పచ్చిమామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి | దీని రుచి సూపర్
పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి కలిపి వండకుండా చేసే ఈ స్పెషల్ పచ్చడి టిఫిన్స్ అన్నంలోకి ఎంత తిన్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఎంతో రుచిగా ఉండే పచ్చి మామిడికాయ మిర్చి పచ్చడి రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.
వేసవి వచ్చిందంటే మామిడికాయల రేసిపీస్ మొదలు, పచ్చళ్ళు, జ్యుసులు, జ్యాములు ఒకటా ఎన్నో ఎన్నో. ఈ రెసిపీ సింపుల్ చట్నీ. ఈ చట్నీ పూర్తిగా పచ్చిగా ఉంటుంది, దీనికి ఉడికించుకోవడాలు, వేపుకోవడాలు ఏమి లేవు. జస్ట్ పచ్చి కూరగాయ ముక్కలతో చేసే పచ్చడి ఇది. పుల్లపుల్లగా కారంగా భలేగా ఉంటుంది.
ఇది అన్నం, ఇడ్లీ, అట్టు, వడ ఇలా దేనితోనైనా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
-
వేరుశెనగపప్పు 5-6 గంటలు బాగా నానాలి. అప్పుడు పచ్చి వాసన లేకుండా రుచిగా ఉంటుంది పచ్చడి.
-
పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఉప్పు పులుపు సరిచేసుకోవాలి.
పచ్చిమామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి | దీని రుచి సూపర్ - రెసిపీ వీడియో
Raw Mango Green Chillies Chutney | No Cooking No frying | Instant Raw Mango Chutney | How to make Raw Mango Green Chilli Chutney
Prep Time 2 mins
Soaking Time 2 hrs
Cook Time 3 mins
Total Time 2 hrs 5 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 100 gm పచ్చిమామిడి ముక్కలు
- 15 - 20 పచ్చిమిర్చి (మీడియం కారం ఉన్నవి)
- 1/2 cup వేరుసెనగపప్పు
- ఉప్పు
-
తాలింపుకి
- 1 tsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp మినపప్పు
- 1/2 tsp జీలకర్ర
- 1 రెబ్బ కరివేపాకు
విధానం
-
వేరుసెనగపప్పుని కడిగి కనీసం రెండు గంటలు నానబెట్టాలి
-
2 గంటల తరువాత మిక్సీలో నానిన వేరుసెనగపప్పు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-
ఇప్పుడు నూనె వేడి చేసి తాలింపు సామాను ఒక్కొటిగా వేసుకుంటూ మాంచి సువాసన వచ్చేదాకా వేపి పచ్చడి లో కలిపేయండి.

Leave a comment ×