స్ చూడండి).
  5. అట్టు ఎర్రగా కాలితే పెనం నుండి విడిపోతుంది అప్పుడు మధ్యకి మడిచి కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితో సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Instant Finger Millet Rava Dosa | Ragi Rava Dosa | Finger Millet Sooji Dosa