అరటికాయ బజ్జి | వంట సోడా వాడకుండా తక్కువ నూనె పీల్చేలా టిప్స్ తో
ఇంటికి బందువులొస్తే అప్పటికప్పుడే చేసుకునే బెస్ట్ స్నాక్ అరటికాయ బజ్జి. ఈ సింపుల్ స్నాక్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.
“అరటికాయ బజ్జి” మాంచి టీ టైమ్ రెసిపీ. ఇప్పటికీ ఆంధ్రాలో ఫంక్షన్ లో ప్రేత్యేకంగా చేస్తారు. అరటికాయ బజ్జి చేయడం చాలా తేలిక.
నా టిప్స్ తో చేస్తే తక్కువ నూనె పీలుస్తాయ్. వేడిగా ఉన్నప్పుడు ఒక్కటి తిందాం మొదలెడితే ఇక ఆపలేరు తినడం, అంత బాగుంటాయ్. చాలా తేలికగా తక్కువ సమయంలో అయిపోయే బెస్ట్ స్నాక్.

టిప్స్
అరటికాయ:
- పచ్చి అరటికాయ ని మరీ పల్చగా కోయకండి. అలా చేస్తే వేగాక లోపల అరటికాయ పూర్తిగా మగ్గిపోయి తినెప్పుడు నోటికి అందదు.
పిండి:
- పిండి కలుపుకున్నకా పిణిలో వేలు ముంచి పైకి లేపితే వెలికి ఏ మందాన పిండి అంటుతుందో ఆ మందాన అరటికాయకి అంటుతుంది.
వంట సోడా:
- పిండి లో వంట సోడా వేస్తే వేడి మీద బాగానే ఉంటాయ్, చల్లారాక అంత రుచిగా ఉండవు. ఇంకా నూనె కూడా బాగా లాగేస్తాయ్.
అరటికాయ బజ్జి | వంట సోడా వాడకుండా తక్కువ నూనె పీల్చేలా టిప్స్ తో - రెసిపీ వీడియో
Raw Banana Fritters | Raw Banana Bajji | Crispy & Tasty Snack | Crispy Banana Bajji Snack recipe | Aratikaya Bajji
Snacks
|
vegetarian
Prep Time 10 mins
Cook Time 15 mins
Total Time 25 mins
Servings 12
కావాల్సిన పదార్ధాలు
- 2 కూర అరటికాయలు
- 1.5 cup సెనగపిండి
- 2 tbsp బియ్యం పిండి
- 3/4 tsp కారం
- ఉప్పు
- 1/4 spoon పసుపు
- 1 tsp జీలకర్ర
- 2 tsps వేడి నూనె
- నీళ్ళు తగినన్ని
- నూనె వేపుకోడానికి
విధానం
-
అరటికాయకున్న చెక్కుని పల్చగా తీసేయ్యాలి, మరీ లోపల తెల్లగా ఉండే కండ కనపడేలా తీయకూడదు.
-
తరువాత పొడవుగా ¼ ఇంచ్ ముక్కలుగా కోసుకోవాలి.
-
సెనగపిండి లో మిగిలిన సామానంతా వేసి బాగా కలిపిన తరువాత వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి, ఆ తరువాత తగినన్ని నీళ్ళు చేర్చి జారుగా పిండి కలుపుకోవాలి.
-
తరుగుకున్న అరటికాయ ముక్కలు పిండి లో వేసి ముంచి పైకి లేపితే పల్చగా పిండి పట్టుకుంటుంది అరటికాయ, అప్పుడు వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద లైట్-గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆ తరువాత హై ఫ్లేం లోకి పెట్టి ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని తీసుకోవాలి.
-
ఇవి వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment ×
8 comments